న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'విరాట్ కోహ్లీ లేకుండా గెలిస్తే.. టీమిండియాకు ఏడాదంతా సంబరాలే'

IND vs AUS: Michael Clarke says If India wins Test series without Kohli, They can celebrate for a year

సిడ్నీ: కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ లేకున్నా టీమిండియా టెస్టు సిరీస్‌ గెలిస్తే ఏడాదంతా సంబరాలు చేసుకోవచ్చని ఆస్ట్రేలియా మాజీ సారథి మైఖేల్‌ క్లార్క్‌ అన్నాడు. కోహ్లీ స్థానాన్ని ఎవరూ భర్తి చేయలేరని, కానీ కేఎల్‌ రాహుల్‌ ఆ స్థానంలో బాగా ఆడతాడని పేర్కొన్నాడు. అజింక్య రహానె గొప్ప ఆటగాడని, కెప్టెన్సీ సైతం బాగా చేస్తాడని క్లార్క్‌ తెలిపాడు. ఆస్ట్రేలియా గడ్డపై ప్రస్తుతం జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్‌లో ఏ ఒక్క సిరీస్‌ను టీమిండియా గెలుచుకునే పరిస్థితే లేదని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ ఇప్పటికే ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. అతడు చెప్పినట్టే కోహ్లీసేన ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయింది.

కోహ్లీ స్థానంలో రాహుల్‌ ఆడగలడు:

కోహ్లీ స్థానంలో రాహుల్‌ ఆడగలడు:

తాజాగా మైఖేల్‌ క్లార్క్‌ ఇండియా టుడేతో మాట్లాడుతూ... 'విరాట్‌ కోహ్లీకి రెండు బాధ్యతలు ఉన్నాయి. ఒకటి కెప్టెన్సీ, రెండోది బ్యాటింగ్‌. టీమిండియాకు కోహ్లీ అందుబాటులో ఉంటే కెప్టెన్సీ పరంగా, బ్యాటింగ్‌ పరంగా బలంగా ఉంటుంది. అయితే కోహ్లీ స్థానంలో ఎవరు బ్యాటింగ్‌ చేస్తారు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్‌ బాగా ఆడగలడు. అతడెంతో నైపుణ్యం ఉన్న ఆటగాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇంతకుముందు ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం కూడా ఉంది. దాంతో ఈసారి రాణించగలడు. కానీ కోహ్లీ లేని లోటు మాత్రం ఎవరూ భర్తీ చేయలేరు' అని అన్నాడు.

ఓడిస్తే ఏడాది పాటు సంబరాలు:

ఓడిస్తే ఏడాది పాటు సంబరాలు:

'అజింక్య రహానె అంటే నాకు చాలా ఇష్టం. అతడో గొప్ప ఆటగాడు. కెప్టెన్సీ కూడా బాగా చేస్తాడు. వ్యూహాత్మకంగానూ మెరుగైన కెప్టెన్. అది టీమిండియాకు ఉపయోగకరం. విరాట్ కోహ్లీ ఆడకపోవడాన్ని ఓ అవకాశంగా పరిగణించాలి. అక్కడ బాగా రాణించడానికి ప్రయత్నించి చరిత్ర సృష్టించాలి. ఒకవేళ కోహ్లీ లేకుండానే భారత్.. ఆస్ట్రేలియాను దాని సొంతగడ్డ మీద ఓడిస్తే ఏడాది పాటు సంబరాలు చేసుకోవచ్చు. అది నమ్మశక్యం కాని విజయంగా మారుతుంది. టీమిండియా పటిష్టంగా ఉంది. ఆసీస్‌ను ఓడించగలం అనే విశ్వాసాన్ని వారు కోల్పోకూడదు' అని ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్‌ క్లార్క్‌ పేర్కొన్నాడు.

పితృత్వ సెల‌వులపై:

పితృత్వ సెల‌వులపై:

టీమిండియా ఇప్పటికే రెండు వన్డేల్లో ఓటమిపాలై ఈ సిరీస్‌ను కోల్పోయింది. విరాట్ కోహ్లీ ఉన్నా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అతడు లేకుండా టెస్టు సిరీస్‌ గెలవడమంటే కష్టమనే చెప్పాలి. చివరి వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో అయినా విజయాలు సాధించి టెస్టు సిరీస్‌పై నమ్మకం కలిగించే బాధ్యత కోహ్లీపైనే ఉంది. కోహ్లీ ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ త‌ర్వాత ఇండియాకు తిరిగి రానున్న సంగ‌తి తెలిసిందే. అత‌ని భార్య అనుష్క శ‌ర్మ బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుండ‌టంతో విరాట్ పితృత్వ సెల‌వులపై మ‌ధ్య‌లోనే భారత్ రానున్నాడు.

మారడోనా మృతిపై అనుమానాలు.. వ్యక్తిగత వైద్యుడి ఇల్లు, క్లినిక్‌లో సోదాలు!!

Story first published: Monday, November 30, 2020, 18:15 [IST]
Other articles published on Nov 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X