Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫించ్‌, స్మిత్‌ శతకాలు.. దంచికొట్టిన మాక్స్‌వెల్.. భారత్‌ లక్ష్యం 375!!

India vs Australia: Steve Smith, Aaron Finch hits hundreds, Team India target 375

సిడ్నీ: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ క్రికెట్ మైదానంలో భార‌త్‌తో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌లు పరుగుల వరద పారించారు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (114; 124 బంతుల్లో 9x4, 2x6)‌, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (105; 66 బంతుల్లో 11x4, 4x6) సెంచ‌రీలు బాదగా.. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (69; 76 బంతుల్లో 6x4), హిట్టర్ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (45; 19 బంతుల్లో 5x4, 3x6) మెరుపు బ్యాటింగ్‌ చేశారు. దీంతో భారత్‌ ముందు 375 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు.

భారత బౌలర్లలో మొహ్మద్ షమీ 3 వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ, యుజ్వేంద్ర చహల్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు. కంగారూ బ్యాట్స్‌మెన్ జోరు ముందు టీమిండియా బౌల‌ర్లు తేలిపోయారు. దీనికితోడు చెత్త ఫీల్డింగ్ కూడా ఆసీస్ భారీ స్కోరుకు కార‌ణ‌మైంది.

అదిరే శుభారంభం

అదిరే శుభారంభం

టాస్ గెలిచిన ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ అదిరే శుభారంభం ఇచ్చారు. ఇన్నింగ్స్ ఆదిలో వార్నర్, ఫించ్ ఆచితూచి ఆడారు. క్రీజులో కుదురుకున్నాక మాత్రం ఇద్దరూ బ్యాట్ జులిపించారు. 38 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదాన్ని ఫించ్ చెలరేగిపోయాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఫించ్.. కాసేపటికే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరోకొద్దిసేపటికి వార్నర్ కూడా 50 పరుగుల మార్క్ అందుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 27.5 ఓవర్లలో 156 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేశారు. వార్నర్‌ను ఎట్టకేలకు షమీ ఔట్ చేయడంతో.. భారీ భాగస్వామ్యానికి తెరపడింది.

ఫించ్ శతకం.. స్మిత్ దూకుడు:

ఫించ్ శతకం.. స్మిత్ దూకుడు:

వార్నర్ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన స్టీవ్ స్మిత్ దూకుడుగా ఆడాడు. ఇక వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సులు బాదిన ఫించ్ శతకం బాదాడు. బుమ్రా బౌలింగ్‌లో ఫించ్ ఔటయ్యాక.. క్రీజ్‌లోకి వచ్చిన మార్కస్ స్టోయినిస్ తొలి బంతికే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఆపై బ్యాటింగ్‌కు దిగిన మ్యాక్స్‌వెల్.. స్మిత్‌తో కలిసి ఆకాశమే చెలరేగాడు. ఐపీఎల్‌లో ఒక్క సిక్స్ కూడా బాదలేకపోయిన మ్యాక్స్‌వెల్.. ఈ మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. చూసుండగానే హాఫ్ సెంచరీకి చేరువగా వచ్చాడు. ఊపు మీదున్న మ్యాక్సీని షమీ పెవిలియన్ చేర్చడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.

బుమ్రా 10 ఓవ‌ర్లలో 73 ప‌రుగులు:

బుమ్రా 10 ఓవ‌ర్లలో 73 ప‌రుగులు:

మ్యాక్స్‌వెల్ ఔట్ అయినా మరో ఎండ్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ 62 బంతుల్లోనే సెంచరీ బాదాడు. దీంతో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. స్మిత్ 11 ఫోర్లు, 4 సిక్స‌ర్లు కొట్టాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ ధాటికి టీమిండియా స్టార్ బౌల‌ర్ బుమ్రా త‌న ప‌ది ఓవ‌ర్ల కోటాలో 73 ప‌రుగులు స‌మ‌ర్పించుకోగా.. చహ‌ల్ 89, సైనీ 83 ప‌రుగులు ఇచ్చారు. షమీ మాత్ర‌మే 59 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవ‌డం విశేషం. ఫీల్డర్ల తప్పిదాలు, అదనపు బౌలర్ జట్టులో లేకపోవడం.. ఈ మ్యాచ్‌లో భారత్‌ను దెబ్బతీశాయి.

వైరల్ ఫొటోస్.. వివాహబంధంతో ఒక్కటైన స్టార్ రెజర్లు!!

Story first published: Friday, November 27, 2020, 13:56 [IST]
Other articles published on Nov 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+