Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైరల్ ఫొటోస్.. వివాహబంధంతో ఒక్కటైన స్టార్ రెజర్లు!!

Wrestlers Bajrang Punia and Sangeeta Phogat tie the knot

ముంబై: భారత్‌కు చెందిన స్టార్ రెజ్లర్లు బజరంగ్‌ పునియా, సంగీతా ఫోగట్‌లు వివాహబంధంతో ఒక్కటయ్యారు. నవంబరు 26, గురువారం వీరి వివాహ వేడుక ఘనంగా ముగిసింది. వీరి వివాహానికి సంబంధించిన చిత్రాలను వారిద్దరూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. వివాహంలో కూడా అద్భుతమైన వేడుక ఉందంటూ భజరంగ్‌ పునియా తన ఉద్వేగాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ బాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌, హాకీ క్రీడాకారిణి రాణీ రాంపాల్‌తో సహా పలువురు ఆ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

బజరంగ్‌ పునియా తన పాపిట్లో సిందూరం అద్దుతున్న చిత్రాన్ని సంగీతా ఫోగట్‌ షేర్‌ చేశారు. 'నీ వల్ల నా జీవితం పరిపూర్ణమైంది. నువ్వే నా ఆత్మబంధువు. నా జీవితంలో ఈ కొత్త అధ్యాయం ప్రేమ, సంతోషాలతో నిండి ఉంటుంది' అనే వ్యాఖ్యను దానికి జోడించారు. తాము వివాహం చేసుకోవాలనుకుంటున్నట్టు ఈ జంట 2019లో ప్రకటించిన సంగతి తెలిసిందే.

'ఈరోజు నా జీవిత భాగస్వామిని నా ఇంటికి తీసుకు వచ్చాను. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను. సంతోషంగా ఉంది. అలాగే కొంచెం ఆందోళనగా ఉంది. ఈ పరీక్షలో నెగ్గాలి ఫ్రెండ్స్‌. అత్యంత ప్రేమను, ఆశీర్వాదాలు అందించిన అందరినీ ధన్యవాదాలు' అంటూ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు. దీంతో ఈ నూతన దంపతులకు అభిమానుల శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లికి ముందు నిర్వహించే వేడుకల ఫోటోలు సోషల్‌ మీడియాలో క్రీడాభిమానులకు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హల్దీ వేడుకల్లో పసుపు రంగు దుస్తుల్లో సంగీత ఫోగట్ మెరిసి పోయిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, November 27, 2020, 12:35 [IST]
Other articles published on Nov 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+