అంత నెమ్మదస్తుడిని కాదు.. ఆస్ట్రేలియా కవ్వింపులకు సిద్ధంగా ఉన్నా: యువ ఓపెనర్

సిడ్నీ: అందరూ అనుకున్నట్లుగా తానంత నెమ్మదస్తుడిని కాదని టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. ఆస్ట్రేలియా కవ్వింపులకు సిద్ధంగా ఉన్నామని, ప్రత్యర్థులు సంధించే బౌన్సర్లకు తనవద్ద సమాధానాలు ఉన్నాయని తెలిపాడు. ఆస్ట్రేలియా-ఎతో జరిగిన డే/నైట్ సన్నాహక మ్యాచ్‌లో 43, 65 పరుగులతో రాణించిన గిల్‌కు తుది జట్టులో స్థానం ఖరారైనట్లే అంతా భావిస్తున్నారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 17న అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి డే/నైట్ టెస్టు జరగనుంది.

ఓపెనర్‌గా గిల్?:
టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ టెస్టు కోసం ఆదివారం వరకూ భారత్‌లోనే ఉండిపోడంతో.. గురువారం నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభంకానున్న తొలి టెస్టు (డే/నైట్)లో అతను ఆడే అవకాశం లేదు. దాంతో కర్ణాటక బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్‌కి జోడీగా ఎవరిని ఓపెనర్‌గా పంపాలి? అని టీమిండియా మేనేజ్‌మెంట్ తర్జనభర్జన పడుతోంది. అయితే యువ ఓపెనర్లు పృథ్వీ షా, శుభమన్ గిల్‌లలో ఒకరి అవకాశం దక్కనుంది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ అధికారిక వైబ్‌సైట్‌లో శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ కంగారుల గడ్డపై ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కోవడం అంత తేలికైనా విషయం కాదన్నాడు.

అంత నెమ్మదస్తుడిని కాదు:
'ఆస్ట్రేలియాను వారి దేశంలో ఎదుర్కోవాలంటే భయపడే విషయమే. అయితే ఆ సవాళ్లను అధిగమించడానికి సిద్ధంగా ఉన్నా. బ్యాట్స్‌మెన్‌కు తనపై తనకి విశ్వాసం మరింత పెరగాలంటే.. కంగారూల గడ్డపై రాణించడం కంటే మరో గొప్ప విషయం ఉండదు. అయితే ఒకప్పుడు భారత ఆటగాళ్లు మైదానంలో దూకుడుగా ఉండేవారు కాదనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులన్ని పూర్తిగా మారిపోయాయి. కొందరు కవ్వింపులకు సమాధానం ఇవ్వరు. మరికొందరు దీటుగా బదులిస్తుంటారు. నా వరకు నేను అంత నెమ్మదస్తుడిని కాదు. అలా అని ప్రత్యర్థులపై దూకుడుగా వ్యవహరించే వ్కక్తిత్వం కాదు' అని గిల్ చెప్పాడు.

చిన్ మ్యూజిక్ ప్రణాళికతో:
భారత బ్యాట్స్‌మెన్‌ను బౌన్సర్లతో బోల్తా కొట్టిస్తామని ఇటీవల ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ అన్న విషయం తెలిసిందే. దీనిపై శుభమన్ గిల్ స్పందిస్తూ... 'చిన్ మ్యూజిక్ ప్రణాళికతో మమ్మల్ని ఔట్ చేయడానికి ఆసీస్ ఆటగాళ్లు ప్రయత్నించవచ్చు. అయితే వాటికి మా వద్ద సమాధానాలు ఉన్నాయి. మేము వారిని ఎదుర్కొంటాం' అని అన్నాడు. క్రికెట్ భాషలో బ్యాట్స్‌మెన్ దవడ, మెడను లక్ష్యంగా చేస్తూ బంతులు విసరడాన్ని చిన్ మ్యూజిక్ అని అంటారు. రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో పృథ్వీ షా ఆశించిన మేర రాణించలేకపోయారు. షా పూర్తిగా తేలిపోగా.. గిల్ హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. దాంతో మయాంక్ అగర్వాల్‌కి జోడీగా గిల్ ఆడే అవకాశం ఉంది.
వార్నర్‌కు 5 మిలియన్ల ఫాలోవర్లు.. ఇండియన్స్ ఎందరో తెలుసా?! అస్సలు ఊహించలేరు!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications