Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వార్నర్‌కు 5 మిలియన్ల ఫాలోవర్లు.. ఇండియన్స్‌ ఎందరో తెలుసా?! అస్సలు ఊహించలేరు!

India vs Australia: David Warner reaches 5M Instagram Followers

హైదరాబాద్: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. టిక్‌టాక్‌లో పలు తెలుగు, తమిళ, హిందీ పాటలకు చిందులేయడమే కాకుండా.. డైలాగ్‌లు, డబ్‌స్మాష్‌లు చేశాడు. వార్నర్ ఒక్కడు మాత్రమే కాదు.. అతడి భార్య, పిల్లలు కూడా పలు వీడియోల్లో సందడి చేశారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్‌)లో సన్ రైజర్స్‌ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిద్యం వహిస్తున్న వార్నర్.. ఇక్కడివారికి బాగా తెలిసిన వ్యక్తిగా మారిపోయాడు.

 అభిమానుల మనసు దోచుకున్న వార్నర్:

అభిమానుల మనసు దోచుకున్న వార్నర్:

ఐపీఎల్ పుణ్యమాని డేవిడ్ వార్నర్ లక్షలాది మంది భారతీయుల అభిమానం చూరగొన్నాడు. ముఖ్యంగా ఆరెంజ్‌ ఆర్మీ ఫాన్స్ వార్నర్‌ను హైదరాబాదీ అని, మా అన్న అని, కాండిస్‌ వార్నర్‌ను వదిన అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటారు. లాక్‌డౌన్‌లో ఆటకు విరామం దొరకడంతో వార్నర్‌ టిక్‌టాక్‌ వీడియోలతో అభిమానులకు మరింత చేరువైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్‌ 'బుట్టబొమ్మ', మహేష్‌ బాబు 'మైండ్‌బ్లాక్'‌ పాటలతో పాటు పోకిరి, బాహుబలి డైలాగ్స్‌తో టాలీవుడ్‌ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.

 5 మిలియన్ల ఫాలోవర్లు:

5 మిలియన్ల ఫాలోవర్లు:

మరోవైపు డేవిడ్ వార్నర్ కూడా భారత్ తనకు రెండో ఇల్లు అని పలు సందర్బాల్లో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇక్కడి పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకున్నాడు. వార్నర్‌ కుటుంబానికి ఫిదా అయిన భారతీయ నెటిజన్లు లైకులు, షేర్లతో వారిని ఉత్సాహపరిచారు. ఇక ఆరెంజ్‌ ఆర్మీ కెప్టెన్ అయిన డేవిడ్‌ వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో 5 మిలియన్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇండియన్‌ నెటిజన్‌ 'తెరి' సినిమా (తమిళ) బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించాడు.

 87 శాతం.. హహా:

87 శాతం.. హహా:

ఆ వీడియోపై డేవిడ్ వార్నర్ స్పందించాడు. 'నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికి రుణపడి ఉంటాను. మీ కామెంట్లు, ఫీడ్‌బ్యాక్‌ నాకు మరింత ఉత్సాహాన్నిస్తాయి. ఎల్లప్పుడూ నేనిలాగే మీ ముఖాలపై చిరునవ్వులు చిందేలా నా వంతు కృషి చేస్తా. ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు హర్షద్‌ గైక్వాడ్‌' అని వార్నర్‌ ట్వీట్ చేశాడు. ఈ పోస్టు ఇప్పటికే 7 లక్షలకు పైగా లైకులు రాగా.. ఓ యూజర్ వార్నర్‌ను ఓ ప్రశ్న అడిగాడు. 'మీ ఫాలోవర్లలో కనీసం 50 శాతం మంది ఇండియన్స్‌ ఉంటారు కదా' అని అడగ్గా.. 'నిజానికి 87 శాతం.. హహా' అంటూ వార్నర్‌ బదులిచ్చాడు. ఈ సంఖ్య చూసి ఫాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

టెస్ట్ సిరీస్‌ కోసం సిద్ధం:

టెస్ట్ సిరీస్‌ కోసం సిద్ధం:

గాయం కారణంగా టీమిండియాతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌కు డేవిడ్ వార్నర్‌ దూరమైన సంగతి తెలిసిందే. వన్డే సిరీస్‌ను ఆసీస్ సొంతం చేసుకోగా.. టీ20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఇక డిసెంబరు 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. టెస్ట్ సిరీస్‌ కోసం వార్నర్ తీవ్రంగా సాధన చేస్తున్నాడు.

కోహ్లీతో జాగ్రత్త.. రెచ్చగొడితే అంతేసంగతులు: ఆసీస్ కెప్టెన్

Story first published: Monday, December 14, 2020, 21:01 [IST]
Other articles published on Dec 14, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+