For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'‌శుబ్‌మన్ గిల్‌ క్రికెటర్‌ కాకపోయుంటే.. రైతు అయ్యేవాడు'

India vs Australia: Shubman Gills family has come out in support of the farmers

న్యూఢిల్లీ: కేం‍ద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలంటూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరుగని పోరాటం జరుగుతోంది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుడా రైతులు రహదారులపైనే బైఠాయించారు. సింఘ, టిక్రి సరిహద్దుల వద్ద వేలాది మంది శాంతియుతంగా నిరసన సాగిస్తున్నారు. అన్నదాతలకు దేశం మొత్తం అండగా నిలువాలని సెలబ్రిటీల నుంచి సామాన్య ప్రజల వరకు పిలుపునిస్తున్నారు.

 రైతుల ఉద్యమంకు మద్దతు ఇస్తున్నాం:

రైతుల ఉద్యమంకు మద్దతు ఇస్తున్నాం:

తాజాగా టీమిండియా యువ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ కుటుంబం రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపింది. ఈ విషయాన్ని గిల్‌ తండ్రి లఖ్వీందర్‌ సింగ్‌ తెలిపారు. బుధవారం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్వీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ... 'నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు పూర్తి మద్దతు ఇస్తున్నాం. మా నాన్న రైతులు చేస్తున్న ఆందోళనలో పాల్గొంటానని ఇంట్లో నుంచి బయలుదేరారు. కానీ ఆయన ఆరోగ్యం దృశ్యా ఒకసారి ఆలోచించమని చెప్పా. ఆ తర్వాత నాన్న తన ఆలోచనను విరమించుకున్నారు. మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాం' అని తెలిపారు.

 రైతు అయ్యేవాడు:

రైతు అయ్యేవాడు:

'శుబ్‌మన్ గిల్‌ చిన్నప్పటి నుంచే వ్యవసాయం అంటే ఎంతో మక్కువ చూపించేవాడు. తాతలు, మామల దగ్గర్నుంచి వ్యవసాయం అంటే ఎంటో నేర్చుకున్నాడు. గిల్‌కు సొంతూరంటే చెప్పలేనంత ఇష్టం. ఎక్కువగా పంట పొలాల్లోనే తన ప్రాక్టీస్‌ను కొనసాగించేవాడు. ఒకవేళ గిల్‌ క్రికెటర్‌ కాకపోయుంటే.. రైతు అయ్యేవాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత ఊళ్లో ఉన్న వ్యవసాయక్షేత్రానికి వెళ్లిపోతానని గిల్‌ చాలా సార్లు నాతో చెప్పాడు' అని లక్వీందర్‌ సింగ్‌ పేర్కొన్నారు.

 గిల్‌ అర్థం చేసుకుంటాడు:

గిల్‌ అర్థం చేసుకుంటాడు:

'ఇప్పుడు నా కొడుకు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శుబ్‌మన్ గిల్‌ ఆటను ఒక పక్క టీవీలో ఎంజాయ్‌ చేస్తూనే.. మరోపక్క రైతుల ఉద్యమానికి మా వంతు సంఘీబావం ప్రకటించాం. మేము రైతులకు ఇస్తున్న మద్దతును గిల్‌ తప్పకుండా అర్థం చేసుకుంటాడనే భావిస్తున్నా' అని లక్వీందర్‌ సింగ్‌ ధీమా వ్యక్తం చేశారు. గిల్‌ ప్రస్తుతం ఆసీస్‌ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. బుధవారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలో ఓపెనర్‌గా వచ్చి 33 పరుగులు చేశాడు.

మ్యాచ్‌కు ముందు తండ్రి మృతి.. వికెట్ తీసి సంతాపం తెలిపిన వెస్టిండీస్‌ పేసర్‌!!

Story first published: Thursday, December 3, 2020, 18:20 [IST]
Other articles published on Dec 3, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+