For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: రెండో టెస్ట్‌కు టీమిండియాలో భారీ మార్పులు? ఆ నలుగురికి చాన్స్!

India vs Australia: Shubman Gill, KL Rahul, Ravindra Jadeja and Rishabh Pant Set to Play in Boxing Day Test
India vs Australia : KL Rahul should Replace Prithvi Shaw as an Opener

హైదరాబాద్: అడిలైడ్ టెస్ట్ చేసిన గాయం ఇప్పుడప్పుడే మానేది కాకపోయినా.. అదంతా ఇక గతమే. ఈ ఒక్క పరాజయంతో సిరీస్ పూర్తి కాలేదు. ఆసీస్ ఏం పై చేయి సాధించలేదు. కంగారులకు వారి నేలపై దడ పుట్టించాలంటే జట్టంతా సమష్టిగా రాణించాల్సిందే. దాని కంటే ముందు తొలి టెస్ట్ నేర్పిన పాఠంతో జట్టులోని లోపాలను సరిదిద్దుకోవాలి. పైగా, విరాట్ కోహ్లీ జట్టుకు దూరమవ్వడం అన్నింటికంటే పెద్ద సమస్య. ఆ స్థానాన్ని భర్తీ చేయడం అసాధ్యమే. అయినా మిగిలిన వారంతా కలిసి ఆ లోటును పూడ్చాలి. మరి బాక్సింగ్ డే టేస్ట్‌కు టీమిండియాలో భారీ మార్పులే జరగనున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

పృథ్వీ షా, సాహా ఔట్..

పృథ్వీ షా, సాహా ఔట్..

రెండు ఇన్నింగ్స్‌ల్లో ఘోరంగా విఫలమైన యువ ఓపెనర్ పృథ్వీ షా, వికెట్ కీపర్ వద్ధిమాన్ సాహాపై వేటు ఖాయంగా కనిపిస్తోంది. వామప్ మ్యాచ్‌లో ఫెయిలైనప్పటికీ, గత న్యూజిలాండ్ సిరీస్‌లో ఆడిన అనుభవం ఉందన్న ఒకే ఒక్క కారణంతో మేనేజ్‌మెంట్ పృథ్వీకి అవకాశమిచ్చింది. దానికోసం ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను పక్కనపెట్టింది. కానీ ఆ అవకాశాన్ని పృథ్వీ చేతులారా నాశనం చేసుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 6 బంతులు మాత్రమే ఆడిన పృథ్వీ.. ఫీల్డింగ్‌లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో అతనిపై వేటు అనివార్యంగా కనిపిస్తోంది.

రోహిత్ ఉన్నా..

రోహిత్ ఉన్నా..

మయాంక్‌కు తోడుగా ఎవరిని పంపాలనే దానిపై టీమ్‌మేనేజ్‌మెంట్ సరైన నిర్ణయం తీసుకోవాలి. రోహిత్ శర్మ ఆసీస్ చేరుకున్నప్పటికీ క్వారంటైన్ కారణంగా మూడో టెస్ట్‌కు కానీ జట్టుకు అందుబాటులోకి రాడు. అందువల్ల పృథ్వీకి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతానికి శుభ్‌మన్ గిల్ మాత్రమే కనిపిస్తున్నాడు. అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న గిల్.. ప్రస్తుత ఫామ్ ప్రకారం పృథ్వీ కంటే నయమే. మరోపక్క కోహ్లీ గైర్వాజరులో కేఎల్ రాహుల్ తుది జట్టులోకి రావడం ఖాయం. అయితే రాహుల్‌ను కూడా ఓపెనింగ్‌కు పంపించే అవకాశంలేకపోలేదు. కాబట్టి మయాంక్‌తో ఎవరు ఇన్నింగ్స్ ఆరంభిస్తారో చూడాలి!

 పంత్‌కు ఛాన్స్..

పంత్‌కు ఛాన్స్..

తొలి టెస్ట్‌లో సాహా బ్యాటింగ్ ప్రదర్శనపై టీమ్‌మేనేజ్‌మెంట్ సంతృప్తిగా లేదు. అందువల్ల వామప్‌లో సెంచరీ కొట్టిన రిషభ్ పంత్‌కు అవకాశం ఖాయమే. వాస్తవానికి విదేశీ సిరీస్‌లకు పంత్‌ను, స్వదేశీ మ్యాచ్‌లకు సాహా ఆడించాలన్నది మేనేజ్‌మెంట్ నిర్ణయం. కొంతకాలంగా అమల్లో ఉన్న ఈ ఫార్ములాను అడిలైడ్ టెస్ట్‌లో పక్కనపెట్టారు. సాహా అనుభావానికి ఓటేసిన మేనేజ్‌మెంట్ దానికి మూల్యం చెల్లించుకుంది. పైగా రాహుల్ కూడా జట్టులోకి రానుండటంతో స్పెషలిస్ట్ కీపర్ అయిన సాహా అవసరం లేదనే భావనలున్నాయి. బ్యాటింగ్ పరంగా సాహా కంటే పంత్ ఒక అడుగుముందే ఉండటం అతనికి కలిసొచ్చే అంశం.

విహారీ ఔట్.. జడేజా ఇన్..

విహారీ ఔట్.. జడేజా ఇన్..

ఇక లోయార్డర్‌లో విఫలమైన తెలుగు క్రికెటర్ హనుమ విహారీపైన కూడా వేటు పడనుంది. అతని స్థానంలో కంకషన్ గాయం నుంచి కోలుకున్న రవీంద్ర జడేజా తుది జట్టులోకి రానున్నాడు. అతని రాకతో టీమిండియాకు బౌలింగ్ ఆఫ్షన్‌తో పాటు ఫీల్డింగ్ విభాగం బలపడనుంది. పైగా జడేజా మంచి ఫామ్‌లో ఉండటం కూడా అతనికి కలిసొచ్చే అంశం. ఇక ఫస్ట్ టెస్ట్‌లో తీవ్రంగా గాయపడి సిరీస్‌కు దూరమైన మహ్మద్ షమీ స్థానంలో ఎవరస్తారనేది కూడా చర్చనీయాంశమైంది. షమీకి రిప్లేస్‌మెంట్‌గా మేనేజ్‌మెంట్ ముందు సిరాజ్, సైనీల రూపంలో రెండు ఆప్షన్లు ఉన్నాయి. కానీ సిరాజ్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రదర్శన పరంగానూ సైనీ కంటే సిరాజే బెటర్. రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ రాణించాడు. పైగా తండ్రి చనిపోయినా అతను అక్కడే ఉన్నాడు. అవకాశం వస్తే సిరాజ్ త్యాగానికి కూడా అర్థం ఉండనుంది.

Story first published: Monday, December 21, 2020, 14:40 [IST]
Other articles published on Dec 21, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+