Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: పృథ్వీతో డ్యాన్స్.. ఇప్పటికీ ఈ లైలా నాకు పిచ్చెక్కిస్తూనే ఉంది: ధావన్

India vs Australia: Shikhar Dhawan dance bollywood song with Prithvi Shaw


సిడ్నీ: టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఎప్పుడూ సరదాగా ఉంటాడు. మైదానంలో అయినా.. డ్రెసింగ్ రూంలో అయినా తోటి ఆటగాళ్లతో సరదాగా జోకులు వేస్తూ అందరిని నవ్విస్తుంటాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిట్స్ తరఫున ఆడిన ఈ డాషింగ్ ఓపెనర్.. అద్భుతంగా రాణించాడు. రెండు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు బాది.. ఢిల్లీ ప్లేఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌కు బయలు దేరాడు. ప్రస్తుతం ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్న ధావన్.. తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.

 పృథ్వీతో ధావన్ డ్యాన్స్:

పృథ్వీతో ధావన్ డ్యాన్స్:

ఈ టూర్‌లో భాగంగా 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టుల్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడతాయి. టీ20, వన్డే స్క్వాడ్లలో శిఖర్ ధావన్ ఉన్నాడు. న‌వంబ‌ర్ 27న సిడ్నీలో జ‌రిగే తొలి వ‌న్డే మ్యాచ్‌తో ఇరు జ‌ట్ల మ‌ధ్య సిరీస్ ప్రారంభం కానుంది. దీనికోసం టీమిండియా ఆటగాళ్లు ఆదివారం నుంచి నెట్ ప్రాక్టీస్ సెష‌న్ ప్రారంభించింది. అయితే ప్రాక్టీస్ మ‌ధ్య‌లో ఓపెనర్లు శిఖ‌ర్ ధావ‌న్‌, పృథ్వీ షా మాత్రం మ‌రో ప‌నిలో బిజీబిజీగా క‌నిపించారు. బాలీవుడ్ పాట 'సాత్ సముందర్ పార్'‌కు స‌ర‌దాగా డ్యాన్స్ చేశారు. అందులో పృథ్వీ అమ్మాయిగా వ‌య్యారంగా న‌డిచాడు. హీరోయిన్ వెంట ప‌డుతున్న హీరోలా ధావన్.. పృథ్వీని అనుస‌రిస్తూ తన చొక్కాను విప్పేశాడు.

 ఈ లైలా పిచ్చెక్కిస్తోంది:

ఈ లైలా పిచ్చెక్కిస్తోంది:

అభిమానుల‌ను న‌వ్విస్తున్న ఈ క్రేజీ డ్యాన్స్ వీడియోను శిఖ‌ర్ ధావన్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. 'ఈ లైలా ఇప్ప‌టికీ న‌న్ను పిచ్చెక్కిస్తోంది' అని క్యాప్ష‌న్ జోడించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌లో తన సహచరుడు, ఆసీస్ టూర్‌కు ఎంపికైన పృథ్వీ షాను ఉద్దేశించి ఈ కామెంట్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'ధావన్.. మీ లైలా భ‌లేగుంది' అంటూ కొందరు.. 'మీ డాన్స్ సూపర్' అని మరికొందరు కెమెంట్లు చేస్తున్నారు.

ఆసీస్ జట్టుపై మంచి రికార్డే:

ఆసీస్ జట్టుపై మంచి రికార్డే:

ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌పున ఆడిన‌ శిఖ‌ర్ ధావన్ ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 2020‌లో వ‌రుస‌గా రెండు సెంచ‌రీలు చేసి రికార్డు సృష్టించాడు. అంతే కాకుండా 618 ప‌రుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో నిలిచారు. ధావన్‌కు ఆసీస్ జట్టుపై మంచి రికార్డే ఉంది. ఆస్ట్రేలియా జట్టుపై గబ్బర్ స్ట్రైక్ రేట్ 98.79, యావరేజ్ 45.80. ఆసీస్‌తో ఆడినప్పుడు ధావన్ 4 శతకాలు, 6 అర్థశతకాలు సాధించాడు. ఆస్ట్రేలియాపై 26 వన్డేలు ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్ 1145 పరుగులు చేశాడు.

మరికొన్ని రోజుల్లో ప్రారంభం:

ఇటీవలి కాలంలో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోందంటే చాలు క్రీడాలోకం ఒక్కసారిగా హీటెక్కిపోతోంది. భారత్-పాకిస్తాన్‌ తర్వాత అంతగా క్రీడాలోకానికి కిక్కిచ్చే సిరీస్‌గా ఇది మారిపోయింది. కరోనా మహమ్మారి కారణంగా ఈ హై ఓల్టేజ్ సిరీస్‌ జరుగుతుందా? లేదా? అనే సందిగ్ధత నెలకొంది. కానీ కరోనా కష్టాల నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న క్రీడా లోకం ఈ సిరీస్‌కు మార్గం సుగమం చేసింది. దీంతో ఈ ఏడాది ప్రశ్నార్థకంగా మారిన ఆసీస్ టూర్.. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది.

ఐపీఎల్ 2020‌లో ఓడినా.. ట్విటర్‌లో గెలిచిన చెన్నై, కోహ్లీ!!

Story first published: Thursday, November 19, 2020, 15:59 [IST]
Other articles published on Nov 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+