Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: ముగ్గురిని ఊరిస్తున్న మూడో టెస్ట్.. అవకాశం దక్కెదెవరికో?

India vs Australia: Shardul Thakur and Navdeep Saini to battle it out for the third pacers slot in Sydney Test

సిడ్నీ: బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగనున్న మూడో టెస్టు‌లో తుది జట్టు ఎంపికపై టీమిండియా ఓ అంచనాకు రాలేకపోతుంది.
గాయంతో దూరమైన స్టార్ పేసర్ ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో ఎవరిని ఆడించాలా? అనే విషయంపై టీమ్‌మేనేజ్‌మెంట్ తల పట్టుకొంది. యువపేసర్‌ నవదీప్‌ సైనీ, లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయగల శార్దూల్‌ ఠాకూర్‌, 2020 సెన్సేషన్ నటరాజన్‌లో ఎవరికి చోటు ఇవ్వాలనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతుంది.

శార్దూల్‌కే చాన్స్..

శార్దూల్‌కే చాన్స్..

కొన్ని రోజుల క్రితం శార్దూల్‌ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకోవడం ఖాయమని చర్చ నడిచింది. కాగా అత్యంత వేగంగా బంతులు విసరగల సైనీని తీసుకుంటే బాగుంటుందని టీమిండియా సీనియర్లు భావిస్తున్నారని సమాచారం. మంగళవారం సిడ్నీ క్రికెట్‌ పిచ్‌పై కవర్లు తొలగించకపోవడంతో బౌలింగ్‌ విభాగంపై అంచనాకు రాలేకపోయారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పిచ్‌పై కవర్లు తొలగించలేదు. ఒకవేళ పిచ్‌పై తేమ ఉంటే ఠాకూర్‌ను తీసుకోవచ్చు. ఫ్లాట్‌గా ఉంటే మాత్రం పాత బంతిని రివర్స్‌స్వింగ్‌ చేయగల సైనికే ప్రాధాన్యం ఇస్తారు. దాంతో ఆసీస్‌ను దెబ్బకొట్టొచ్చన్నది జట్టు ప్రణాళిక.

 నట్టూకు అవకాశం దక్కెనా?

నట్టూకు అవకాశం దక్కెనా?

సైనీకి జట్టులో చోటు దక్కితే అతడు అరంగేట్రం చేస్తాడు. శార్దూల్‌ ఠాకూర్‌కూ ఇదొక అరంగేట్రం లాంటిదే. ఎందుకంటే రెండేళ్ల క్రితం అతనాడిన తొలి మ్యాచులో తొలి ఓవర్‌ పూర్తికాకముందే గాయంతో వెనుదిరిగాడు. ఆ తర్వాత జట్టులో చోటు లభించలేదు. తాజాగా మూడో పేసర్‌ స్థానంలో నటరాజన్‌ పేరూ వినిపిస్తోంది. తెలుపు రంగు జెర్సీలో అతను ఫొటోషూట్‌లో పాల్గొనడం చర్చకు తావిచ్చింది. 20 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచులాడిన నట్టూ ఏడాది క్రితం దేశవాళీలో సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడాడు. చెపాక్‌ వేదికగా రైల్వేస్‌తో జరిగిన మ్యాచులో 11 ఓవర్లు వేసి మూడు వికెట్లు తీశాడు. మొత్తానికి మూడో టెస్టులో మూడో పేసర్‌ ఎవరో అనే విషయం తేలాలంటే మాత్రం బుధవారం వరకు ఆగాల్సిందే.

మయాంక్ ఔట్..

మయాంక్ ఔట్..

ఇక ఫామ్‌లేమితో సతమతం అవుతున్న మయాంక్‌ అగర్వాల్‌ స్థానంలో స్టార్ ఓపెనర్ రోహిత్‌ శర్మ రావడం ఖాయమైంది. స్థిరంగా, నిలకడగా ఆడుతున్న శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి హిట్‌మ్యాన్‌ ఓపెనింగ్‌ చేయనున్నాడు. గత ఎనిమిది టెస్టు ఇన్నింగ్సుల్లో ఏడింట్లో విఫలం కావడంతో మయాంక్‌ చోటు కోల్పోక తప్పడం లేదు. అయితే మయాంక్ మరో అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం విహారీపై వేటు తప్పుదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విహారీపై వేటు వేసే సాహసం టీమ్‌మేనేజ్‌మెంట్ చేయకపోవచ్చు. గాయంతో కేఎల్ రాహుల్ దూరమవ్వడం కూడా విహారికి కలిసొచ్చింది. పైగా అతను టెస్ట్ స్పెషలిస్ట్ కావడంతో అతనికే మరో అవకాశం ఇవ్వచ్చు.

టీమిండియా అంచనా జట్టు: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, చతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే (కెప్టెన్), హనుమ విహారి, రిషభ్‌ పంత్ (కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌/నవదీప్‌ సైనీ/ నటరాజన్

Story first published: Tuesday, January 5, 2021, 19:40 [IST]
Other articles published on Jan 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+