For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వాడిని బ్యాట్ సరిగ్గా పట్టుకోమను.. మార్నస్ లబుషేన్‌పై షేన్ వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు!

India vs Australia: Shane Warne Agitated With Marnus Labuschagne’s Batting

సిడ్నీ: ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్‌పై ఆ జట్టు దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న వార్న్.. సహచర మాజీ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌తో కలిసి లబుషేన్‌పై తీవ్ర పదజాలాన్ని ఉపయోగించాడు.

ఆసీస్ ఫస్ట్ ఇన్నింగ్స్ సందర్బంగా క్రీజులో బ్యాటింగ్ చేస్తున్న లబుషేన్ స్టాన్స్‌పై సైమండ్స్ కామెంట్ చేయగా.. వార్న్ కూడా రెచ్చిపోయాడు.'జీసస్‌..చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంది.. మొదట బ్యాట్‌ను సరిగా పట్టుకోమను' అంటూ రాయలేని పదంతో దూషించాడు. లబుషేన్‌పై వార్న్‌ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సైమండ్స్ కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను లెన్నీ పిలిఫ్స్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. వార్న్‌కు ఎవరైనా ఒక్కటే.. తనకు నచ్చకపోతే ప్రత్యర్థి ఆటగాళ్లను ఎంతలా ద్వేషిస్తాడో.. సహచర క్రికెటర్లను కూడా అదే తీరుతో చూస్తాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

లెజెండరీ స్పిన్నర్‌గా గుర్తింపుపొందిన వార్న్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో అతను అనేక వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచాడు. తాను క్రికెట్‌ ఆడే సమయంలో స్టీవ్‌ వా, పాంటింగ్‌ కెప్టెన్సీలో ప్రత్యర్థి ఆటగాళ్లపై బాహంటగానే స్లెడ్జింగ్‌కు దిగేవాడు. ప్రొఫెషనల్‌గా మాత్రమే గాక వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నోసార్లు వివాదాలకు కారణమయ్యాడు. ఈ మధ్యనే టీమిండియా, ఆసీస్‌ల మధ్య తొలి టెస్టు సమయంలో చతేశ్వర్‌ పుజారాను టార్గెట్‌ చేస్తూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. పుజారా పేరు పలకడం తనకు ఇబ్బందిగా ఉంటుందని.. అందుకే అతన్ని స్టీవ్‌ అని పిలుస్తానని చెప్పాడు. దీనిపై సోషల్‌ మీడియాలో షేన్‌ వార్న్‌ను నెటిజన్లు ఒక రేంజ్‌లో ఆడుకున్నారు.

Story first published: Friday, January 8, 2021, 22:13 [IST]
Other articles published on Jan 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+