Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: ఫస్ట్ టెస్ట్ ముందు ఆసీస్‌కు గట్టి షాక్.. గాయంతో మరో పేసర్ ఔట్!

 India vs Australia: Sean Abbott ruled out of the first Test against India

సిడ్నీ: భారత్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ఓ పక్క సమయం దగ్గరపడుతుండగా ఆస్ట్రేలియా జట్టును మాత్రం గాయాలు వేధిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, పుకోవ్‌స్కీతో పాటు ఆల్‌రౌండర్ గ్రీన్, బౌలర్లు హెన్రీ కాన్వే, జాక్సన్ బర్డ్, గాయాలతో జట్టుకు దూరమవ్వగా.. తాజాగా మరో పేసర్ ఈ జాబితాలో చేరాడు.

కాలి పిక్క కండరాల నొప్పితో బాధపడుతున్న పేసర్‌ సీన్‌ అబాట్‌ భారత్‌తో జరిగే తొలి టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో ఆల్‌రౌండర్‌ హెన్రిక్స్‌కు జట్టులో చోటు కల్పించారు. సెకండ్ టెస్ట్ నాటికి అబాట్ అందుబాటులోకి వస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. తొడ కండరాల గాయంతో రెండో ప్రాక్టీస్ గేమ్‌కు దూరమైన హెన్రిక్స్.. నాలుగేళ్ల తర్వాత ఆసీస్ టెస్ట్ టీమ్‌లో చోటు దక్కించుకోవడం విశేషం.

ఇక ప్రాక్టీస్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అబాట్ సేవలు కోల్పోవడం ఆసీస్‌ను కలవరపెడుతుంది. మార్కస్ స్టోయినిస్, అష్టన్ అగర్ కూడా గాయాల జాబితాలో ఉన్నారు. ఫస్ట్ టెస్ట్ ఆడనున్న స్టార్క్, హెజల్ వుడ్ కూడా స్వల్ప గాయాలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇక డిసెంబర్ 17న అడిలైడ్ వేదికగా జరిగే డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌తో నాలుగు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది.

Story first published: Tuesday, December 15, 2020, 11:34 [IST]
Other articles published on Dec 15, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+