For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జడేజా లాంటి క్రికెటర్లతోనే నాకు సమస్య.. మంజ్రేకర్‌ సంచలన వ్యాఖ్యలు!!

India vs Australia: Sanjay Manjrekar said I don’t have a problem with Ravindra Jadeja

సిడ్నీ: టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంజ్రేకర్‌కు మంచి క్రికెట్‌ పరిజ్ఞానం ఉండడంతో పాటు అంతకుమించి ఇంగ్లీష్ భాషలో గలగలా మాట్లాడుతూ అద్భుతంగా కామెంటరీ చేయగలడు. అయితే ఆ కామెంటరీకి కొన్ని సందర్భాల్లో వివాదాస్పద పదాలు జోడించడంతో.. చాలాసార్లు వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలి కాలంలో తన కామెంటరీకి కన్నా.. వివాదాలతోనే మంజ్రేకర్‌ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. బీసీసీఐ వేటుకు గురైనా కూడా తన పంథా మార్చుకోవడం లేదు. మరోసారి టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై స్పదించాడు.

క్రమశిక్షణకు పెద్దపీట:

క్రమశిక్షణకు పెద్దపీట:

2019 వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను 'బిట్స్‌ అండ్‌ పీసెస్‌ క్రికెటర్'‌ అని విమర్శించి అభిమానుల ఆగ్రహానికి గురైన కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌.. మరొకసారి నోరు జారాడు. మరోసారి జడేజానే టార్గెట్‌ చేస్తూ మాట్లాడిన మంజ్రేకర్‌.. అతనితో మాత్రం తనకు వ్యక్తిగతంగా ఎటువంటి ఇబ్బందీ లేదన్నాడు. కానీ ఒక క్రమశిక్షణ అంటూ తెలియని జడేజా లాంటి క్రికెటర్లతోనే తనకు ప్రాబ్లమ్‌ అని పేర్కొన్నాడు. టీమిండియా సెలక్షన్‌లో మంజ్రేకర్‌ సభ్యుడిగా పని చేసిన అనుభవం లేకపోయినప్పటికీ సెలక్షన్‌లో ఆటగాళ్ల క్రమశిక్షణకు పెద్దపీట వేయాలన్నాడు.

 కష్టంగా అనిపించింది:

కష్టంగా అనిపించింది:

తాజాగా ఓ జాతీయ మీడియాతో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ... 'ఇదివరకు నేను కామెంటరీ ప్యానెల్ నుంచి తొలగించబడ్డానని చాలా మందికి తెలియదు. నేను ట్వీట్ చేసేవరకు కొంతమందికి విషయం తెలియదు. ఆ సమయంలో చాలా కష్టంగా అనిపించింది. అయితే నేను ఇలాంటి విషయాలలో దైర్యంగా ఉంటాను' అని తెలిపాడు. మంజ్రేకర్ భారత్ తరఫున 37 టెస్టులు, 74 వన్డేలు ఆడాడు. మొత్తంగా 5 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు బాదాడు. రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.

జడేజాతో నాకు ఎటువంటి సమస్య లేదు:

జడేజాతో నాకు ఎటువంటి సమస్య లేదు:

'క్రమశిక్షణ ఆధారంగానే ఆటగాళ్లను ఎంపిక చేస్తా. నేను గత కొన్నేళ్లుగా నేర్చుకున్న కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడే క్రికెటర్లను ఎంపిక చేస్తా. ఎవరైతే క్రమశిక్షణలో స్పెషలిస్టులుగా ఉంటారో వారితోనే జట్టును భర్తీ చేయాలి. రవీంద్ర జడేజాతో నాకు ఎటువంటి సమస్య లేదు. కానీ వైట్‌బాల్‌ క్రికెట్‌లో మాత్రం ఆ తరహా క్రికెటర్లతోనే సమస్య. నా జట్టులో చివరికి హార్దిక్‌ పాండ్యా లాంటి ఆల్‌రౌండర్‌ను కూడా ఎంపిక చేయను. ఆ తరహా క్రికెటర్లు భ్రమను కల్పించే వారు మాత్రమే. అయితే జడేజాను టెస్టు క్రికెటర్‌గా మాత్రమే భావిస్తా. లాంగెస్ట్‌ ఫార్మాట్‌లో మాత్రం అతనికి ఫుల్‌ మార్క్స్‌ వేస్తా' అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

మంజ్రేకర్‌పై బీసీసీఐ వేటు:

మంజ్రేకర్‌పై బీసీసీఐ వేటు:

ఇదివరకు ఐపీఎల్ సమయంలో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌‌ని 'మతిలేని క్రికెటర్' అంటూ సెటైర్ వేశాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో 'బిట్స్‌ అండ్‌ పీసెస్‌' అంటూ చేసిన వ్యాఖ్యలకు రవీంద్ర జడేజా తీవ్రంగా బదులిచ్చాడు. ఇక సహచర కామెంటేటర్ హర్షా భోగ్లాని హేళన చేస్తూ మాట్లాడినప్పుడు సోషల్‌ మీడియాలో పెద్ద దుమారం చెలరేగింది. దీంతో గత మార్చిలో దక్షిణాఫ్రికా సిరీస్ సమయంలో మంజ్రేకర్‌పై బీసీసీఐ వేటు వేసింది. ఆపై ఐపీఎల్ 2020లో కూడా అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం జరుగుతున్నా భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌‌లో మంజ్రేకర్ వ్యాఖ్యానం చేసే అవకాశం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇచ్చింది.

యూఏఈలో ఇరగదీసిన బుమ్రాకి ఏమైంది.. 8 మ్యాచ్‌లలో 3 వికెట్లే! ఐపీఎల్‌లో మాత్రమే వికెట్లు తీస్తావా!

Story first published: Monday, November 30, 2020, 15:50 [IST]
Other articles published on Nov 30, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+