For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యూఏఈలో ఇరగదీసిన బుమ్రాకి ఏమైంది.. 8 మ్యాచ్‌లలో 3 వికెట్లే! ఐపీఎల్‌లో మాత్రమే వికెట్లు తీస్తావా!

India vs Australia: Jasprit Bumrah takes only 3 wickets in Last 8 ODI Matches

హైదరాబాద్: జస్ప్రీత్ బుమ్రా.. ఈ పేరు గురించి సగటు క్రికెట్ అభిమానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ టాప్ బౌలర్లలో ఒకడు. అంతేకాదు యార్కర్ కింగ్, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అని బుమ్రాకు బిరుదులు ఉన్నాయి. కెరీర్ ఆరంభం నుంచి బుమ్రా మంచి ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్ బంతిని ఇచ్చిన ప్రతిసారి వికెట్లు తీసి.. తనపై ఉన్న నమ్మకాన్ని కాపాడుకున్నాడు. బ్యాట్స్‌మన్‌ ఎవరైనా బుమ్రా బంతికి బలవ్వాల్సిందే. యూఏఈలోనూ 27 వికెట్లతో చెలరేగిపోయాడు. అంతలా రెచ్చిపోయిన బూమ్.. బూమ్.. ఆసీస్ గడ్డపై మాత్రం తేలిపోతున్నాడు.

రెండో వన్డేలో 79 రన్స్

రెండో వన్డేలో 79 రన్స్

ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. మూడు వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన రెండు మ్యాచ్‌లలో కోహ్లీసేన భారీ ఓటములను ఎదుర్కొంది. ఇందుకు ప్రధాన కారణం భారత బౌలర్లు పూర్తిగా తేలిపోవడమే. తొలి వన్డేలో భారీగా పరుగులు సమర్పించుకున్న బౌలర్లు.. రెండో వన్డేలో పూర్తిగా తేలిపోయారు. నవదీప్ సైనీ 7 ఓవర్లలోనే 70 పరుగులు ఇచ్చుకోగా.. యుజ్వేంద్ర చహల్ 9 ఓవర్లలో 71 రన్స్ సమర్పించుకున్నాడు. రవీంద్ర జడేజా 10 ఓవర్లలో 60 పరుగులిచ్చాడు. ఇక స్టార్ పేసర్లు మొహమ్మద్ షమీ 9 ఓవర్లలో 73 పరుగులు.. జస్ప్రీత్ బుమ్రా 10 ఓవర్లలో ఏకంగా 79 రన్స్ ఇచ్చాడు.

తొలి వన్డేలో 73 పరుగులు

తొలి వన్డేలో 73 పరుగులు

టీమిండియాకు ప్రధాన బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా తొలి వన్డేలో 73 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు. రెండో వన్డేలో ఏకంగా 79 రన్స్ ఇచ్చి ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రా పేలవమైన ప్రదర్శనపై ప్రతిఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. 27 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. టాప్, మిడిల్, లోయర్ ఆర్డర్.. బ్యాట్స్‌మన్‌ ఎవరైనా బుమ్రా బంతికి బలయ్యారు. ఈ తరం ఉత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా పరిగణించబడుతున్న బుమ్రా వన్డేల్లో అదే ఆటతీరును ప్రదర్శించడంలో విఫలమయ్యాడు.

 8 మ్యాచ్‌లలో 3 వికెట్లే

8 మ్యాచ్‌లలో 3 వికెట్లే

2019లో ఐసీసీ ప్రపంచకప్ నుంచి భారత్ మూడు వన్డే సిరీస్‌లు ఆడింది. ఆగస్టు 2019లో వెస్టిండీస్‌తో, జనవరి 2020లో ఆస్ట్రేలియా, ఫిబ్రవరి 2020లో న్యూజిలాండ్‌పై ఆడింది. వెస్టిండీస్‌తో సిరీస్ జస్ప్రీత్ బుమ్రా ఆడలేదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీస్‌లలో మూడేసి వన్డేలు ఆడాడు. ప్రస్తుత సిరీస్‌లో రెండు మ్యాచులు ఆడాడు. మొత్తంగా 8 మ్యాచులు ఆడి కేవలం 3 వికెట్లే పడగొట్టాడు. ఈ సిరీస్‌లో రెండు వికెట్లు తీయగా.. ఆసీస్ సిరీస్‌లో ఒక వికెట్ తీశాడు. 8 మ్యాచులలో 76.1 ఓవర్లు బౌలింగ్ చేసి 439 రన్స్ ఇచ్చాడు. 146.3 యావరేజ్ ఉంది.

ఐపీఎల్ ఆడినపుడు మాత్రమే వికెట్లు తీస్తావా

ఐపీఎల్ ఆడినపుడు మాత్రమే వికెట్లు తీస్తావా

టీమిండియా కూటములకు ఓ విధంగా జస్ప్రీత్ బుమ్రానే కారణం. స్ట్రైక్ బౌలర్ 8 మ్యాచులలో 3 వికెట్లు మాత్రమే తీయడం మిగతా బౌలర్లపై కూడా ప్రభావం చూపుతోంది. బుమ్రా ఎందుకు ఇలా విఫలమవుతున్నాడో యాజమాన్యం గుర్తించాల్సిన అవసరం ఉంది. బూమ్ ప్రదర్శనపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ ఆడినపుడు మాత్రమే వికెట్లు తీస్తావా?.. టీమిండియాకు ఆడినపుడు తీయవా అని మండిపడుతున్నారు.

టీమిండియాపై పైచేయి సాధించాలంటే.. భారీ స్కోర్లు తప్పక చేయాలి!! లేదంటే: స్మిత్

Story first published: Monday, November 30, 2020, 14:34 [IST]
Other articles published on Nov 30, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+