For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్‌ శర్మకు ఆగ్ని పరీక్ష.. పరీక్షలో పాసవుతాడా?

India vs Australia: Rohit Sharmas fitness test today in NCA for Australia tour

ముంబై: కంగారులతో టెస్టు సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. మరో వారం రోజుల్లో అడిలైడ్‌ వేదికగా టీమిండియా తొలి టెస్టు ఆడనుంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న భారత స్టార్ ఓపెనర్ రోహిత్‌ శర్మ పరిమిత ఓవర్ల సిరీసులకు దూరమయ్యాడు. కనీసం టెస్ట్ ఫార్మాట్‌కైనా పూర్తిగా అందుబాటులో ఉంటాడనుకుంటే అదీ జరగలేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. ఫిట్‌నెస్‌ పరీక్షలో విఫలమవడంతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఇక ఈరోజు రోహిత్‌కు రెండో ఫిట్‌నెస్ ‌పరీక్ష జరగనుంది. అందులో పాసవుతాడో లేదో చూడాలి.

 ఐపీఎల్ 2020‌లో గాయం:

ఐపీఎల్ 2020‌లో గాయం:

యూఏఈ వేదికగా ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020‌లో ఆడుతున్నప్పుడే ముంబై ఇండియన్స్ సారథి రోహిత్‌ శర్మకు గాయం అయింది. తొడ కండరాల గాయంతో కొన్ని మ్యాచులు ఆడలేదు. ఆ తరువాత నాకౌట్ ‌మ్యాచులు ఆడాడు. ఫైనల్లో హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఫిట్‌నెస్‌ సమస్యలు మళ్లీ తలెత్తకుండా ఉండేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అతడిని ఆసీస్‌ పర్యటనకు ఎంపిక చేయలేదు. దాంతో వివాదం చెలరేగింది. ఆ తర్వాత రోహిత్‌ను పరీక్షించిన బీసీసీఐ వైద్యబృందం కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని సూచించడంతో పరిమిత ఓవర్ల సిరీసులకు ఎంపిక చేయలేదు.

తొలి ఫిట్‌నెస్‌ పరీక్షలో విఫలం:

తొలి ఫిట్‌నెస్‌ పరీక్షలో విఫలం:

టెస్టు సిరీస్‌కు ఎంపిక అయినప్పటికీ రోహిత్‌ శర్మ టీమిండియాతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లలేదు. తన తండ్రికి ఆరోగ్య సమస్యలు ఉండటంతో భారత్‌కు తిరిగి వచ్చాడు. జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో సాధన చేశాడు. రోహిత్‌కు ఇటీవల జరిపిన ఫిట్‌నెస్‌ పరీక్షలో విఫలమవ్వడంతో తొలి రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉండడని బీసీసీఐ స్పష్టం చేసింది. తాజాగా శుక్రవారం అతడు రెండోసారి ఫిట్‌నెస్‌ పరీక్ష ఎదుర్కోనున్నాడు.

పరీక్షలో సఫలమైతేనే:

పరీక్షలో సఫలమైతేనే:

ఎన్‌సీఏలో నేడు రోహిత్ శర్మ‌కు ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహిస్తారు. బీసీసీఐ వైద్య బృందంతో పాటు ఎన్‌సీఏ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్, సెలక్టర్లు కూడా దీనిని పర్యవేక్షిస్తారని సమాచారం తెలుస్తోంది. ఫిట్‌నెస్‌ పరీక్షలో సఫలమైతేనే రోహిత్ శనివారం ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశం ఉంది. అంతా బాగుండి అతను ఆస్ట్రేలియాకు వెళితే.. నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటైన్‌ అనంతరం జట్టుతో కలవాల్సి ఉంటుంది. టెస్టు మోడ్‌లోకి రావాలంటే రోహిత్ శర్మ విపరీతంగా నెట్‌ ప్రాక్టీస్‌ చేయాల్సిన అవసరం ఉంది.

కోహ్లీతో పాటు:

కోహ్లీతో పాటు:

ఈరోజు కనుక రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌ పరీక్షలో పాసయితే సిడ్నీలో జనవరి 7న మొదలయ్యే మూడో టెస్టు ఆడతాడు. ఒకవేళ గనక అతడు విఫలమైతే టీమ్‌ఇండియాకు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు రోహిత్‌ సేవలూ ఉండవు. డిసెంబర్ 19 నుంచి వచ్చే ఏడాది జనవరి 19 వరకు బోర్డర్ గావస్కర్ ట్రోఫీ జరగనుంది. ఈ సిరీస్‌కు స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ ఆడడంపై అనుమానలు ఉన్నాయి.

ISL 2020 21: ఈస్ట్‌ బెంగాల్‌ vs జంషెడ్‌పూర్‌ మ్యాచ్ డ్రా!!

Story first published: Friday, December 11, 2020, 8:58 [IST]
Other articles published on Dec 11, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+