టీమిండియా కోసం రోహిత్ ఎంతో చేశాడు.. కూతురు 'బర్త్‌డే'కు కూడా వెళ్లలేదు.. మా మద్దతు అతడికే!!

హైదరాబాద్: ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న భరత జట్టులోని ఐదుగురు క్రికెటర్లు సరికొత్త వివాదానికి కేంద్ర బిందువులయ్యారు. బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘించిన రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, నవ్‌దీప్ సైనీ, పృథ్వీ షాలు ఐసొలేషన్‌కు తరలి వెళ్లాల్సి వచ్చింది. మెల్‌బోర్న్‌లోని ఓ రెస్టారెంట్‌లో వారు భోజనం చేయడం, ఓ అభిమానిని రిషబ్ పంత్ ఆలంగనం చేసుకోవడం ద్వారా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. భోజనం చేయడం వరకూ బాగానే ఉన్నా.. ఆ బిల్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో వారు ఏమి తిన్నారనే విషయం చర్చకు దారి తీసింది. ముఖ్యంగా రోహిత్ శర్మ ట్రోలింగ్‌కు గురయ్యాడు.

రోహిత్ చుట్టే వివాదం
మెల్‌బోర్న్‌లోని రెస్టారెంట్‌లో డిన్నర్ సందర్భంగా రోహిత్ శర్మ అతనితో ఉన్న యంగ్ క్రికెటర్లు.. అన్నీ నాన్ వెజ్ వంటకాలనే ఆర్డర్ చేశారు. రొయ్యలు, పందిమాంసం, ఆవుమాంసం, స్టిర్ ఫ్రైడ్ బీఫ్, బీన్ సాస్, పుట్టగొడుగులు, కోడి మాంసంతో తయారు చేసిన ఫ్రైడ్ రైస్, డైట్ కోక్ వంటివి ఉన్నాయి. ఇతర ఆహార పదార్థాల గురించి పెద్దగా పట్టింపు లేనప్పటికీ.. బీఫ్‌ను మెనూలో చేర్చడం పట్ల దుమారం రేగుతోంది. మిగిలిన ఆటగాళ్లతో పోల్చుకుంటే..రోహిత్ శర్మ ఒక్కడి చుట్టే ఈ వివాదం తిరుగుతోంది. శనివారం రోహిత్ బీఫ్ ఆర్డర్ చేశాడనే దుమారం చెలరేగింది. 'రోహిత్ నువ్వో హిందువువై బీఫ్ తింటావా?' అని అభిమానులు ఫైర్ అయ్యారు.

#IStandWithRohit:
అయితే రోహిత్ శర్మ కోసం కొందరు అభిమానులు తమ మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఆదివారం ఉదయం నుంచి ట్విట్టర్‌లో #IStandWithRohit అనే హ్యాష్ టాగ్ ట్రెండింగ్ అవుతోంది. 'ఎల్లప్పుడూ మేము మా కెప్టెన్‌కు అండగా ఉంటాం' అని ముంబై ఇండియన్స్ ఫాన్స్ కర్ణాటక ట్విట్టర్ పేజీ ట్వీట్ చేసింది. 'రోహిత్ 14 రోజుల క్వారంటైన్ గడిపాడు. కుటుంబంకు దూరంగా ఉన్నాడు. కూతురు సమైరా రెండవ 'బర్త్‌డే'కు కూడా దూరమయ్యాడు. ఇదంతా జట్టుకోసమే' అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. 'మీ విజయంతో వీరికి సమాధానం చెప్పండి', 'నేను ఎప్పటికీ రోహిత్ శర్మకు మద్దతు ఇస్తాను' అని కామెంట్లు పెడుతున్నారు.

ఆటగాళ్లందరికీ నెగెటివ్
రోహిత్ శర్మతో సహా ఐదుగురు క్రికెటర్లు రెస్టారెంట్‌కు వెళ్లిన నేపథ్యంలో భారత జట్టు సభ్యులందరికీ ఆదివారం కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆర్‌టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు వచ్చినట్లు.. అందులో ఆటగాళ్లందరికీ నెగెటివ్‌గా నిర్ధరణ అయినట్లు బీసీసీఐ వెల్లడించింది. జట్టు సహాయ సిబ్బందికి కూడా పరీక్షలు నిర్వహించామని వారికి కూడా నెగెటివ్‌గా తేలినట్లు తెలిపింది. జట్టుతో పాటే ఐదుగురు ఆటగాళ్లు ఒకే విమానంలో సిడ్నీకి వెళ్లినట్లు బీసీసీఐ తెలిపింది. ఈ నెల 7 నుంచి సిడ్నీలో ఆస్ర్టేలియా- భారత్ మధ్య మూడో టెస్టు జరగనుంది.
Thailand Open: బ్యాంకాక్‌కు సైనా, శ్రీకాంత్.. లండన్ నుంచి సింధు!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications