భారత అభిమానులకు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియా విమానం ఎక్కిన రోహిత్ శర్మ!

న్యూఢిల్లీ: భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఎన్నో పుకార్లు.. మరెన్నో సందేహాలను పటాపంచలు చేస్తూ టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా విమానం ఎక్కాడు. మంగళవారం తెల్లవారు జామునే హిట్‌మ్యాన్ ఆసీస్‌కు బయల్దేరాడు. అన్ని అనుకన్నట్లు సవ్యంగా జరిగితే రోహిత్ మూడో టెస్ట్‌లో ఆడనున్నాడు. ఇక దుబాయ్ మీదుగా హిట్ మ్యాన్ ఆసీస్‌కు బయల్దేరాడని, 14 రోజుల క్వారంటైన్‌లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టనున్నాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. 'రోహిత్ మంగళవారం ఉదయమే ఆసీస్‌కు బయల్దేరాడు. ఈ రాత్రికి అక్కడికి చేరుకోనున్నాడు.'అని ఓ బీసీసీఐ అధికారి ఏఎన్ఐకి తెలిపాడు.

ఐపీఎల్‌లో గాయం..
ఐపీఎల్ 2020 సీజన్ సందర్భంగా తొడ కండరాల గాయానికి గురైన రోహిత్ శర్మను భారత సెలెక్టర్లు తొలుత ఆసీస్ పర్యటనకు ఎంపిక చేయని విషయం తెలిసిందే. అయితే టీమ్స్ ప్రకటించిన మరుసటి రోజే రోహిత్ మ్యాచ్ బరిలోకి దిగడం, ఫైనల్లో హాఫ్ సెంచరీ చేయడంతో టీమ్ సెలెక్షన్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దాంతో తప్పను సరిదిద్దుకుంటూ సెలెక్టర్లు రోహిత్‌కు టెస్ట్ టీమ్‌లో అవకాశం కల్పించారు. కానీ ఐపీఎల్ ముగిసిన వెంటనే రోహిత్ ఆసీస్‌కు వెళ్లకుండా నేరుగా భారత్‌కు వచ్చాడు. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో చేరాడు. దాంతో రోహిత్ ఆసీస్ పర్యటనపై సందిగ్ధత నెలకొంది. అనేక పుకార్లు వెలువడ్డాయి.

ఫిట్ అంటూనే..
ఇక జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో గత శుక్రవారం ఫిట్‌నెస్ పరీక్ష పాస్ అయిన రోహిత్ శర్మ గురించి బీసీసీఐ మరింత స్పష్టతనిచ్చింది. అతను ఆస్ట్రేలియాకు వెళుతున్నాడని... అయితే టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దిగే విషయంపై మాత్రం ఇప్పుడే చెప్పలేమని వెల్లడించింది. ఆస్ట్రేలియాలో భారత జట్టుతో పాటు ఉన్న బోర్డు వైద్య బృందం రోహిత్ ఫిట్‌నెస్‌ను పునఃసమీక్షించిన తర్వాతే ఆడే విషయం తెలుస్తుందని స్పష్టం చేసింది.

అప్పుడే తుది నిర్ణయం..
‘ఐపీఎల్‌లో గాయపడిన రోహిత్ ఎన్‌సీఏలో చికిత్స తీసుకున్నాడు. ప్రస్తుతం అతను ‘క్లినికల్లీ ఫిట్'గా ఉన్నాడు. అతని బ్యాటింగ్, ఫీల్డింగ్, వికెట్ల మధ్య పరుగెత్తడాన్ని పరీక్షించిన ఎన్‌సీఏ వైద్య బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే అతను సుదీర్ఘ సమయం పాటు ఆడే అంశంలో మెరుగుపడాల్సి ఉంది. ఆస్ట్రేలియాలో క్వారంటైన్ ముగిసిన తర్వాత బీసీసీఐ వైద్య బృందం రోహిత్ ఫిట్‌నెస్‌ను మళ్లీ పరీక్షిస్తుంది. దీనిని బట్టే మ్యాచ్ ఆడే విషయంపై నిర్ణయం తీసుకుంటారు' అని బీసీసీఐ తమ ప్రకటనలో స్పష్టం చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications