India vs Australia: చిన్న మ్యాచ్‌లో చితక్కొట్టిన రోహిత్, కార్తీక్.. ఇక ఉప్పల్‌లోనే బిగ్ ఫైట్!

కాన్పూర్: ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా దుమ్మురేపింది. 8 ఓవర్ల చిన్న మ్యాచ్‌లో సూపర్ బ్యాటింగ్‌తో అద్భుత విజయాన్నందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ(20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46 నాటౌట్) విన్నింగ్ నాక్‌కు దినేశ్ కార్తీక్(2 బంతుల్లో సిక్స్, ఫోర్‌తో 10 నాటౌట్) అసలు సిసలు ఫినిషింగ్ తోడవడంతో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్లకు 90 పరుగుల భారీ స్కోర్ చేసింది. మాథ్యూవేడ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43 నాటౌట్), ఆరోన్ ఫించ్(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 31) రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. బుమ్రా ఓ వికెట్ పడగొట్టాడు. హర్షల్ పటేల్ 2 ఓవర్లలో 32 పరుగులిచ్చి దారుణంగా విఫలమయ్యాడు.
అనంతరం భారత్ 7.2 ఓవర్లలో 4 వికెట్లకు 92 పరుగులు చేసి మరో 4 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది. సిరీస్ డిసైడ్ ఉప్పల్ వేదికగా ఆదివారం జరగనుంది.

తొలి ఓవర్‌లోనే 3 సిక్స్‌లు..
91 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించింది. హజెల్ వుడ్ వేసిన తొలి ఓవర్‌లో రోహిత్ రెండు భారీ సిక్స్‌లు బాదాడు. దాంతో టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన రికార్డును రోహిత్ అందుకున్నాడు. కేఎల్ రాహుల్ సైతం సిక్సర్ బాదడంతో తొలి ఓవర్‌లోనే 20 పరుగులు వచ్చాయి. కమిన్స్ వేసిన రెండో ఓవర్‌లో రోహిత్ ఓ భారీ సిక్సర్ బాదడంతో 9 పరుగులు వచ్చాయి. ఆడమ్ జంపా వేసిన మూడో ఓవర్‌లో రోహిత్ సిక్సర్ కొట్టగా.. రాహుల్(10) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ సింగిల్ తీయడంతో 10 పరుగులు వచ్చాయి.

జంపా దెబ్బకొట్టినా..
డానియల్ సామ్స్ వేసిన నాలుగో ఓవర్‌లో రోహిత్ ఓ బౌండరీ కొట్టగా.. కోహ్లీ ఓ బౌండరీ బాదడంతో 11 పరుగులు వచ్చాయి. ఆడమ్ జంపా వేసిన ఐదో ఓవర్‌లో బౌండరీ బాదిన విరాట్(11).. మరుసటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో జంపా బౌలింగ్‌లో 8వ సారి ఔటైన అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(0).. ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దాంతో ఈ ఓవర్‌లో 7 పరుగులు మాత్రమే వచ్చాయి. సీన్ అబాట్ వేసిన ఆరో ఓవర్‌లో రోహిత్ రెండు బౌండరీలు బాదడంతో 13 పరుగులు వచ్చాయి.

దుమ్మురేపిన కార్తీక్ కాక..
ప్యాట్ కమిన్స్ వేసిన 8వ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా(9) బౌండరీ బాది క్యాచ్ ఔటయ్యాడు. రోహిత్ బౌండరీ బాదడంతో ఈ ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. దాంతో చివరి ఓవర్‌లో భారత్ విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. ఇక దినేశ్ కార్తీక్ తొలి బంతినే సిక్సర్ బాది.. భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. మరుసటి బంతిని బౌండరీకి తరలించి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications