Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia రెండో టీ20లో రోహిత్ సేన గెలవాలంటే మూడు మార్పులు చేయాలి!

India vs Australia: Rohit Sharma & Co needs 3 areas to improve in Must-win situation in Nagpur T20

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ ముందు సన్నాహకంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియాకు ఊహించని పరాజయం ఎదురైంది. సొంతగడ్డపై 208 పరుగుల భారీ స్కోర్‌ను టీమిండియా కాపాడుకోలేకపోయింది. మంగళవారం మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్ రెండో మ్యాచ్‌ నాగ్‌పూర్ వేదికగా శుక్రవారం(సెప్టెంబర్ 23) జరగనుంది.

ఈ మ్యాచ్‌‌ రోహిత్ సేనకు చావోరేవో లాంటిది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంటాయి. లేకుంటే మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కోల్పోయి.. సొంతగడ్డపై ఘోర పరాభావం మూటగట్టుకుంది.ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు నాగ్‌పూర్‌ చేరుకున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలంటే మూడు విషయాలను మెరుగుపరుచుకోవాల్సింది.

1.ఉమేశ్ యాదవ్‌పై వేటు వేయడం..

1.ఉమేశ్ యాదవ్‌పై వేటు వేయడం..

జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో టీమిండియా బౌలింగ్ మరీ నాసిరకంగా మారింది. ఆసియాకప్ 2022లో ఇదే వైఫల్యంతో టీమిండియా ఫైనల్ చేరకుండానే ఇంటిదారిపట్టింది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో తొలి టీ20 మ్యాచ్‌లోనూ అదే పరిస్థితిని ఎదుర్కొంది. బుమ్రా స్థానంలో అనూహ్యంగా తొలి టీ20 ఆడిన ఉమేశ్ యాదవ్ దారుణంగా విఫలమయ్యాడు. ధారళంగా పరుగులివ్వడమే కాకుండా పూర్తి కోటా బౌలింగ్ చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే ఉమేశ్ యాదవ్‌ను తప్పిస్తేనే జట్టుకు మేలు జరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. వీలైనంత త్వరగా బుమ్రాను జట్టులోకి తీసుకురావాలని, అతను ఆడలేని పరిస్థితి ఉంటే దీపక్ చాహర్‌ను ఆడించాలని సూచిస్తున్నారు. రెండో టీ20లో టీమిండియా చేయాల్సిన మొదటి మార్పు ఇదేనని సలహా ఇస్తున్నారు.

2. యుజ్వేంద్ర చాహల్ వైఫల్యం..

2. యుజ్వేంద్ర చాహల్ వైఫల్యం..

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో 27 వికెట్లతో సత్తా చాటి టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన యుజ్వేంద్ర చాహల్.. గత కొన్ని మ్యాచ్‌‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఆసియా కప్‌తో పాటు ఆస్ట్రేలియాతోనూ చాహల్ తడబడ్డాడు. ధారళంగా పరుగులు ఇవ్వడమే కాకుండా మిడిల్ ఓవర్లలో ఒక్క వికెట్ తీయలేకపోయాడు. చాహల్ వైఫల్యం కూడా టీమిండియా ఓటమికి కారణమైంది. గత ఐదు టీ20 మ్యాచ్‌ల్లో చాహల్ (0/32, 0/18, 1/43, 3/34, 1/42) ఐదు వికెట్లు మాత్రమే తీసాడు. టీమిండియా విజయాలు అందుకోవాలంటే మిడిల్ ఓవర్లలో చాహల్ వికెట్లు తీయడం చాలా ముఖ్యం. ప్రపంచకప్ జట్టులో కొనసాగాలంటే రెండో టీ20లో చాహల్ మెరుగ్గా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.

3. ఫినిషర్ దినేశ్ కార్తీక్..

3. ఫినిషర్ దినేశ్ కార్తీక్..

ఫినిషర్‌గా జట్టులోకి వచ్చిన దినేశ్ కార్తీక్‌ను కాదని అక్షర్ పటేల్‌‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్ ఇచ్చి టీమ్‌మేనేజ్‌మెంట్ మూల్యం చెల్లించుకుంది. దినేశ్ కార్తీక్‌ను డెత్ ఓవర్లలోనే బ్యాటింగ్‌కు పంపించింది. అయితే అక్షర్ పటేల్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అక్షర్ స్థానంలో కార్తీక్ వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కాబట్టి ఎలాంటి ప్రయోగాలకు పోకుండా దినేశ్ కార్తీక్‌ను ఏడో స్థానంలోనే బ్యాటింగ్ పంపించాలి. అప్పుడే అతను తనదైన శైలిలో మ్యాచ్‌ను ముగించగలడు.

Story first published: Thursday, September 22, 2022, 18:43 [IST]
Other articles published on Sep 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+