
ఒక్క సిక్స్ కొడితే..
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు 423 సిక్స్‌లు బాదిన రోహిత్.. ఓవరాల్‌గా మూడో క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాపై ఇప్పటి వరకు 99 సిక్స్‌లు బాదిన హిట్ మ్యాన్.. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. సిడ్నీ వేదికగా జరిగే మూడో టెస్ట్‌లో మరో సిక్స్ కొడితే ఆసీస్‌పై 100 సిక్స్‌లు కొట్టి తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. ఇక రోహిత్ తర్వాత 63 సిక్స్‌లతో ఇయాన్ మోర్గాన్ రెండో స్థానంలో ఉండగా.. భారత్ నుంచి సచిన్ 60 సిక్స్‌లతో హిట్ మ్యాన్ తర్వాత నిలిచాడు.

రోహిత్ రావడం సంతోషం..
ఇక రోహిత్ శర్మ జట్టుతో చేరడం ప్రతీ ఒక్కరిని సంతోషానికి గురిచేసిందని తాత్కలిక సారథి అజింక్యా రహానే అన్నాడు. అతని రాకతో జట్టుకు ఎంతో బలం చేకూరిందన్నాడు. 'రోహిత్ రాకతో చాలా ఉత్సాహంగా ఉన్నాం. అతని అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడనుంది. నెట్స్‌లో అతను చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 7-8 సెషన్‌లో సాధన చేశాడు. రెండో టెస్ట్ ముగిసిన అనంతరమే రోహిత్ జట్టుతో కలిసాడు. అప్పటి నుంచి నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. గత రెండు మూడు సిరీస్‌ల్లో అతను అద్భుతంగా ఆడాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న రోహిత్ ఆట కూడా అదే స్థాయిలోనే ఉంటుంది'అని రహానే చెప్పుకొచ్చాడు.

మూడో టెస్ట్ గెలిస్తే..
ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే వరుసగా నాలుగు టెస్ట్‌లు గెలిచిన భారత కెప్టెన్‌గా అజింక్యా రహానే ధోనీ సరసన నిలవనున్నాడు. 2008లో కుంబ్లే నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్న మహీ వరుసగా నాలుగు టెస్ట్‌లు గెలిపించాడు. ఇక కోహ్లీ గైర్హాజరీ సారథ్య బాధ్యతలు అందుకున్న రహానే మెల్‌బోర్న్‌లో సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకు ముందు స్వదేశంలోనూ రెండు టెస్ట్‌ల్లో జట్టును నడిపించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

6వేలకు చేరువలో..
టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా మరో 97 పరుగులు చేస్తే టెస్ట్ క్రికెట్‌లో 6వేల పరుగుల మైలురాయిని అందుకోనున్నాడు. 2010లో టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన పుజారా 79 టెస్ట్‌ల్లో(132 ఇన్నింగ్స్‌ల్లో) 47.60 సగటుతో 5903 పరుగులు చేశాడు. ఇందులో 18 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలున్నాయి. మరో 215 రన్స్ చేస్తే ఆస్ట్రేలియా 1000 పరుగులను పూర్తి చేసుకోనున్నాడు. ఇప్పటి వరకు ఆసీస్‌పై 9 టెస్ట్‌లు(17 ఇన్నింగ్స్‌లు) ఆడిన పుజారా.. 785 పరుగులు చేశాడు.


Click it and Unblock the Notifications
