
ఇంతకేం జరిగిందంటే..?
టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకోగా.. రిషభ్ పంత్ అలసత్వంతో రెండు క్యాచ్‌లు నేలపాలు చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ వేసిన 22వ ఓవర్ ఆఖరి బంతి అరంగేట్ర ప్లేయర్ విల్ పుకోస్కీ బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకోగా.. పంత్ జారవిడిచాడు. ఆ తర్వాత మరో మూడో ఓవర్ల వ్యవధిలో మరో క్యాచ్‌ను నేలపాలు చేశాడు.
మహ్మద్ సిరాజ్ వేసిన 26 ఓవర్ ఆఖరి బంతి పుకోస్కీ గ్లౌవ్‌ను ముద్దాడుతూ వెళ్లగా.. పంత్ వెనక్కి పరుగెడుతూ డైవ్ చేసి అందుకున్నాడు. కానీ తొలిసారి చేజారిన బంతి రెండో ప్రయత్నంలో చిక్కినట్టే చిక్కి నేలను తాకింది. అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఔటివ్వగా.. రివ్యూలో రివర్సైంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న పుకోస్కీ 110 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ అరంగేట్ర ప్లేయర్‌ను మరో అరంగేట్ర బౌలర్ నవదీప్ సైనీ ఔట్ చేశాడు. దాంతో పంత్ ఊపిరి పీల్చుకున్నాడు.
చెత్త కీపింగ్‌పై ఆగ్రహం..
ఫస్ట్ టెస్ట్‌లో భారత్ చెత్త ఫీల్డింగ్‌తో మూల్యం చెల్లించుకుంటే.. రెండో మ్యాచ్‌లో ఆసీస్ ఓటమిపాలైంది. దాంతో మూడో టెస్ట్‌లో పంత్ క్యాచ్‌లు చేజార్చడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వికెట్ వెనుకాల నిద్రపోతున్నావా? అని నిలదీస్తున్నారు. ఫన్నీ మీమ్స్‌తో ట్విటర్ వేదికగా వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఆ క్యాచ్‌లు పట్టి ఉంటే మ్యాచ్‌లో పరిస్థితి మరోలా ఉండేదని కామెంట్ చేస్తున్నారు. పాక్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్‌కు అడ్వాన్స్‌డ్ వర్షన్ పంత్ అని సెటైర్లు పేల్చుతున్నారు. తాను ఎంత చెత్త కీపర్‌నో పంత్ మరోసారి నిరూపించుకున్నాడని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆసీస్ 166/2
పంత్ చెత్త కీపింగ్‌తో తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. వర్షం అంతరాయంతో 55 ఓవర్ల ఆటనే సాగగా.. నిలిచే సమయానికి ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్( 149 బంతుల్లో 8 ఫోర్లతో 67 బ్యాటింగ్ ), స్టీవ్‌స్మిత్(64 బంతుల్లో 5 ఫోర్లతో 31 బ్యాటింగ్ ) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. మహ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ చెరో వికెట్ తీశారు. ఆస్ట్రేలియా ఓపెనర్లలో డేవిడ్ వార్నర్(5) విఫలమైనా, పకోస్కీ(110 బంతుల్లో 4 ఫోర్లతో 62) అర్ధశతకంతో రాణించాడు.


Click it and Unblock the Notifications












