India vs Australia: సిడ్నీ టెస్ట్‌లో టీమిండియా స్ట్రాటజీ ఇదే.. దాంతోనే ఓటమి తప్పింది!

సిడ్నీ: 'గాయపడి ఉండొచ్చు.. విశ్వాసం కోల్పోయి ఉండవచ్చు.. కానీ వ్యక్తిత్వంలో మాత్రం వెనక్కి తగ్గింది లేదు'సిడ్నీ టెస్ట్ చివరి రోజు ఆటను ఉద్దేశించి భారత తాత్కలిక కెప్టెన్ అజింక్యా రహానే చేసిన వ్యాఖ్య ఇది. అతను అన్నట్లుగానే ఆసీస్ నిర్దేశించిన 407 పరుగుల భారీ లక్ష్యం చూసిన తర్వాత భారత్ గెలవడం దేవుడెరుగు.. కనీసం డ్రాతోనైనా గట్టెక్కుతుందా? అని చాలా మంది అనుకున్నారు. 98 రన్స్‌కే రెండు కీలక వికెట్లు కోల్పోవడంతో పాటు రిషభ్ పంత్, రవీంద్ర జడేజా తీవ్రంగా గాయపడటం ఈ సందేహాలను మరింత పెంచాయి. కానీ ఈ అనుమానాలన్నిటీని పటాపంచల్ చేస్తూ భారత ఆటగాళ్లు అద్భుత పోరాటం చేశారు. బాధను పంటి బిగువన భరించి ఓటమిని గట్టెక్కించారు. సిరీస్ ఆశలను సజీవంగా నిలిపారు.

అడగడుగున ఆటంకాలే..
ఇక విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్‌కు అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యాయి. కెప్టెన్ రహానే ఆదిలోనే ఔటవ్వగా.. రిషభ్ పంత్, పుజారా అద్భుత భాగస్వామ్యంతో ఆదుకున్నారు. పంత్ ధాటిగా ఆడగా.. పుజారా తనదైన ఆటతో ఆసీస్ బౌలర్లను విసిగించాడు. ఇక మోచేతి గాయం నొప్పిని అధిగమించేందుకు పంత్ అధిక మోతాదు కలిగిన పెయిన్ కిల్లర్లను వాడాడు. సెంచరీకి చేరువైన అతను లయన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే పుజారా కూడా హేజిల్ వుడ్ బౌలింగ్‌లో బౌల్డ్ అవ్వడంతో భారత్ కథ మళ్లీ మొదటికి వచ్చింది.

విహారీ-అశ్విన్..
ఈ క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన విహారీ-అశ్విన్ అద్భుతంగా పోరాడారు. అయితే ఆదిలోనే విహారీ తొడకండరాల గాయానికి గురయ్యాడు. పైగా అశ్విన్ కూడా వెన్ను గాయంతో సతమతమవుతున్నాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత్ గట్టెక్కడం కష్టమే అనుకున్నారు. కానీ ఈ ఇద్దరు పూర్తిగా నొప్పిని భరిస్తూ ఆటను కొనసాగించారు.బ్రేక్ మధ్యలో పెయిన్ కిల్లర్లు వేసుకుంటూ భారత్‌కు ఓటమి తప్పించారు.

నొప్పి, నంబర్లు, టైమ్ జాన్తా నై
లంచ్‌కు ముందే పంత్ వికెట్ కోల్పోవడంతో టీమ్‌మేనేజ్‌మెంట్.. డ్రానే లక్ష్యంగా వ్యూహం రచించింది. ఈ నేపథ్యంలోనే నంబర్లను, ఇంకా ఆడాల్సిన ఓవర్లను, సమయాన్ని మర్చిపోవాలని సూచించారు. ముఖ్యంగా నొప్పి అనే ఆలోచనను కూడా రానివ్వద్దని చెప్పారు. ప్రతీ బంతిని ఎదుర్కోవడం ఓ విజయంగా భావించండని, ఓ యుద్దంలా ఫీలవ్వండని చెప్పారు. ఈ స్ట్రాటజీతో భారత్ ఆఖరి రోజు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications