For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాంటింగ్ చెబుతూనే ఉన్నాడు.. అంతలోనే పృథ్వీ షా బౌల్డ్ అయ్యాడు (వీడియో)

India vs Australia: Ricky Ponting reveals Prithvi Shaws weakness on air just before his dismissal

అడిలైడ్: నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫస్ట్ డే/నైట్ టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, కామెంటేటర్ రికీ పాంటింగ్ చెప్పినట్లుగానే టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా ఔటవ్వడం చర్చనీయాంశమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా పృథ్వీ షా ఆటను నిశితంగా పర్యవేక్షించిన పాంటింగ్ అతని లోపాన్ని వివరించాడు. షా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతని బ్యాట్‌కు ప్యాడ్‌కు చాలా గ్యాప్ ఉంటుందని, ఆసీస్ బౌలర్లు దాన్ని టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేస్తే సరిపోతుందన్నాడు. అయితే పాంటింగ్ చెబుతుండగానే పృథ్వీషా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పాంటింగ్ చెప్పిన విధంగానే షా లోపంపై టార్గెట్ చేసిన మిచెల్ స్టార్క్ ఫలితాన్ని రాబట్టాడు. దాంతో టీవీల ముందున్న ప్రేక్షకులు, విశ్లేషకులు బిత్తరపోయారు. పాంటింగ్ చెప్పింది కరెక్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

 పాంటింగ్ ఏమన్నాడంటే..?

పాంటింగ్ ఏమన్నాడంటే..?

‘పృథ్వీషా తనవైపు బంతి దూసకొచ్చినప్పుడల్లా అతని బ్యాట్, ప్యాడ్ మధ్య చాలా గ్యాప్ ఇస్తుంటాడు. ఇలా తరుచూ చేస్తుంటాడు. ఆసీస్ ఆ గ్యాప్ టార్గెట్ చేస్తే ఫలితం రాబట్టవచ్చు.'అని చెబుతుండగానే.. స్టార్క్ బంతికి షాట్ బౌల్డ్ అయ్యాడు. బ్యాట్‌కు తగిలిన బంతి పాంటింగ్ చెప్పిన గ్యాప్‌లో నుంచే వెళ్లి వికెట్లకు తాకింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇక ఐపీఎల్‌లో కూడా షా ఇదే తరహాలో పలుమార్లు ఔటై.. తుది జట్టులో చోటు కోల్పోయాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో ఆరంభంలో అదరగొట్టిన పృథ్వీషా.. సెకండాఫ్‌లో దారుణంగా విఫలమయ్యాడు.

ప్రాక్టీస్‌లో విఫలం..

ప్రాక్టీస్‌లో విఫలం..

ఇక ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ షా దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతనికి తుది జట్టులో చోటు దక్కడం డౌటేనని అందరూ భావించారు. శుభ్‌మన్‌ గిల్‌ ప్రాక్టీస్‌లో మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకోవడంతో షా బెంచ్‌కే పరిమితమవుతాడని అనుకున్నారు. కానీ అనూహ్యంగా గిల్‌ను కాదని పృథ్వీ షాకు టీమ్‌మేనేజ్‌మెంట్ చాన్స్‌ ఇచ్చింది. ఈ అవకాశాన్ని షా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆదిలోనే అది పరుగు కూడా చేయకుండానే ఔటై తీవ్రంగా నిరాశపరిచాడు.

మండిపడుతున్న ఫ్యాన్స్..

మండిపడుతున్న ఫ్యాన్స్..

ఇక పృథ్వీ ఔటైన తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పృథ్వీ షాకు అవకాశాలు ఎందుకిస్తారో అర్థం కావడం లేదని, అతనికి బదులుగా గిల్‌ లేదా రాహుల్‌కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని కామెంట్ చేస్తున్నారు. ‘పృథ్వీ షా వన్డే.. టెస్టు.. ప్రాక్టీస్‌ ఇలా ఏదైనా నీ ఆటతీరు మారదా.. వరుసగా విఫలమవుతున్న షాకు ఇంకా ఎన్ని అవకాశాలు ఇస్తారో'.. పృథ్వీ నీకు అవకాశాలు ఇచ్చి దండగ.. పోయి ఇంట్లో కూర్చో ' అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ప్రస్తుం పృథ్వీ షా ఔటైన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

నిదానంగా భారత్ ఇన్నింగ్స్..

నిదానంగా భారత్ ఇన్నింగ్స్..

ఆదిలోనే వికెట్ కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైన భారత్ బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆడుతున్నారు. పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమయ్యారు. 39 ఓవర్లలో 2 వికెట్లకు భారత్ 71 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ(67 బంతుల్లో 21బ్యాటింగ్), చతేశ్వర్ పుజారా(128 బంతుల్లో 28 బ్యాటింగ్) ఉన్నారు. పూర్తిగా రక్షణాత్మక ధోరణిలో ఆడుతున్నారు. ఈ ఇద్దరిలో ఒక్కరైన భారీ ఇన్నింగ్స్ ఆడితేనే భారత్ రేసులో నిలుస్తుంది. ఇక ఓపెనర్లు పృథ్వీషా(0), మయాంక్ అగర్వాల్(40 బంతుల్లో 17) తీవ్రంగా నిరాశపరిచారు.

Story first published: Thursday, December 17, 2020, 15:14 [IST]
Other articles published on Dec 17, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+