For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sydney Test: లంచ్ బ్రేక్.. రెండేసి జడేజా!! తొలి సెషన్‌లో టీమిండియాదే ఆధిపత్యం!

India vs Australia: Ravindra Jadeja, Jasprit Bumrah strikes dent Australia

సిడ్నీ: బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదిక‌గా భారత్‌తో జ‌రుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఐదవ వికెట్‌ కోల్పోయింది. శుక్రవారం ఉదయం 166/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా తొలి సెషన్‌లో మరో 83 పరుగులు చేసి మూడు కీలక వికెట్లు చేజార్చుకుంది. దీంతో లంచ్ బ్రేక్ సమాయానికి ఆసీస్ స్కోర్‌ 84.5 ఓవర్లలో 249/5గా ఉంది. స్టార్ బ్యాట్స్‌మన్‌ స్టీవ్ స్మిత్‌ ( 76; 159 ఫోర్లు) అర్ధ సెంచరీ చేసి క్రీజులో ఉన్నాడు. కామెరాన్‌ గ్రీన్ ‌(0) ఔట్ కాగానే భోజన విరామం ప్రకటించారు.

లబుషేన్‌ను బోల్తా కొట్టించిన జడ్డూ:

లబుషేన్‌ను బోల్తా కొట్టించిన జడ్డూ:

ఓవర్‌నైట్‌ స్కోర్‌ 166/2తో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. జట్టు స్కోరు 188/2 పరుగుల వద్ద వర్షం ప్రారంభం కావడంతో అంపైర్లు ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆపై వర్షం ఆగిపోవడంతో ఆట మళ్లీ ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రమాదకరంగా మారిన మార్నస్ లబుషేన్‌ను (91: 196 బంతుల్లో) స్పిన్నర్ రవీంద్ర జడేజా పెవిలియన్‌కు పంపాడు. ఓ చక్కటి బంతికి లబుషేన్‌ స్లిప్‌లో కెప్టెన్ అజింక్య రహానేకు చిక్కాడు. 70.5 ఓవర్‌లో లబుషేన్ ఔట్ అయ్యాడు.

రెండో వికెట్ తీసిన జడేజా:

అనంతరం వికెట్‌ కీపర్‌ మాథ్యూ వేడ్ అండతో స్టీవ్ స్మిత్ స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. ఇక క్రీజులో కుదురుకుంటున్న వేడ్‌ (13; 16బంతుల్లో 2x4)ను కూడా రవీంద్ర జడేజా బోల్తా కొట్టించాడు. జస్ప్రీత్ బుమ్రా అద్భుత క్యాచ్ అందుకోవడంతో వేడ్‌ ఇన్నింగ్స్ ముగిసింది. 76.5 ఓవర్‌లో గాల్లోకి షాట్‌ ఆడిన వేడ్‌.. బుమ్రా చేతికి చిక్కాడు. దీంతో ఆసీస్‌ 232 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. జడేజా తొలి సెషన్‌లో రెండు వికెట్లు‌ తీశాడు.

తొలిసారి భారత బౌలర్లపై స్మిత్ ఆధిపత్యం:

తొలిసారి భారత బౌలర్లపై స్మిత్ ఆధిపత్యం:

అయితే రెండు వికెట్లు పడినా స్టీవ్ స్మిత్‌ మాత్రం భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని అర్ధ శతకం చేశాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ సిరీస్‌ తొలిసారి భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. భోజన విరామ సమయానికి ముందు కామెరాన్‌ గ్రీన్‌ (0)ను జస్ప్రీత్ బుమ్రా పెవిలియన్‌ చేర్చాడు. ప్రస్తుతం స్మిత్ ‌(76) పరుగులతో క్రీజులో ఉన్నాడు. భార‌త బౌల‌ర్స్‌లో జ‌డేజా రెండు వికెట్స్ తీయ‌గా..బుమ్రా, సైనీ, సిరాజ్‌కు చెరో వికెట్ ద‌క్కింది.

పకోస్కీ హాఫ్ సెంచరీ:

పకోస్కీ హాఫ్ సెంచరీ:

గురువారం టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్ ప్ర‌త్య‌ర్ధిపై పైచేయి సాధించింది. బౌలింగ్‌ వైఫల్యం, రిషబ్ పంత్‌ క్యాచ్‌లు వదిలేయడంతో ఆస్ట్రేలియా పుంజుకుంది. యువ ఓపెన‌ర్ విల్ పకోస్కీ (62; 110 బంతుల్లో 4x4) ఆకట్టుకున్నాడు. మార్నస్ లబుషేన్‌ (67; 149 బంతుల్లో 8x4) అర్ధ శతకం చేశాడు. వ‌ర్షం కార‌ణంగా తొలి రోజు 55 ఓవ‌ర్ల ఆట మాత్ర‌మే జ‌ర‌గ‌గా.. ఆసీస్ 2 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.

ISL 2020 21: హమ్మయ్య.. ఎట్టకేలకు ఒడిశా గెలిచిందోచ్‌!!

Story first published: Friday, January 8, 2021, 7:56 [IST]
Other articles published on Jan 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+