
సెంచరీతో సమానం..
'చివరి సెషన్ చాలా ఆసక్తిగా మారింది. ప్యాట్ కమిన్స్ చాలా వైవిధ్యంగా బంతులేశాడు. దాంతో అతన్ని ఎదుర్కోవడం కష్టంగా మారింది. అయితే, నెట్స్‌లో నేను చాలాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాను. అలా ఇక్కడ నిలదొక్కుకోవడం గొప్పగా అనిపించింది. సిడ్నీలో 400 స్కోర్‌ను ఛేదించడం అంత తేలిక కాదు. పంత్(97) బ్యాటింగ్‌తో టీమ్‌ఇండియా పైచేయి సాధించింది. ఈ నేపథ్యంలోనే పంత్, పుజారా ఔటయ్యాక విహారి గాయపడ్డాక గెలుపు కోసం ప్రయత్నించడం చాలా కష్టం. ఆస్ట్రేలియాలో రాణించడం అంత తేలిక కాదు. కాబట్టి విహారి తన బ్యాటింగ్ పట్ల గర్వపడొచ్చు. అతడి ఇన్నింగ్స్ సెంచరీతో సమానం.

ద్రవిడ్‌ను గుర్తు చేసింది..
టీమిండియా మాజీ క్రికెటర్ 'ది వాల్' రాహుల్ ద్రవిడ్ ప్రదర్శనను గుర్తుచేసింది. అతను ప్రదర్శించిన పోరాట పటిమ సహచర సభ్యుల్లో ఎంతో స్పూర్తిని నింపింది. ఆఖరి టెస్టులో విజయం సాధించడానికి ఇది మాకు తోడ్పడుతుంది. ఈ మైదానంలో అర్ధశతకం సాధించకుండా ఎప్పుడూ నేను ఆటను ముగించలేదని భోజన విరామంలో మా బ్యాటింగ్ కోచ్‌కు చెప్పాను. అలాగే ఈ రోజు కూడా బ్యాటింగ్‌లో రాణించాను' అని అశ్విన్ పేర్కొన్నాడు.

21 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి..
కాగా, 98/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. ఆరంభంలోనే రహానే (18 బంతుల్లో 4 పరుగులు) వికెట్‌ను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడగా, రిషబ్ పంత్ 118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు సాధించి భారత్ శిబిరంలో విజయంపై ఆశలు రేకెత్తించాడు. 272/5తో ఓటమి వైపు నిలిచిన జట్టును విహారి, అశ్విన్ ఆదుకున్నారు. చివరి వరకూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి ఆసీస్ విజయానికి అడ్డుకట్ట వేశారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ పూర్తయ్యే సమయానికి భారత్ స్కోరును 334/5కి తీసుకెళ్లారు. 1980 తర్వాత ఒక టెస్ట్ నాలుగో ఇన్నింగ్స్‌లో టీమిండియా 131 ఓవర్లు ఆడటం ఇదే తొలిసారి. అంతేకాకుండా ఆసీస్‌పై అత్యధిక ఓవర్లు ఆడిన ఏకైక ఆసీయా జట్టు భారతే.


Click it and Unblock the Notifications
