Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'పెర్త్ పేలవ రేటింగ్ ఇవ్వడం తీవ్రంగా నిరాశపరచింది'

India vs Australia: Rating Perth pitch as average is disappointing, says Mitchell Starc

మెల్‌బోర్న్‌: పెర్త్ వేదికగా తలపడిన భారత్-ఆస్ట్రేలియాలు రెండో టెస్టులో భాగంగా బ్యాట్స్‌మెన్ తీవ్రంగా నిరాశపరిచారు. ఈ క్రమంలో పిచ్ స్వభావం పరిశీలించి పేలవంగా రేటింగ్ ఇచ్చారు. దీనిపట్ల తీవ్రంగా నిరాశచెందానని క్రికెట్ దిగ్గజాలు వ్యాఖ్యానిస్తున్నారు. పెర్త్‌లో కొత్తగా నిర్మించిన ఆప్టస్‌ మైదానం పిచ్‌కు ఐసీసీ పేలవ రేటింగ్‌ ఇవ్వడం నిరాశ పరిచిందని ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ తెలిపాడు. రెండో ఇన్నింగ్స్‌లో కొందరు బ్యాట్స్‌మెన్‌ వెంటవెంటనే ఔటయ్యారు. ఈ టెస్టులో భారత్‌ 146 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

క్రికెట్‌ అభిమానిగా నన్ను తీవ్ర నిరాశకు

క్రికెట్‌ అభిమానిగా నన్ను తీవ్ర నిరాశకు

‘పెర్త్‌ పిచ్‌కు పేలవ రేటింగ్‌ ఇవ్వడం క్రికెట్‌ అభిమానిగా నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ మ్యాచ్‌ను బ్యాటు, బంతికి మధ్య జరిగిన అత్యుత్తమ పోరాటంగా భావించాను. టెస్టు క్రికెట్‌లో ఇదే కీలకం. గతేడాది మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో పిచ్‌ నుంచి ఏ మాత్రం సహకారం అందలేదు. ఇలా బంతి, బ్యాటు మధ్య తీవ్ర పోటీ ఉంటేనే టెస్టు క్రికెట్‌ సజీవంగా ఉంటుంది. పెర్త్‌ తరహాలో అభిమానులు వస్తారు.

'కోహ్లీ పులి.. మైదానంలో అలానే ఉండాలి'

పిచ్‌ స్వభావం చాలా నచ్చింది

పిచ్‌ స్వభావం చాలా నచ్చింది

ఇక్కడ అద్భుతమైన సమరం జరిగింది. పిచ్‌ స్వభావం చాలా నచ్చింది. పిచ్‌పై పగుళ్లు 4, 5 రోజుల్లో కీలక పాత్ర పోషించాయి. అలా కాకుండా ఫ్లాట్‌ వికెట్‌ను తయారుచేస్తే టెస్టు క్రికెట్‌ కాస్తా బ్యాట్స్‌మెన్‌ ఆటగా మారిపోతుంది. దూకుడైన క్రికెట్‌ మాత్రమే మైదానాలకు ప్రేక్షకులను తీసుకొస్తుంది.

వెంటవెంటనే వికెట్లు తీయడమే మా లక్ష్యం

వెంటవెంటనే వికెట్లు తీయడమే మా లక్ష్యం

ఆట ఆరంభమైన వెంటవెంటనే వికెట్లు తీయడమే మా లక్ష్యం. మిడిలార్డర్‌ను కొత్త బంతితో ఆడించాలనేదే మా ఉద్దేశం. ఇప్పుడూ అదే ప్రణాళికతో వెళ్తాం. మ్యాచ్ జరుగుతున్నంతసేపు రెండు జట్ల బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి ఉంది. ఇంతకుముందు పర్యటనలో పరుగులు చేసిన కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌ ప్రస్తుతం ఫామ్‌లో లేరు. అందుకే ఎవరినీ తక్కువ అంచనా వేయం. విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. అతడికి చెత్త బంతులు విసరం. ఎందుకంటే అతడితో జాగ్రత్తగా ఉండాలి. అమోఘమైన నైపుణ్యంతో విజృంభించే అవకాశాలు ఉన్నాయని స్టార్క్‌ తెలిపాడు.

1
43625
Story first published: Monday, December 24, 2018, 10:17 [IST]
Other articles published on Dec 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+