Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: రూల్స్ పాటించమంటే.. రావొద్దు.. టీమిండియాకు వార్నింగ్!

India vs Australia: Queensland government responds amid reports of India’s Brisbane quarantine demands

సిడ్నీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమ ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలను పాటించమంటే ఇక్కడికి రావొద్దని భారత క్రికెట్‌ జట్టును క్విన్‌లాండ్స్ ప్రభుత్వం హెచ్చరించింది. న్యూ సౌత్‌వేల్స్, క్వీన్స్‌లాండ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. సరిహద్దులన్నిటిని మూసివేసింది.

అయితే చివరి టెస్ట్‌ కోసం ఇక్కడికి ప్రత్యేక విమానంలో రానున్న ఆసీస్, భారత్ జట్లు తప్పనిసరి 14 రోజుల క్వారంటైన్ ఉండాలని స్పష్టం చేసింది. కానీ టీమిండియా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్వారంటైన్ ఉండలేమని చెప్పేసింది. దాంతో ఇరు జట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా జనవరి 15 నుంచి జరగాల్సి ఉన్న ఆఖరి టెస్ట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.

మా వల్ల కాదు..

మా వల్ల కాదు..

ఇప్పటికే నెల రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నామని, మళ్లీ ఐసోలేషన్ అంటే మా వాళ్ల కాదని టీమిండియాకు చెందిన ఓ సీనియర్ అధికారి క్రిక్‌బజ్‌తో అన్నాడు. ‘బ్రిస్బెన్ వెళ్లి అక్కడ మళ్లీ కఠిన బబుల్‌లో ఉండటానికి భారత జట్టు ఏ మాత్రం ఆసక్తిగా లేదు. ఇప్పటికే దుబాయ్‌లో 14 రోజుల క్వారంటైన్ ఉన్నాం. ఆ తర్వాత సిడ్నీలో మరో 14 రోజులు స్వీయ నిర్భంధంలోనే ఉన్నాం.

దాదాపు నెలరోజుల పాటు కఠిన క్వారంటైన్‌ను పాటించాం. కాబట్టి తమను మాములు ఆస్ట్రేలియా ప్రజల్లానే పరిగణించాలి. అలా కాకుండా క్వారంటైన్‌లో ఉండాలంటే మాత్రం మా వల్ల కాదు. అది టూర్ ముగిసే సమయంలో ఏమాత్రం భావ్యం కాదు'అని సదరు అధికారి తెలిపాడు.

అయితే రాకండి..

ఇక భారత జట్టు విన్నపంపై క్విన్స్‌లాండ్ ఆరోగ్యశాఖ మంత్రి రోస్ బేట్స్ ఘాటుగా స్పందించింది. ‘భారత ఆటగాళ్లకు నిబంధనలకు అనుగుణంగా ఆడాలని లేకుంటే.. ఇక్కడికి రావద్దు'అని స్పష్టం చేసింది. ఓ చానెల్‌తో మాట్లాడుతుండగా టీమిండియా క్వారంటైన్‌కు సుగుమంగా లేదని ఆమె ముందు ప్రస్తావించగా ఈ విధంగా బదులిచ్చింది. క్వారంటైన్‌ ఉండాలని లేకుంటే భారత ఆటగాళ్లు ఇక్కడికి రావద్దని ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంద్రి టిమ్ మండెర్ అన్నాడు. నిబంధనలు అందరికి వర్తిస్తాయని, టీమిండియా కోసం ప్రత్యేకంగా వాటిని సడలించలేమన్నాడు.

సిడ్నీలోనే నాలుగో టెస్ట్..

సిడ్నీలోనే నాలుగో టెస్ట్..

ఒకవేళ క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వం ఇండియన్ టీమ్‌కు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇవ్వకపోతే.. సిడ్నీలోనే నాలుగో టెస్ట్ కూడా జరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇండియన్ టీమ్ మాత్రం ఈ నిబంధనలను అంగీకరించే పరిస్థితులు కనిపించడం లేదు. ఆరు నెలలుగా కరోనా మహమ్మారి సమయంలోనూ విదేశీ టూర్‌లలో తమ టీమ్‌తో ఎలాంటి సమస్యలు రాలేదని, ఈ విషయాన్ని గమనించాలని టీమిండియా అధికారి అంటున్నారు. మరి క్రికెట్ ఆస్ట్రేలియా దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Story first published: Sunday, January 3, 2021, 13:10 [IST]
Other articles published on Jan 3, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+