అసలేం జరిగిందంటే..?
యువ పేసర్ నవ్‌దీప్ సైనీ గాయంతో మైదానం వీడగా.. అతని స్థానంలో పృథ్వీ షా సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చాడు. అయితే స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో బంతిని స్వ్కేర్ లెగ్ దిశగా ఫుష్ చేసిన మార్కస్ లబుషేన్ (108: 204 బంతుల్లో 9x4) క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. దాంతో.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ పృథ్వీ షా బంతిని అందుకుని.. అదే వేగంలో రనౌట్ కోసం నాన్‌స్ట్రైకర్ వైపు విసిరాడు. అయితే బంతి సిల్లీ మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మకు గట్టిగా తగిలింది. రోహిత్ చేతులు అడ్డుపెట్టడంతో ప్రమాదం తప్పింది. ఇక మ్యాచ్ కామెంటేటర్లు ఫ్లెండ్లీ ఫైర్ అంటూ విరగబడి నవ్వారు.
కన్నెర్ర చేసిన రోహిత్..
బంతి తనని తాకిన తర్వాత రోహిత్ శర్మ చాలా సీరియస్‌గా కనిపించాడు. కనీసం పృథ్వీ షా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఒకసారి వేలి గాయాన్ని చూసుకుని.. కీపర్ రిషబ్ పంత్‌వైపు సీరియస్‌గా చూస్తూ బంతిని అతనికి అందించాడు. దాంతో పృథ్వీ షాకు సారీ చెప్పే అవకాశం కూడా లేకపోయింది. తొలుత ఆ త్రో కాస్త సరదాగా అనిపించినా.. వేలికి గాయం కావడం, రోహిత్ శర్మ కోపంగా కనిపించడంతో సీరియస్‌గా మారిపోయింది.
పృథ్వీ షా కుట్ర..
ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై అభిమానులు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. ఫొటో షాప్ నైపుణ్యాలకు పనిచెబుతూ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.'హమ్మా.. పృథ్వీ షా జట్టులో చోటు కోసం ఇలా కుట్ర చేశావా?'అని ఒకరంటే.. 'వికెట్లకు కొట్టురా అంటే రోహిత్ కొడుతావేంట్రా'అని ఇంకొకరు ఫన్నీ మీమ్ ట్వీట్ చేశారు. షా వల్ల జట్టుకు ఏం ఉపయోగం లేదని, ఆస్ట్రేలియా గెలుపు కోసం పరితపిస్తున్నాడని రోహిత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం షాకు సంబంధించిన మీమ్స్, ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

షా తప్పిదం లేదు..
వాస్తవానికి అక్కడ పృథ్వీ షా తప్పిదం ఏమీ పెద్దగా కనిపించలేదు. అతను బంతిని అందుకునే సమయానికి లబుషేన్ క్రీజు మధ్యలోనే ఉండటంతో.. రనౌట్ కోసం వేగంగా నాన్‌స్ట్రైక్ ఎండ్ వికెట్లపైకి విసరాలని ట్రై చేశాడు. కానీ వికెట్ల లైన్‌కు రోహిత్ అడ్డంగా ఉండటంతోనే అతనికి బంతి తగిలింది. ఇక తొలి రోజు ఆటలో ఆసీస్ ఆధిపత్యం చెలాయించింది. స్టార్ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్(204 బంతుల్లో 9 ఫోర్లతో 108) సూపర్ సెంచరీకి తోడు మాథ్యూ వేడ్(87 బంతుల్లో 45) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ టిమ్ పైన్(38 బ్యాటింగ్), కామెరూన్ గ్రీన్ (28 బ్యాటింగ్) ఉన్నారు.


Click it and Unblock the Notifications












