Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: టీ20ల్లో భారత బౌలర్ చెత్త రికార్డ్!

టీమిండియా యువ పేసర్ ప్రసిధ్ కృష్ణ చెత్త రికార్డ్ నమోదు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన మూడో మ్యాచ్‌లో ప్రసిధ్ కృష్ణ ఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ప్రసిధ్ కృష్ణ 68 పరుగులు సమర్పించుకున్నాడు. తాను వేసిన ఆఖరి ఓవర్‌లో 23 పరుగులిచ్చి టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. ఈ చెత్త గణంకాలతో యుజ్వేంద్ర చాహల్‌ను వెనక్కునెట్టాడు. 2018లో సౌతాఫ్రికాతో జరిగిన టీ20లో యుజ్వేంద్ర చాహల్ 64 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పటి వరకు ఇదే చెత్త రికార్డ్.

India vs Australia: Prasidh Krishna creates unwanted record in T20Is

ఓవరాల్‌గా ఈ జాబితాలో సౌతాఫ్రికా ప్లేయర్ కేజే అబాట్‌తో కలిసి సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాడు. శ్రీలంక బౌలర్ కసున్ రజిత(75 రన్స్), క్రిస్ సోలె(స్కాట్లాండ్) 72 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. టురన్(తుర్కియే) 70 రన్స్, బారీ మెక్‌కార్తి(ఐర్లాండ్) 69 పరుగులతో ప్రసిధ్ కంటే ముందున్నారు.

పేలవ బౌలింగ్‌తో టీమిండియా పరాజయానికి కారణమైన ప్రసిధ్ కృష్ణపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వెంటనే భారత జట్టులో నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.

India vs Australia: Prasidh Krishna creates unwanted record in T20Is

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 222 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(57 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్స్‌లతో 123 నాటౌట్) అజేయ శతకం సాధించగా.. సూర్యకుమార్ యాదవ్(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39), తిలక్ వర్మ(24 బంతుల్లో 4 ఫోర్లతో 31 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డ్‌సన్, జాసన్ బెహ్రెండార్ఫ్, ఆరోన్ హార్డీ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగులు చేసి గెలుపొందింది. గ్లేన్ మ్యాక్స్‌వెల్(48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 104 నాటౌట్) శతకం నమోదు చేయగా.. మాథ్యూ వేడ్(16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రవి బిష్ణోయ్(2/32) రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Wednesday, November 29, 2023, 10:24 [IST]
Other articles published on Nov 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+