
కెప్టెన్ రహానే..
ఇక బాక్సింగ్ డే టెస్ట్‌లో రహానే అందించిన విజయం.. జట్టును నడిపించిన తీరును ప్రతీ క్రికెట్ అభిమానిని ఆకట్టుకుంటుంది. టాస్ ఓడినా.. తనదైన సారథ్యంతో జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. తొలి రోజే ప్రత్యర్థిని కట్టడి చేసిన తీరు.. కెప్టెన్‌గా మైదానంలోని ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్, బౌలింగ్ వ్యూహాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఇంకా చెప్పాలంటే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కంటే బాగున్నాయి. తొలి టెస్ట్‌లో విరాట్ నేతృత్వంలోని భారత్ ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యం అయితే.. రెండోది చెత్త ఫీల్డింగ్. చాలా క్యాచ్‌లు నేలపాలు చేశారు. కానీ రహానే సారథ్యంలోని జట్టు మాత్రం ఒకటి, రెండు కష్టమైన క్యాచ్‌లు మినహా అవకాశాలను ఏ మాత్రం చేజార్చలేదు. ఇదే అతని ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్‌ను తెలియజేస్తుంది.

బౌలింగ్ వ్యూహం సూపరో సూపర్
ఇక స్టార్ పేసర్ మహ్మద్ షమీ గైర్హాజరీ, ఉమేశ్ యాదవ్ గాయంతో మైదానం వీడటం వంటి ప్రతీకూల పరిస్థితుల్లో అరంగేట్ర పేసర్ మహ్మద్ సిరాజ్‌ను రహానే వాడుకున్న తీరు అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా తొలి రోజు ఆటలో ఫస్ట్ సెషన్ అంతా అతనికి బంతిని ఇవ్వకుండా స్పిన్నర్లతో వేయించి.. లంచ్ తర్వాత సిరాజ్‌తో కీలక వికెట్లు రాబట్టిన తీరు ప్రశంసలు అందుకుంది. రహానే మార్క్ కెప్టెన్సీకి జడేజా వంటి ఆటగాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. సరైన సమయంలో సరితూగే బౌలర్‌కు బంతి అందించి వికెట్లు రాబట్టడంలో రహానే సక్సెస్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లు( ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రెండు, సెకండ్ ఇన్నింగ్స్‌లో మూడు) తీసాడంటే కెప్టెన్‌గా రహానే అందించిన సహకారమే కారణం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అద్భుత సెంచరీ..
ఇక బ్యాటింగ్‌లో కెప్టెన్‌గా ముందుండి రహానే ఆడిన తీరు కూడా అద్భుతం. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు తనదైన బ్యాటింగ్‌తో అతను నెలకొల్పిన చిన్న చిన్న భాగస్వామ్యాలు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయి. విహారీ, పంత్, జడేజాతో ఆచితూచి ఆడిన రహానే.. సూపర్ సెంచరీతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. సహచరుడు జడేజా కారణంగా రనౌట్ అయినా.. పర్లేదు అంటూ అతన్ని సముదాయించిన తీరు ధోనీ సారథ్యాన్ని తలపించింది. మైదానంలో అతను తీసుకునే నిర్ణయాలు కూడా మహీని గుర్తు చేశాయి. అయితే ఇదే జోరును రహానే తదుపరి రెండు మ్యాచ్‌ల్లో కూడా కొనసాగిస్తే భారత్ సిరీస్‌ను నిలబెట్టుకోవడం ఖాయం.
కోహ్లీ లాంగ్ లీవ్ తీసుకో..
ఇక రహానే సూపర్ కెప్టెన్సీకి ముగ్దులైన కొంత మంది అభిమానులు.. అతన్నే టెస్ట్ సారథిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ‘కోహ్లీ.. నువ్వు లాంగ్ లీవ్ తీసుకో.. మాకు రహానే ఉన్నాడు'అని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. ‘కోహ్లీ మెరుగైన ఆటగాడే.. కానీ గొప్ప సారథి అయితే కాదు. కీలక ఆటగాళ్ల గైర్హాజరీలో రహానే జట్టును నడిపించిన తీరు అద్భుతం. కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకొని బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలి'అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. అయితే ఒక్క విజయంతో కోహ్లీ సారథ్యంలో సాధించిన విజయాలను మరిచిపోవడం బాధకారమని అతని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. దాంతో సోషల్ మీడియా వేదికగా కోహ్లీ vs రహానే కెప్టెన్సీ డిబేట్ హాట్ హాట్‌గా సాగుతోంది.


Click it and Unblock the Notifications












