గబ్బా టెస్ట్‌లో గాయంతో ఉన్న నాకు రిషభ్ పంత్ ఏం చెప్పాడంటే: నవ్‌దీప్ సైనీ

న్యూఢిల్లీ: టీమిండియా వికెట్‌కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ అద్భుతమైన ఆటగాడని యువపేసర్ నవదీప్ సైనీ ప్రశంసించాడు. గబ్బా టెస్ట్‌లో గాయపడ్డ తాను క్రీజులోకి వచ్చినప్పుడు అన్నీ అతనే చూసుకుంటానని పంత్ తనతో చెప్పాడని ఈ యువ పేసర్ చెప్పుకొచ్చాడు. ఏ మాత్రం రిస్క్ తీసుకోవద్దని సూచించాడని తెలిపాడు. ఇక గబ్బా వేదికగా జరిగిన ఆఖరి టెస్టులోయువ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఆ టెస్టులో నవదీప్ సైనీ గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడ్డాడు. పూర్తి స్థాయిలో బౌలింగ్, ఫీల్డింగ్ చేయలేదు. అయితే 328 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఖరి 3 నిమిషాలు నవదీప్ సైని బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. అయితే సైనీకి శ్రమ లేకుండా పంత్ విన్నింగ్ షాట్ బాదేసి విజయాన్నందించాడు. ఈ విషయాన్ని తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైనీ పంచుకున్నాడు.

తానే చూసుకుంటానన్నాడు..
'రిషభ్ పంత్‌తో బ్యాటింగ్ చేయడం అదే తొలిసారి. చాలా సరదాగా అనిపించింది. భారత్‌ను అతను గెలిపిస్తాడని తెలుసు. క్రీజులోకి వెళ్లిన వెంటనే నేనేం చేయాలని పంత్‌ను అడిగా. రిస్క్ తీసుకోకుండా తాను పిలిచినప్పుడు పరుగెత్తమని బదులిచ్చాడు. క్రీజులోకి వెళ్లి మళ్లీ తిరిగొచ్చి ఆందోళన వద్దని మొత్తం తాను చూసుకుంటానని చెప్పాడు' అని సైనీ తెలిపాడు. అద్భుత బ్యాటింగ్‌తో రిషబ్ భారత్‌కు విజయాన్నందించిన విషయం తెలిసిందే.

విన్నింగ్ షాట్ కొట్టి..
'పంత్ విన్నింగ్ షాట్ కొట్టినప్పుడు పరుగెత్తు అని పిలిచాడు. వీలైనంత వేగంగా పరుగెత్తాలని నాకు తెలుసు. బంతి ఎటువైపు వెళ్లిందో చూడకుండానే పరుగెత్తా. సంబరాలు చేసుకొనేందుకు అతను నన్ను ఆపినప్పుడు మేం గెలిచామని అర్థమైంది. పంత్ బౌలర్లను చితకబాదుతాడని తెలుసు. నిజానికి అతను చాలా కష్టపడతాడు. మానసికంగా బలమైన ఆటగాడు. విపత్కర పరిస్థితుల్లో ఆడేందుకు ఇష్టపడతాడు. ఎలాంటి గడ్డు పరిస్థితుల్లోనైనా అతడు మానసికంగా బలంగా నిలబడతాడు. అదే అతనిలోని అత్యుత్తమ గుణం' అని సైనీ స్పష్టం చేశాడు.

ఆ ఇద్దరే స్పూర్తిని నింపారు..
ఇక ఆఖరి టెస్ట్‌కు ముందు కెప్టెన్ అజింక్యా రహానే, కోచ్ రవిశాస్త్రి తమలో సూర్తిని నింపారని సైనీ చెప్పుకొచ్చాడు. 'ఎవరి బాధ్యతలు వారు స్వీకరించేందుకు మేం అన్ని విధాలుగా సిద్దమయ్యాం. రవి సర్ ఒక్కటే చెప్పాడు.. ఎవరి అవసరం ఎప్పుడైనా రావచ్చు. అందరూ సిద్దంగా ఉండాలన్నాడు. రవి సర్ నెట్స్ మా ప్రాక్టీస్ దగ్గరుండి పర్యవేక్షించాడు. పరిస్థితులకు తగ్గట్లు సిద్దం చేశాడు. మీరే బెస్ట్ అనే ఫీలింగ్‌తో ఉండండనీ, ప్రయోగాల జోలికి పోకుండా మీ సహజ సిద్దమైన బౌలింగ్‌ను చేయండన్నాడు. ఇవి మాలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయి. రహానే భయ్యా కూడా ఎలా ప్రయోగాలకు పోకుండా.. నెట్స్‌లో, డొమెస్టిక్ క్రికెట్‌లో ఎలా బౌలింగ్ చేశారో అలానే వేయమన్నాడు.'అని సైనీ పేర్కొన్నాడు.

ఇద్దరూ బెస్ట్..
ఇక రహానే కెప్టెన్సీ ఎలా ఉందని ప్రశ్నించగా.. తొలిసారి అతని సారథ్యంలో ఆడానని, పూర్తిగా ఆస్వాదించానన్నాడు. కోహ్లీ, రహానే ఇద్దరూ మంచి కెప్టెన్లని కితాబిచ్చాడు. 'విరాట్ భయ్యా నేతృత్వంలో నేను భారత్‌కు, ఆర్‌సీబీకి ఆడాను. కానీ రహానే సారథ్యంలో ఆడటం ఇదే తొలిసారి. అతని కెప్టెన్సీలో ఆడటాన్ని ఆస్వాదించాను. అద్భుతమైన విషయం ఏంటంటే ఇద్దరు కెప్టెన్లు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వారి నిర్ణయాలు జట్టుకు బాగా ఉపయోగపడతాయి'అని సైనీ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications