
నిజానికి నాకు తెలియదు..
‘చాలా మంది నన్ను ఇదే ప్రశ్న అడిగారు. చిన్నప్పటి నుంచి నేనింతే. వికెట్ తీసిన ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో నాకు తెలియదు. అందుకే ఒక చిరునవ్వుతో సరిపెట్టేస్తాను. అంతకు మించి ఇంకేమీ ఉండదు. ఏదేమైనా.. ఈ టూర్ నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. బలమైన ఆసీస్ జట్టుపై నేను బాగా ఆడగలిగాను. ఈ ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. నా ప్రదర్శన పట్ల నేనెంతో సంతోషంగా ఉన్నా. జట్టు సభ్యులందరూ నాకు అండగా నిలవడం వల్లే ఇది సాధ్యమైంది'అని ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌తోనే..
నెట్‌బౌలర్‌గా వచ్చిన తనకు వన్డే, టీ20ల్లో ఆడే అవకాశం వస్తుందని అస్సలు ఊహించలేదని, వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా తనకు అవకాశం దక్కిందని పేర్కొన్నాడు. అనూహ్యంగా వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలిగానని, ఈ టూర్ నుంచి ఇంతకంటే ఎక్కువగా ఆశించేది ఏమీ లేదని చెప్పుకొచ్చాడు.
ఇక ఐపీఎల్‌లో మెరుగ్గా రాణించడం వల్లే ఇక్కడిదాకా వచ్చానన్న ఈ తమిళనాడు పేసర్.. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశాడు. ‘నా బలాలేమిటో నాకు తెలుసు. నన్ను నేను నమ్ముకున్నా. పిచ్ స్వభావం గురించి వికెట్ కీపర్, కెప్టెన్‌తో ముందుగానే చర్చించేవాడిని. అందుకు అనుగుణంగానే బౌలింగ్ చేశాను. డెత్ ఓవర్లలో కట్టర్స్, యార్కర్లు వేశాను. ఐపీఎల్‌లో ఏం చేశానో ఇక్కడ కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యాను. అనుకున్నది అనుకున్నట్లుగా ఆచరణలో పెట్టాను'' అని చెప్పుకొచ్చాడు.

అచ్చం బుమ్రాలానే..
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న నటరాజన్.. అరంగేట్రంలోనే అదరగొట్టాడు. తన ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి 2-0తో సిరీస్ కోల్పోయిన జట్టుకు ఉపశమన విజయాన్నందించాడు. ఈ సూపర్ ఫెర్ఫామెన్స్‌తో టీ20ల్లోకి కూడా అరంగేట్రం చేసి మరో బుమ్రాలా చెలరేగాడు.
తొలి టీ20లో 4 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసిన నట్టూ.. రెండో టీ20లో భారత బౌలర్లంతా విఫలమైన వేళ పొదుపైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. మంగళవారం జరిగిన ఆఖరి టీ20లోనూ నట్టూ ఆకట్టుకున్నాడు. జోరు మీదున్న గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను ఔట్ చేసి భారీ స్కోర్‌కు అడ్డుకట్ట వేశాడు. మాథ్యూ వేడ్‌ను ఔట్ చేసినప్పటికీ అంపైర్ల తప్పిదంతో అది ఖాతాలోకి రాలేదు. ఇక నట్టూ అంతర్జాతీయ అరంగేట్రం అచ్చం బుమ్రాలానే ఉండటం విశేషం.

తెలుగులో మాట్లాడిన కామెంటేటర్లు..
ఇక నటరాజన్‌తో ఇంటరాక్షన్ అనంతరం మురళీ కార్తీక్‌ను ప్రఖ్యాత కామెంటేటర్ హర్షా భోగ్లే ప్రశంసించాడు. మల్టీ టాలెంటెడని, వివిధ భాషల్లో మాట్లాడగలిగే నైపుణ్యం ఉందని కొనియాడాడు. హిందీ, తమిళ్, ఇంగ్లీష్ ఇలా ఎక్కడ అవసరమైతే అక్క కార్తీక్ ప్రత్యక్షమవుతున్నాడని తెలిపాడు. అంతేకాకుండా తెలుగు కూడా మాట్లాడుతారా? అని ప్రశ్నించగా.. కొంచెం కొంచె వచ్చని కార్తీక్ బదులిచ్చాడు. ఇక హర్షా భోగ్లే తెలుగువాడనే విషయం తెలిసిందే. గతంలో కూడా భోగ్లే లైవ్ షోలో పలు మార్లు తెలుగులో మాట్లాడాడు.


Click it and Unblock the Notifications












