
తొలి టెస్టుకు మురళీకి మార్గం సుగమం
బీసీసీఐ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో.. జట్టులోకి మూడో ఓపెనర్‌గా ఎంపికైన మురళీ విజయ్‌కి తొలి టెస్టు ఆడేందుకు దారులు తెరుచుకున్నట్లు అయింది. ఈ ఏడాది ఇంగ్లాండ్‌లో ముగిసిన టెస్టు సిరీస్‌లో కూడా మురళీ విజయ్ ఘోరంగా విఫలమైయ్యాడు. తొలి రెండు టెస్టుల్లోనూ 4 ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 25 పరుగులే చేశాడు. ఇందులో రెండు డకౌట్స్ కూడా ఉన్నాయి.
కోహ్లీ.. అనుష్కలు ఎలా ఉండాలో ముందుగానే చెప్పా: హర్భజన్

ఆసీస్ గడ్డపై మంచి రికార్డు ఉండటంతో
తర్వాత 3 టెస్టుల్లోనూ అతనిపై వేటు పడగా.. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌కీ సెలక్టర్లు అవకాశమివ్వలేదు. కానీ, ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా పర్యటనకు మురళీ విజయ్ ప్రదర్శన అనుకూలంగానే ఉంటుంది. దాంతో పాటు ఆసీస్ గడ్డపై మంచి రికార్డు ఉండటంతో మరోసారి అతడికి అవకాశమిచ్చేందుకు సెలక్టర్లు అవకాశమిచ్చారు. ఇంతకుముందు రెగ్యులర్ ఓపెనర్లుగా పృథ్వీ షా, కేఎల్ రాహుల్‌ని ఎంపిక చేసి.. మూడో ఓపెనర్‌గా మాత్రమే అవకాశమిచ్చారు.

482 పరుగులు చేసిన మురళీ విజయ్
దీంతో.. ఆ ఇద్దరిలో ఎవరైనా విఫలమైతే తప్ప.. విజయ్‌కి అవకాశం రాదని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ.. తాజాగా పృథ్వీ షా గాయం.. విజయ్ ఊహించని రీతిలో అవకాశం తెచ్చిపెట్టింది. భారత్ జట్టు ఆస్ట్రేలియా గడ్డపై ఆఖరిసారి 2014-15లో టెస్టు సిరీస్ ఆడగా.. అప్పుడు మురళీ విజయ్ 60.25 సగటుతో ఏకంగా 482 పరుగులు చేశాడు. అందులో గబ్బా పిచ్‌పై 144 పరుగులతో పాటు.. అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టులో 55, 99 పరుగులు చేసిన ఇన్నింగ్స్ కూడా ఉంది.

భారత్ టెస్టు జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, ఆజింక్య రహానె, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్


Click it and Unblock the Notifications












