Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: నా తండ్రి కల నెరవేరింది.. మహ్మద్ సిరాజ్ భావోద్వేగం!

 India vs Australia: Mohammed Siraj Says getting india cap was biggest achievement of my life

మెల్‌‌బోర్న్: భారత జట్టు తరఫున టెస్ట్, వన్డేల్లో ఆడాలనేది తన తండ్రి కలని, ఈ రోజు అది నేరవేరిందని టీమిండియా యువ పేసర్, హైదరాబాద్ గల్లీ బాయ్ మహ్మద్ సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేసి ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు ఎంపికైన సిరీస్‌కు కఠిన పరీక్ష ఎదురైంది. జట్టుతో కలిసి సిడ్నీ క్వారంటైన్‌లో ఉన్న సమయంలో సిరాజ్‌ తండ్రి అనారోగ్యంతో మరణించారు.

భారత్‌కు వెళ్లి వస్తే క్వారంటైన్‌ ఇబ్బందులుంటాయన్న ఉద్దేశంతో ఈ హైదరాబాద్ పేసర్ అంత్యక్రియలకు హాజరుకాలేదు. భారత్‌ తరఫున టెస్టుల్లో ప్రాతినిధ్యం వహిస్తే చూడాలనుకున్న తన తండ్రి కల కోసం.. బాధను పంటి బిగువన భరిస్తూ ఆసీస్‌లోనే ఉండిపోయాడు.

 అరంగేట్రంలో అదుర్స్..

అరంగేట్రంలో అదుర్స్..

కానీ ఫస్ట్ టెస్టులో అతనికి అవకాశం దక్కలేదు. కానీ ఆ మ్యాచ్‌లో స్టార్ పేసర్ మహ్మద్ షమీ గాయపడటంతో బాక్సింగ్ డే టెస్టుతో సంప్రదాయక ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత బౌలింగ్‌తో రెండు వికెట్లు తీశాడు. అయితే తొలి రోజు ఆటలో సిరాజ్‌ బౌలింగ్ చేయడానికి చాలా సేపు నిరీక్షించాడు. కెప్టెన్ రహానే వ్యూహాల్లో భాగంగా తొలి సెషన్ అనంతరం బంతిని అందుకున్నాడు.

ఆలస్యంగా బౌలింగ్‌కు వచ్చినా ఆసీస్‌ కీలక ఆటగాళ్లు అయిన లబుషేన్‌, గ్రీన్‌ను తెలివిగా బోల్తాకొట్టించి భారత్ పైచేయి సాధించడంలో ప్రధానపాత్ర పోషించాడు. సిరాజ్‌ తొలి వికెట్ సాధించిన అనంతరం ఆకాశం వైపు చేతులు చూపిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. తన తండ్రికి ఘన నివాళి అర్పించాడు.

విలువైనది సాధించా..

విలువైనది సాధించా..

తొలి రోజు ఆట ముగిసిన అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన సిరాజ్.. జీవితంలో విలువైనది సాధించినట్లుగా ఉందని సంతోషం వ్యక్తం చేశాడు. ‘టీమిండియా క్యాప్‌ను అందుకున్న తర్వాత నా జీవితంలో విలువైనది సాధించినట్లుగా అనిపించింది. అజింక్యా రహానే, జస్‌ప్రీత్ బుమ్రాతో మాట్లాడిన తర్వాత నా కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది.

అయితే మైదానంలోకి వచ్చిన తర్వాత బౌలింగ్ చేయాలని ఎంతో ఆతృతగా ఎదురుచూశాను. కానీ లంచ్‌ తర్వాత నేను బౌలింగ్‌ చేయాలని రహానే చెప్పాడు. ఎందుకంటే పిచ్‌పై తేమ ఉండటంతో స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. లంచ్ విరామం తర్వాత పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. దీంతో డాట్ బాల్స్‌ వేస్తూ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తీసుకురావాలని భావించా'అని సిరాజ్ పేర్కొన్నాడు.

మా నాన్న కల నెరవేరింది..

మా నాన్న కల నెరవేరింది..

సిరాజ్‌ అరంగేట్రం గురించి అతని సోదరుడు ఇస్మాయిల్‌ ఆనందం వ్యక్తం చేశాడు. ‘భారత్‌ తరఫున సిరాజ్‌ టెస్టుల్లో, వన్డేల్లో ఆడాలన్నది మా నాన్న కల. అది ఈ రోజు నెరవేరింది. అయితే రెండో టెస్టు జట్టులో సిరాజ్ పేరు ప్రకటించిన అనంతరం మాకు నిద్ర పట్టలేదు. సిరాజ్‌ ప్రదర్శన చూడటానికి రాత్రంతా ఆశగా ఎదురుచూశాం. ఉదయం నాలుగు గంటలకి టీవీ ఆన్‌ చేసి అతని బౌలింగ్ కోసం ఎదురుచూడటం ప్రారంభించాం. కానీ ఎంతో సేపు తర్వాత తొలి ఓవర్‌ వేశాడు'అని చెప్పుకొచ్చాడు.

 ఆసీస్ 195 ఆలౌట్..

ఆసీస్ 195 ఆలౌట్..

భారత బౌలర్లు చెలరేగడంతో ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 72.3 ఓవర్లలో 195 పరుగులకే ఆలౌటైంది. మార్నస్‌ లబ్‌షేన్‌ (132 బంతుల్లో 48; 4 ఫోర్లు), ట్రావిస్‌ హెడ్‌ (38), మాథ్యూ వేడ్‌ (30) మాత్రమే కొద్దిగా పరుగులు చేయగలిగారు. బుమ్రాకు 4 వికెట్లు దక్కగా, అశ్విన్‌ 3 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్‌ 2 వికెట్లు తీశాడు. అనంతరం భారత్‌ ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోయి 36 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ కూడా తడబడింది. ఆసీస్ తరహాలోనే వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకొని 173 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. క్రీజులో కెప్టెన్ రహానే(49 బ్యాటింగ్), జడేజా(3 బ్యాటింగ్) ఉన్నారు.

Story first published: Sunday, December 27, 2020, 9:44 [IST]
Other articles published on Dec 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+