For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Boxing Day Test: లబుషేన్‌కు తెలుగోడి దెబ్బ.. టెస్టుల్లో సిరాజ్‌కు తొలి వికెట్‌!!

India vs Australia: Mohammed Siraj gets first test wicket

మెల్‌బోర్న్‌: హైదరాబాద్ స్టార్ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ టెస్టుల్లో తొలి వికెట్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న రెండో టెస్టులో ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌ (48; 132 బంతుల్లో 4x4)ను ఔట్ చేయడం ద్వారా.. సిరాజ్‌ తన టెస్ట్ కెరీర్‌లో తొలి వికెట్ దక్కించుకున్నాడు. సిరాజ్ వేసిన 49వ ఓవర్‌ మూడో బంతి లెగ్‌సైడ్‌ వెళుతుండగా.. లబుషేన్‌ ఫ్లిక్‌ చేయడంతో శుభ్‌మన్ ‌గిల్‌ అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో లబుషేన్‌ హాఫ్ సెంచరీ ముందు ఔట్ అయ్యాడు. తొలి వికెట్ పడగొట్టిన సిరాజ్‌ను సహచరులు అభినందించారు.

అశ్విన్ మాయాజాలం:

అశ్విన్ మాయాజాలం:

ఇవాళ ఉద‌యం టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న‌ది. జో బ‌ర్న్స్ డకౌట్ కాగా.. మార్నస్‌ లబుషేన్‌ క్రీజులోకి వచ్చాడు. మ‌రో ఓపెన‌ర్ మాథ్యూ వేడ్ (30)తో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వెడ్‌ వేగంగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశాడు. అయితే 11వ ఓవర్లోనే కెప్టెన్ అజింక్య రహానే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేతికి బంతినిచ్చాడు. ఆష్ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. 13వ ఓవర్ ఐదవ బంతికి వెడ్‌ క్యాచ్ ఔట్ అయ్యాడు. రవీంద్ర జడేజా అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ (0).. అశ్విన్ మాయాజాలానికి మరోసారి చిక్కాడు.

తెలుగోడి దెబ్బకు లబుషేన్ అబ్బ:

తెలుగోడి దెబ్బకు లబుషేన్ అబ్బ:

ఆర్ అశ్విన్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు పడగొట్టి ఆసీస్ టాప్ ఆర్డర్‌ను బెంబేలెత్తించాడు. దీంతో 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆసీస్ కష్టాల్లో పడింది. అయితే మార్కస్ లబుషేన్ మాత్రం వికెట్ కాపాడుకుంటూ పరుగులు చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. క్రీజులో పట్టుకుపోయాడు. ట్రావిస్ హెడ్ అండతో 80కి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక బుమ్రా వేసిన 41.5 ఓవర్‌లో అర్ధశతకం వైపు పయనిస్తున్న హెడ్ ‌(38) ఔటయ్యాడు. మరి కొద్దిసేపటికి తెలుగోడి దెబ్బకు లబుషేన్‌ పెవిలియన్ చేరాడు. సిరాజ్‌ 49.3 ఓవర్‌లో ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ లబుషేన్)ను ఔట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 134 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కామరూన్‌ గ్రీన్ (8), టిమ్‌ పైన్‌ (7) ఉన్నారు. ఆసీస్ 59 ఓవర్లలో 5 వికెట్లకు 145 రన్స్ చేసింది.

 13 ఓవర్లు.. ఒక వికెట్:

13 ఓవర్లు.. ఒక వికెట్:

వీవీఎస్‌ లక్ష్మణ్‌ (1996) తర్వాత హైదరాబాద్‌లో పుట్టి, టెస్టు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి క్రికెటర్‌ మొహ్మద్ సిరాజే కావడం విశేషం. మధ్యలో మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్‌ ఓజా హైదరాబాద్‌కు ఆడినా.. అతను భువనేశ్వర్‌లో పుట్టాడు. సిరాజ్‌ ఇప్పటివరకు భారత్ తరఫున ఒక వన్డే, మూడు టీ20లు ఆడాడు. ఈరోజు టెస్ట్ ఆడుతున్నాడు. తన పదునైన బంతులతో ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను బెంబేలెత్తిస్తున్నాడు. ఇప్పటికి 13 ఓవర్లు వేసి 37 రన్స్ ఇచ్చాడు. ఇందులో 4 మేడిన్లు ఉన్నాయి.

 దుఃఖాన్ని దిగమింగి:

దుఃఖాన్ని దిగమింగి:

ఆసీస్‌ పర్యటన కోసం ప్రకటించిన (అక్టోబర్‌ 26) జట్టులో తన పేరు ఉండటంతో తండ్రికి ఫోన్‌ చేసిన సిరాజ్‌.. ‘అబ్బూ మై టెస్ట్‌ టీమ్‌ మే సెలెక్ట్‌ హోగయా. సిరీస్‌ ఖేల్‌నే ఆస్ట్రేలియా జా రాహా హూన్‌' (నాన్నా.. నేను టెస్టు జట్టుకు ఎంపికయ్యా. సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్తున్నా) అని ఆనందంగా చెప్పాడు. అయితే తుది జట్టులో చోటు దక్కించుకునే సమయానికి మాత్రం సిరాజ్‌ తండ్రి గౌస్‌ కానరాని లోకాలకు వెళ్లిపోయారు. దుఃఖాన్ని దిగమింగి.. నవంబర్‌ 20న భారత జట్టు ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో తండ్రి చనిపోయిన వార్త సిరాజ్‌కు చేరింది. ఊహించని ఘటనతో ఒక్కసారిగా కుప్పకూలిన సిరాజ్‌.. తండ్రిని చూసేందుకు స్వదేశానికి వెళ్లేందుకు కూడా నిరాకరించాడు. క్వారంటైన్‌ నిబంధనల నేపథ్యంలో స్వదేశానికి వస్తే.. తిరిగి ఆస్ట్రేలియా చేరడం కష్టం కావడంతో బీసీసీఐ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాడు. ఇప్పడు తొలి టెస్ట్ ఆడుతున్నాడు.

టీమిండియా భారీస్కోరు సాధిస్తే.. బౌలర్లే గెలిపిస్తారు: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌

Story first published: Saturday, December 26, 2020, 10:47 [IST]
Other articles published on Dec 26, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+