Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహ్మద్‌ షమీ రిటైర్డ్‌ హర్ట్‌ కాదు.. రిటైర్డ్‌ ఔట్!! క్రికెట్‌ చరిత్రలో ఇది మూడోసారే!

India vs Australia: Mohammed Shami not retires hurt, Its retires out

అడిలైడ్‌: ఆస్ట్రేలియా‌తో జరుగుతున్న డే/నైట్ టెస్టు రెండో ఇన్నింగ్‌లో టీమిండియా 36 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ ముగించిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా టెస్టుల్లో అత్యంత తక్కువ స్కోరుతో చెత్త రికార్డు నమోదు చేసింది. అంతేకాదు కోహ్లసేన ఓటమి కూడా దాదాపు ఖాయం అయింది. మరో 40 రన్స్ చేస్తే.. ఆసీస్ విజయాన్ని అందుకుంటుంది. అయితే టీమిండియా ఇన్నింగ్స్‌లో పేసర్ మహ్మద్‌ షమీ రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరగడం ఒక ఆసక్తికర చర్చకు తెరలేపింది.

రిటైర్డ్‌ హర్ట్ కాదు:

రిటైర్డ్‌ హర్ట్ కాదు:

సాధారణంగా క్రికెట్‌లో 'రిటైర్డ్‌ హర్ట్' అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. బ్యాటింగ్‌ సమయంలో ఎవరైనా బ్యాట్స్‌మన్‌ గాయపడినా లేక అనారోగ్య కారణాలు ఉంటే.. అంపైర్‌ అనుమతితో ఇన్నింగ్స్‌కు బ్రేక్‌ తీసుకునే అవకాశం ఉంటుంది.అయితే ఒక్కసారి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగిన ఆటగాడు మళ్లీ బ్యాటింగ్‌కు రావాలనుకుంటే మాత్రం జట్టులో అందరూ ఔటయ్యక మాత్రమే అతనికి అవకాశం కల్పిస్తారు. తాజాగా ఐసీసీ సవరించిన నిబంధనల ప్రకారం రిటైర్డ్‌ హర్ట్‌ అయిన ఆటగాడి స్థానంలో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ను వినియోగించుకునే కొత్త రూల్‌ను తీసుకొచ్చారు.

 షమీ రిటైర్డ్‌ ఔట్:

షమీ రిటైర్డ్‌ ఔట్:

అయితే రిటైర్డ్‌ ఔట్ మాత్రం దీనికి పూర్తిగా విరుద్దం. ఒక బ్యాట్స్‌మన్‌ అంపైర్‌ అనుమతి లేకుండా.. తన సొంతంగా నిర్ణయం తీసుకొని ఇన్నింగ్స్‌ కొనసాగించకుండా బయటికే వెళ్లిపోవడాన్ని రిటైర్డ్‌ ఔట్‌గా పరిగణిస్తారు. రిటైర్డ్‌ ఔట్‌గా ఎవరైనా బ్యాట్స్‌మన్‌ బయటికి వెళ్లిపోతే మళ్లీ ఆడేందుకు అనుమతించరు. క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు రిటైర్డ్‌ ఔట్‌ రెండుసార్లు మాత్రమే చోటుచేసుకుంది. రిటైర్డ్‌ ఔ‌గా వెనుదిరిగిన ఆ ఇద్దరు శ్రీలంక జట్టుకు చెందినవారే. వారే మార్వాన్ ఆటపట్టు, మహేళ జయవర్దనే. అయితే ఇద్దరు ఒక్క టెస్టు మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లోనే రిటైర్డ్‌ ఔ‌గా వెనుదిరగడం ఇక్కడ విశేషం.

 మూడో ఆటగాడిగా షమీ రికార్డు:

మూడో ఆటగాడిగా షమీ రికార్డు:

2001వ సంవత్సరంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మార్వాన్ ఆటపట్టు, మహేళ జయవర్దనే రిటైర్డ్‌ ఔట్‌గా పెవిలియన్ చేరారు. తాజాగా ఆసీస్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో మహ్మద్‌ షమీ రిటైర్డ్‌ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో క్రికెట్‌ చరిత్రలో రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగిన మూడో ఆటగాడిగా షమీ రికార్డుల్లోకి ఎక్కాడు. అంతేకాదు టీమిండియా తరపున మొదటి ఆటగాడిగా కూడా నిలిచాడు. రిటైర్డ్‌ ఔట్‌గా వెళ్లిన షమీ ప్రస్తుతం బౌలింగ్ చేయడం లేదు.

88 సంవత్సరాలుగా:

88 సంవత్సరాలుగా:

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేస‌ర్ జోష్ హేజ‌ల్‌వుడ్ ఐదు వికెట్లు తీసి స‌త్తా చాటాడు. ఐదు ఓవ‌ర్లు వేసిన హేజ‌ల్‌వుడ్ 8 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. టెస్టుల్లో అత‌ని వికెట్ల సంఖ్య 200 దాటింది. హేజ‌ల్‌వుడ్ కెరీర్‌లో ఇదో మైలురాయి. వృద్ధిమాన్ సాహా, ఆర్ అశ్విన్‌ల‌ను వ‌రుస బంతుల్లో ఔట్ చేసిన హేజ‌ల్‌వుడ్ ఆ ఓవ‌ర్‌లో హ్యాట్రిక్ కోసం ప్ర‌య‌త్నించాడు. కానీ కుదరలేదు. ఈ మ్యాచ్‌లో హేజ‌ల్‌వుడ్ నెలకొల్పిన ఎకానమీ.. గత 88 సంవత్సరాలుగా ఐదు వికెట్లను పైగా తీసిన ఏ బౌలర్ నమోదు చేయలేదు.

టీమిండియా అత్యంత చెత్త రికార్డు.. టెస్టు చరిత్రలో 46ఏళ్ల తర్వాత!!

Story first published: Saturday, December 19, 2020, 13:53 [IST]
Other articles published on Dec 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+