For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా అత్యంత చెత్త రికార్డు.. టెస్టు చరిత్రలో 46ఏళ్ల తర్వాత!!

India vs Australia: Team India 36 all out to record their lowest total in Test history

అడిలైడ్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా మూడో రోజే చేతులెత్తేసింది. ఓవర్ నైట్ స్కోర్ 9/1తో శనివారం రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియా.. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ దెబ్బకి 36/9కే పరిమితమైంది. చివరి వికెట్‌గా వచ్చిన మహ్మద్ షమీ గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో 36 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ని భారత్ డిక్లేర్ చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 53 పరుగులు కలుపుకుని మొత్తం 90 పరుగుల టార్గెట్ ఆస్ట్రేలియా ముందు నిలిచింది.

 46ఏళ్ల తర్వాత:

46ఏళ్ల తర్వాత:

టెస్టు క్రికెట్‌లో టీమిండియా అత్యంత చెత్త రికార్డు నమోదు చేసి అప్రతిష్టను మూటగట్టుకుంది. ఇప్పటివరకు చూసుకుంటే టీమిండియాకు టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోరు 42గా ఉంది. 1974లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ఈ స్కోరును నమోదు చేసింది. 46ఏళ్ల తర్వాత వరస్ట్ రికార్డును కోహ్లీసేన బ్రేక్ చేసింది. షమీ గాయంతో రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరగడంతో 36 పరుగుల వద్ద 9 వికెట్లతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగించాల్సి వచ్చింది. దీంతో టీమిండియా అత్యంత తక్కువ స్కోరు నమోదు చేసిన చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. అంతేకాకుండా టెస్టు చరిత్రలోనే 4వ అత్యల్ప స్కోరును సమం చేసింది.

 వంద క‌న్నా త‌క్కువ స్కోర్:

వంద క‌న్నా త‌క్కువ స్కోర్:

టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో వంద క‌న్నా త‌క్కువ స్కోర్‌కే టీమిండియా ఐదు సార్లు ఆలౌట్ అయ్యింది. 1947లో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా చేతిలో 58 చేసి ఆలౌటైంది. 1952లో మాంచెస్ట‌ర్‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ 58 ర‌న్స్ చేసింది. 1996లో డ‌ర్బ‌న్‌లో దక్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో అత్య‌ల్పంగా 66 ర‌న్స్ చేసి ఆలౌటైంది. 2020 సంవ‌త్స‌రం టీమిండియాకు చేదు అనుభ‌వాన్ని మిగ్చిలింది.

 టాప్ ఆర్డర్ విఫలం:

టాప్ ఆర్డర్ విఫలం:

శుక్రవారం చివరి సెషన్‌లోనే ఓపెనర్ పృథ్వీ షా (4) ఔటవగా.. నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా (2: 17 బంతుల్లో) ఈరోజు ఆరంభంలోనే ఫాస్ట్ బౌలర్ కమిన్స్‌ బౌలింగ్‌లో అతనికే సులువైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత జోష్ హేజ‌ల్‌వుడ్‌, పాట్ క‌మ్మిన్స్‌లు భారత టాప్ ఆర్డ‌ర్‌ను దెబ్బ‌తీశారు. నిప్పులు చెరిగే బంతులు వేస్తూ.. భార‌త బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్టారు. దీంతో చతేశ్వర్ పుజారా (0), విరాట్ కోహ్లీ (4), అజింక్య రహానె (0), మయాంక్ అగర్వాల్ (9: 40 బంతుల్లో 1x4) వరుస ఓవర్లలో ఔటయ్యారు. దీంతో కీలక వికెట్లు కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.

 21.2 ఓవర్లు మాత్రమే:

21.2 ఓవర్లు మాత్రమే:

ఆపై ఆదుకుంటారనుకున్న వృద్ధిమాన్ సాహా (4), హనుమ విహారి (8) కూడా ఔట్ అవ్వడంతో భారత్ ఆశలు వదులుకుంది. ఆర్ అశ్విన్ (0), ఉమేష్ యాదవ్ (4) కూడా త్వరగానే ఔట్ అయ్యారు. షమీ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుతిరగడంతో భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 21.2 ఓవర్లు మాత్రమే ఎదుర్కోగా.. స్టార్క్ (0/7), కమిన్స్ (4/21), హేజిల్‌వుడ్ (5/8)తోనే అన్ని ఓవర్లనీ ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనీ వేయించడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 53 పరుగుల ఆధిక్యం లభించడంతో ఆస్ట్రేలియా లక్ష్యం 90 పరుగులుగా నమోదైంది.

హ‌డ‌లెత్తించిన హేజిల్‌వుడ్, క‌మ్మిన్స్‌.. కుప్ప‌కూలిన కోహ్లీసేన.. ఆస్ట్రేలియా టార్గెట్ 90

Story first published: Saturday, December 19, 2020, 12:29 [IST]
Other articles published on Dec 19, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+