
ఆసీస్ నుంచి గట్టి సవాల్:
సుదీర్ఘ పర్యటనలో భాగంగా నవంబరు 27 నుంచి ఆస్ట్రేలియాతో వరుసగా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల సిరీస్‌లని భారత్ ఆడనుంది. నవంబర్ 27న సిడ్నీలో జరిగే తొలి వన్డేతో సిరీస్ ప్రారంభం కానుంది. మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న ఈ సిరీస్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ సహా మార్నస్ లబుషేన్ కూడా జట్టులో ఉండటంతో ఆసీస్ నుంచి గట్టి సవాల్ ఎదురవుతుందన్నది విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. అయితే ఫాస్ట్ బౌలర్లు గత ప్రదర్శనను పునరావృతం చేస్తారని, సిరీస్ గెలుస్తాం అని మహ్మద్ షమీ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.

అలాంటి పేస్ అవసరం:
తాజాగా మహ్మద్ షమీ మాట్లాడుతూ... 'భారత ఫాస్ట్ బౌలర్ల బృందం నిలకడగా గంటకు 140 కిమీ వేగంతో బంతులు సంధిస్తుంది. యూ=ఆస్ట్రేలియాలో సత్తాచాటాలంటే అలాంటి పేస్ అవసరం. రిజర్వ్ బెంచ్‌లో ఉన్నవాళ్లు కూడా ఫాస్ట్ బౌలర్లే. మాలాంటి బౌలింగ్ విభాగం మరెక్కడా లేదు. ఎలాంటి సవాల్‌నైనా అధిగమించగలం. మాకు చాలా అనుభవం ఉంది. మా స్పిన్ బౌలింగ్‌లో వైవిధ్యం ఉంది. వేగంగా బౌలింగ్ చేయగలం. కాని మేమంతా భిన్నమైన బౌలర్లం. నైపుణ్యాలు విభిన్నం. కచ్చితంగా సత్తాచాటుతాం' అని అన్నాడు.

భారత పేసర్ల విజయ రహస్యం అదే:
'టీమిండియాలో నాణ్యమైన బ్యాట్స్‌మెన్ ఉన్నారు. వారికి నెట్స్‌లో బౌలింగ్ చేస్తాం కానీ పేర్లను చూడం. నైపుణ్యాలపైనే దృష్టిసారిస్తాం. ఎంత ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మన్ అయినా.. ఒక్క మంచి బంతి ఔట్ చేస్తుంది. సమష్టితత్వమే భారత పేసర్ల విజయ రహస్యం. మ్యాచ్‌లో మా అందరి లక్ష్యం ఒక్కటే ఉంటుంది. అందరం కలిసే ఆ లక్ష్యాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తాం. మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉందే తప్ప.. ఎలాంటి వైరం లేదు. విదేశాల్లో దాదాపు ప్రతి మ్యాచ్‌లో 20 వికెట్లు పడగొట్టాం. సొంతగడ్డపై జరిగిన గులాబీ బంతి టెస్టులోనూ ఫాస్ట్ బౌలర్లు ప్రభావం చూపారు' అని షమీ చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియాకు లాభం:
తొలి టెస్టు ముగిసిన వెంటనే కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్ వచ్చేయనున్నాడు. జనవరిలో కోహ్లీ సతీమణి అనుష్క శర్మ బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో.. ప్రసవ సమయంలో ఆమె చెంత ఉండాలని విరాట్ ఆశిస్తున్నాడు. బీసీసీఐ కూడా అతనికి పితృత్వ సెలవుల్ని కేటాయించింది. పితృత్వ సెలవులపై కోహ్లీ ఆసీస్‌తో చివరి మూడు టెస్టులకు దూరమవ్వడం భారత జట్టుకు తీరని లోటని మాజీలు అందరూ అంటున్నారు. అలానే ఆస్ట్రేలియాకు కలిసి వస్తుందంటున్నారు.
India vs Australia: అదరగొట్టిన విరాట్ కోహ్లీ.. 58 బంతుల్లో 91 పరుగులు!!


Click it and Unblock the Notifications
