For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే కన్నీళ్లు ఆగలేదు: మహ్మద్ సిరాజ్

India vs Australia: Mohammad Siraj reveals why did he cry during the national anthem time at Sydney Test

సిడ్నీ: తన తండ్రి గుర్తుకురావడంతో ఉబికి వచ్చిన దు:ఖాన్ని ఆపుకోలేకపోయానని టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ తెలిపాడు. బోర్డర్‌-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా గురువారం భారత్- ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయగీతం ఆల‌పిస్తున్న స‌మ‌యంలో హైదరాబాద్ పేసర్ సిరాజ్ చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఓవైపు జాతీయ గీతాన్ని ఆలపిస్తూనే మరోవైపు కన్నీటిపర్యంతమయ్యాడు. సిరాజ్ కన్నీరు పెట్టుకున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ అయింది.

నాన్న గుర్తొచ్చాడు..

ఇక మ్యాచ్ అనంతరం తన దు:ఖానికి గల కారణాన్ని సిరాజ్ వెల్లడించాడు. తాను భారత జట్టుకు ఆడాలనేది తన తండ్రి కోరికని, అది నేరివేరినా చూసేందుకు ఆయన లేరనే విషయం గుర్తొంచి దు:ఖాన్ని ఆపుకోలేకపోయానన్నాడు. 'జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు నాకు మా నాన్న గుర్తొచ్చాడు. నేను భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడాలనేది ఆయన కోరిక. ఈ రోజు ఆయనే ఉంటే నా ఆటను చూసేవాడు.'అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.

ఆసీస్ పర్యటనలో ఉండగానే..

ఆసీస్ పర్యటనలో ఉండగానే..

సిరాజ్ ఆసీస్ పర్యటనలో ఉండగానే అతని తండ్రి మహ్మద్ గౌస్‌ మరణించారు. తండ్రి అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లేందుకు బీసీసీఐ అవ‌కాశం క‌ల్పించింది. కానీ తొలిసారి భార‌త టెస్ట్ జట్టుకు ఆడే అవ‌కాశం ద‌క్క‌డంతో పాటు క్వారంటైన్ నిబంధ‌న‌ల కారణంగా తాను స్వ‌దేశానికి వెళ్ళేందుకు అంగీక‌రించ‌లేదు. భారత్ వస్తే.. మళ్లీ ఆసీస్ వెళ్లాక క్వారంటైన్లోకి వెళ్లాలి. అలా అయితే టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం కోల్పోతానని భావించి అక్కడే ఉన్నాడు. భారత్ తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడాలనే తన తండ్రిని కలను నెరవేర్చేందుకు బాధను దింగమింగుకొని తొలి టెస్ట్ బరిలోకి దిగాడు.

బాక్సింగ్ డే టెస్ట్‌తో అరంగేట్రం

బాక్సింగ్ డే టెస్ట్‌తో అరంగేట్రం

భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ గాయంతో దూరమవ్వడంతో మెల్‌బోర్న్ టెస్ట్‌లో సిరాజ్‌కు అవకాశం దక్కింది. అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత బౌలింగ్‌తో సత్తాచాటాడు.

(2/40, 3/37) ఐదు వికెట్లతో జట్టు విజయంలో భాగమై అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సూపర్ పెర్ఫామెన్స్‌తో తాజా సిడ్నీ టెస్ట్‌లోనూ చోటు దక్కించుకున్నాడు.ఆసీస్ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్న‌ర్‌( 5) పెవిలియన్‌కు చేర్చి భారత్‌కు శుభారంభాన్ని అందించాడు. ఆ తర్వాత పుకోస్కీని ఔట్ చేసే అవకాశం వచ్చినా పంత్ అలసత్వంతో చేజారింది.

ఆసీస్ 166/2

ఆసీస్ 166/2

పంత్ చెత్త కీపింగ్‌తో తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. వర్షం అంతరాయంతో 55 ఓవర్ల ఆటనే సాగగా.. నిలిచే సమయానికి ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. మార్నస్‌ లబుషేన్( 149 బంతుల్లో 8 ఫోర్లతో 67 బ్యాటింగ్ ), స్టీవ్‌స్మిత్‌(64 బంతుల్లో 5 ఫోర్లతో 31 బ్యాటింగ్ ) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. మహ్మద్‌ సిరాజ్‌, నవ్‌దీప్‌ సైనీ చెరో వికెట్‌ తీశారు. ఆస్ట్రేలియా ఓపెనర్లలో డేవిడ్‌ వార్నర్‌(5) విఫలమైనా, పకోస్కీ(110 బంతుల్లో 4 ఫోర్లతో 62) అర్ధశతకంతో రాణించాడు.

Story first published: Thursday, January 7, 2021, 15:53 [IST]
Other articles published on Jan 7, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+