Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: మహ్మద్ షమీ షూకు హోల్.. ఎందుకో తెలుసా?

India vs Australia: Mohammad Shami has a hole in his left shoe so the toe can be free
India vs Australia 1st Test: Hole in Shami’s Shoes During Bowling, Know the Reason

అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫస్ట్ డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ హోల్ ఉన్న షూతో బరిలోకి దిగడం చర్చనీయాంశమైంది. అతని ఏడమ బూటు ముందు భాగంలో బొటన వేలికి గాలి ఆడేలా పెద్ద హోల్ చేసి ఉంది. ఓవర్‌నైట్ స్కోర్ 236/6 తో రెండో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లీసేన.. స్టార్క్, కమిన్స్ ధాటికీ మరో 11 పరుగులు మాత్రమే చేసి 244 పరుగులకే కుప్పకూలింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్‌ సాహా (9 ), అశ్విన్‌ (15) పరుగులేమి చేయకుండా వెనుదిరగ్గా.. టేలండర్ ఉమేశ్ యాదవ్(6), మహ్మద్ షమీ(0) కూడా ఆసీస్ బౌలర్లను ఎదుర్కోలేకపోయారు. దాంతో భారత్ రెండో రోజు ఆట 25 బంతులకే పరిమితమైంది.

ఆ వెంటనే ఆసీస్ ఫస్ట్ ఇన్నింగ్స్‌ ప్రారంభించగా.. మైదానంలోకి దిగిన షమీ చిరిగిన షూస్‌తో కనిపించాడు. అదేంటి అంతర్జాతీయ క్రికెటర్ చిరిగిన షూస్ వేసుకోవడం ఏంటని అంతా షాక్ అయ్యారు. కానీ దాన్ని నిశితంగా పరిశీలించగా.. కావాలనే రంధ్రం చేసుకున్నట్లు కనిపించింది. బౌలింగ్ చేసేటప్పుడు బొటన వేలు ఫ్రీగా ఉండేందుకు షమీ ఈ ఆలోచన చేశాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హోల్ వల్ల బొటన వేలిపై ఎక్కువగా ఒత్తిడి పడదని, అతని సౌకర్యార్థం అలా చేసి ఉండవచ్చంటున్నారు. ఇక షమీ ఐడియాకు కొంత అభిమానులు ఫిదా అవుతుండగా.. మరికొందరు మాత్రం ఇది పాతదేనని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం షమీ షూకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్ల హల్‌చల్ చేస్తున్నాయి.

ఫస్ట్ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ధాటికి ఓపెనర్లు మాథ్యూ వేడ్(8), జో బర్న్స్(8) ఇద్దరూ స్వల్ప స్కోర్లకే వెనుదిరిగాడు. ఈ ఇద్దరిని బుమ్రా వికెట్లు ముందు బోల్తా కొట్టించగా.. రివ్యూ కెళ్లిన ఆసీస్ ఓపెనర్లు భంగపాటుకు గురయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన లబుషేన్‌కు భారత ఫీల్డర్లు రెండు లైఫ్‌లు ఇచ్చారు. బుమ్రా బౌలింగ్‌లో అతను ఇచ్చిన కష్టతరమైన స్లిప్ క్యాచ్‌ను అందుకోవడంలో సాహా, పుజారా విఫలమవ్వగా.. షమీ బౌలింగ్‌లో ఇచ్చిన సునాయస క్యాచ్‌ను బుమ్రా నేలపాలు చేశాడు. బౌండరీ లైన్ వద్ద తప్పుగా అంచనా వేసిన బుమ్రా నేలపాలు చేశాడు. ఇక సెకండ్ సెషన్ ముగిసే సరికి ఆసీస్ 18.4 ఓవర్లలో 2 వికెట్లకు 35 పరుగులు చేసింది. భారత్ కన్నా ఇంకా 209 పరుగుల వెనుకంజలో ఉంది.

Story first published: Friday, December 18, 2020, 11:51 [IST]
Other articles published on Dec 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+