Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: రెండో టీ20 ముందు ఆస్ట్రేలియాకు మరో షాక్.. స్టార్ పేసర్ ఔట్!

India vs Australia: Mitchell Starc Ruled Out Of T20I Series

సిడ్నీ: మూలిగే నక్క మీద తాటి పండు పడ్డ చందంగా తయారైంది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పరిస్థితి. ఇప్పటికే గాయాలతో స్టార్ ఆటగాళ్లంతా దూరమవ్వగా తాజాగా వ్యక్తిగత కారణాలతో స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది. స్టార్క్ కుటుంబ సభ్యుల్లో ఒకరు తీవ్ర అనారోగ్యానికి గురి కావడం వల్లే అతను ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని పేర్కొంది. ఈ ప్రపంచంలో అన్నిటి కన్నా ముఖ్యమైంది కుటుంబమేనని, స్టార్క్ కావాల్సినంత సమయాన్ని ఇస్తామని ఆసీస్ టీమ్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు.

'కుటుంబానికి, ఆప్తులకు మించినది ఏదీ లేదు. స్టార్క్ కుటుంబానికి అతని అవసరం ఉంది. అతను జట్టులోకి మళ్లీ ఎప్పుడు చేరుతాడనేది నిర్ధారించలేం.కుటుంబం విషయం కావడం వల్ల జట్టులో ఆడాలని తాము స్టార్క్‌పై ఒత్తిడిని తీసుకురాలేం. అతను ఎప్పుడు జట్టులోకి రావాలనుకుంటే అప్పుడు రావొచ్చు.'అని లాంగర్ స్పష్టం చేశాడు.

ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తోంటే.. టెస్ట్ సిరీస్‌కు కూడా స్టార్క్ దూరమయ్యే అవకాశాలున్నాయనిపిస్తుంది. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఈ నెల 17వ తేదీన ప్రారంభం కానుంది. ఇక ఆసీస్ జట్టును గాయాల బెడద వేధిస్తోంది. వన్డే సిరీస్‌ తర్వాత స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌తో పాటు ఆస్టన్‌ అగర్‌ దూరం కాగా.. కెప్టెన్ ఫించ్ ఆడటంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. తాజాగా స్టార్క్‌ సేవలను కూడా క్పోల్పోయింది.

మిచెల్ స్టార్క్ స్థానంలో మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే రెండో టీ20 మ్యాచ్‌లో ఆండ్రూ టై లేదా సామ్స్‌ను ఆడించే అవకాశం దక్కవచ్చు. ఐపీఎల్ ఆడిన అనుభవం దృష్ట్యా ఆండ్రూ టైకి అవకాశం రావచ్చు. ఇప్పటికే తొలి టీ20లో విజయం సాధించి మంచి ఊపు మీదున్న టీమిండియా మరో విజయం సాధించి సిరీస్‌ గెలవాలని చూస్తుంటే.. ఆసీస్‌ మాత్రం మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది.

Story first published: Sunday, December 6, 2020, 12:16 [IST]
Other articles published on Dec 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+