Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: పింక్ మ్యాచ్‌లో భారత్‌కు గట్టిషాక్.. పృథ్వీ షా సిల్వర్ డక్!

India vs Australia: Mitchell Starc removes Prithvi Shaw for 2nd-ball duck

అడిలైడ్: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న ఫస్ట్ డేనైట్ మ్యాచ్‌లో భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఖాతా తెరవకుండానే ఓపెనర్ పృథ్వీషా(0) వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ వేసిన సెకండ్ బాల్‌కు పృథ్వీ షా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్టార్క్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన షా.. డిఫెన్స్ చేయబోయి కట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే క్రీజులోకి చతేశ్వర్ పుజారా రాగా.. అతనికి లైఫ్ లభించింది. స్టార్క్ వేసిన నాలుగో బంతి పుజారా బ్యాట్ అంచుకు తగిలి ఫస్ట్ స్లిప్ వైపు దూసుకెళ్లింది.

ఈ కష్టతరమైన క్యాచ్‌ను ఆసీస్ ఫీల్డర్ వదిలేయడంతో పుజారా ఊపిరి పీల్చుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో అతనితో పాటు మయాంక్ అగర్వాల్(0) ఉన్నాడు. ఇక ప్రాక్టీస్ మ్యాచ్, ఐపీఎల్‌లో దారుణంగా విఫలమైన పృథ్వీషాకు మళ్లీ అవకాశం ఇవ్వడంపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. శుభ్‌మన్ గిల్ అద్భుతంగా రాణిస్తున్నా.. షాకు అనసరంగా అవకాశాలిస్తూ మూల్యం చెల్లించుకుంటున్నారని కామెంట్ చేస్తున్నారు. ఆరంభంలోనే వికెట్ కోల్పోతే భారత బ్యాటింగ్‌పై అనవసర ఒత్తిడి నెలకొంటుందని అభిప్రాయడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పేపరుమీద చూడటానికి ఇరుజట్లు బలంగానే కనిపిస్తున్నా.. రెండింటిలోనూ టాప్‌‌ ఆర్డర్‌‌ సమస్యలు ఉన్నాయి. అయితే వీటిని ఎంతమేరకు పరిష్కరించుకుంటాయన్న దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

ఈ మ్యాచ్‌‌ ద్వారా డే/నైట్‌‌ టెస్ట్‌‌లకు మరింత ప్రాచుర్యం కలుగుతుందని నిర్వాహకులు భావిస్తుంటే.. క్రికెట్‌‌ ఫ్యాన్స్‌‌ మాత్రం కోహ్లీ వర్సెస్‌‌ స్మిత్‌‌ రైవలరీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఓవరాల్‌‌గా రెండేళ్ల కిందట సిరీస్‌‌ గెలిచిన టీమిండియా.. దానిని నిలబెట్టుకోవాలని పక్కా ప్లాన్స్‌‌ వేస్తుండటం, ఈ మ్యాచ్‌‌ తర్వాత కోహ్లీ అందుబాటులో ఉండకపోవడంతో పింక్‌‌ టెస్ట్‌‌పై చాలా హైప్‌‌ క్రియేట్‌‌ అయ్యింది. దీంతో తెలియని ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఇరుజట్లు ఎలా ఆడతాయన్నదే ఆసక్తికరంగా మారింది.

Story first published: Thursday, December 17, 2020, 11:37 [IST]
Other articles published on Dec 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+