India vs Australia: కష్టాల్లో భారత్.. లంచ్ బ్రేక్ సమయానికి 161/4

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ అజింక్యా రహానే(93 బంతుల్లో 3 ఫోర్లతో 37) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్ వేసిన 55 ఓవర్ చివరి బంతి రహానే బ్యాట్ ఎడ్జ్ తీసుకొని నాలుగో స్లిప్ మాథ్యూ వేడ్ చేతిలో పడింది.
దాంతో 144 పరుగులకే భారత్ 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్(4)తో మయాంక్ అగర్వాల్(73 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 38)ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 60 ఓవర్లలో 161/4 పరుగులు చేసింది.
అంతకు ముందు 62/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ ఇన్నింగ్స్ నిలకడగా సాగింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ రహానే, పుజారా ఓపికగా ఆడుతూ ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అయితే పుజారా(25; 94 బంతుల్లో 2 ఫోర్లు) హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
దాంతో మూడో వికెట్‌కు నమోదైన 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక ఓపెనర్ రోహిత్ శర్మ(44), శుభ్‌మన్ గిల్(7) విఫలమయ్యారు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో లబుషేన్ సెంచరీతో ఆసీస్ 369 పరుగుల భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications