Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆదిలోనే ఆటంకం, తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా(వీడియో)

Australia v India Boxing Day Test, lunch break

మెల్‌బోర్న్‌: పరాజయాన్ని నెత్తినేసుకుని విజయకాంక్షతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. పెర్త్ టెస్టు అనంతరం బాక్సింగ్ డే టెస్టుకు జట్టులో మార్పులు చేర్పులు చేసుకుని టీమిండియా సమాయత్తమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకుని ఆసీస్ జట్టుకు భారీ టార్గెట్ నిర్దేశించాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. 40 పరుగుల వద్ద కమిన్స్‌ వేసిన 19వ ఓవర్లో విహారి(8) ఫించ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. కమిన్స్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 66 బంతులు ఆడిన విహారి 8 పరుగులు చేశాడు.

ప్రస్తుతం మయాంక్ అగర్వాల్‌‌(34), పుజారా(10) క్రీజులో ఉన్నారు. క్రీజులో నిలదొక్కుకోవలన్న ప్రయత్నంలో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఆచితూచి అడుగులేస్తున్నారు. లంచ్ విరామానికి భారత్ 57/1స్కోరుతో కొనసాగుతోంది.

1
43625

ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన కర్ణాటక పరుగుల యంత్రం మయాంక్‌ అగర్వాల్‌ నిలకడగా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో రెగ్యులర్‌ ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్‌ రాహుల్‌ ఇద్దరిపై ఒకేసారి వేటుపడేలా చేసింది. దాంతో వారి స్థానంలో మయాంక్‌, విహారిలు ఓపెనర్లుగా బరిలోకి దిగారు.

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన టీమిండియా.. పెర్త్‌ టెస్టులో దారుణంగా చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు మ్యాచ్‌లో టెస్టు సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు బాక్సింగ్‌ డే సమరంలో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్నాయి.

Story first published: Wednesday, December 26, 2018, 9:00 [IST]
Other articles published on Dec 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+