For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: హర్షల్ పటేల్ అట్టర్ ఫ్లాఫ్ .. చెలరేగిన మాథ్యూవేడ్.. భారత్‌ ముందు భారీ లక్ష్యం!

 India vs Australia: Matthew Wade leads AUS to 90/5 in 8-over hitathon, IND need 91 to level series

నాగ్‌పూర్: భారత్‌తో 8 ఓవర్లకు కుదించిన రెండో టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్లు దుమ్మురేపారు. మాథ్యూవేడ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43 నాటౌట్) మరోసారి పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఆరోన్ ఫించ్(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 31) సైతం చెలరేగడంతో ఆసీస్ నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్లకు 90 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. బుమ్రా ఓ వికెట్ పడగొట్టాడు. హర్షల్ పటేల్ 2 ఓవర్లలో 32 పరుగులిచ్చి దారుణంగా విఫలమయ్యాడు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. తొలి ఓవర్‌ నుంచే ధాటిగా ఆడింది. హార్దిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్‌లో ఫించ్ రెండు బౌండరీలు బాది 10 పరుగులు పిండుకున్నాడు. అక్షర్ పటేల్ వేసిన రెండో ఓవర్‌లో గ్రీన్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను విరాట్ నేలపాలు చేశాడు. దాంతో ఆ బంతి బౌండరీకి వెళ్లింది. అయితే ఆ వెంటనే సూపర్ ఫీల్డింగ్‌తో అతన్ని రనౌట్ చేశాడు. ఆ తర్వాత ఫించ్ బౌండరీ బాదగా.. చివరి బంతికి మ్యాక్స్‌వెల్‌ను అక్షర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. చాహల్ వేసిన మూడో ఓవర్‌లో సిక్స్ బాదిన ఫించ్.. 12 పరుగులు పిండుకున్నాడు. నాలుగో ఓవర్‌లో అక్షర్ తొలి బంతికే డేంజరస్ టీమ్ డేవిడ్(2)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన వేడ్ బౌండరీతో జోరు కనబర్చాడు.

చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా.. వైడ్ బాల్‌తో తన బౌలింగ్‌ను మొదలుపెట్టాడు. ఐదో ఓవర్‌లో 11 పరుగులిచ్చిన బుమ్రా.. సూపర్ యార్కర్‌తో ఫించ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. హర్షల్ పటేల్ వేసిర 6వ ఓవర్‌లో మాథ్యూ వేడ్ రెండు బౌండరీలు కొట్టడంతో 13 పరుగులు వచ్చాయి. అనంతరం బుమ్రా తన యార్కర్లతో ఆస్ట్రేలియా బౌలర్లను బెంబేలెత్తించాడు. ముఖ్యంగా అతను వేసిన 7వ ఓవర్ మూడో బంతికి స్మిత్ కుప్పకూలాడు. యార్కర్ బంతి నేరుగా అతని ఎడమ కాలికి తగలడంతో క్రీజులో కూలబడ్డాడు. అయితే ఈ ఓవర్‌లో రెండు బౌండరీలు రావడంతో 12 పరుగులు వచ్చాయి. హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్‌లో మాథ్యూ వేడ్ మూడు భారీ సిక్సర్లు బాది 19 పరుగులు పిండుకున్నారు.

Story first published: Friday, September 23, 2022, 22:20 [IST]
Other articles published on Sep 23, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+