డబుల్ సెంచరీ ముంగిట పూజారా ఔట్, 500కు చేరువలో టీమిండియా

సిడ్నీ: ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లి.. కాస్తలో అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తొలి రోజు నుంచి ఆసీస్ బౌలర్లను శాసిస్తుండగా డబుల్ సెంచరీకి దగ్గరగా వచ్చిన పుజారాను నాథన్ లయన్ పెవిలియన్‌కు పంపాడు. ఇన్నింగ్స్ 130వ ఓవర్లో నాథన్ వేసిన చివరి బంతిని ఆడిన పుజారా (193) అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
303/4తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించి
ఆటలో రెండో రోజైన శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 303/4తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత్ జట్టు.. ప్రస్తుతం క్రీజులో పంత్ (87), జడేజా(24) ఉన్నారు. 130 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి 489 పరుగులు చేసింది. గురువారం ఆఖరి సెషన్‌లో పుజారాకి సహకారం అందించిన తెలుగు క్రికెటర్ హనుమ విహారి (42: 96 బంతుల్లో 5ఫోర్లు) శుక్రవారం జట్టు స్కోరు 329 వద్ద స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
తొలి సెషన్ నుంచే దూకుడుగా ఆడిన పుజారా
శుక్రవారం వ్యక్తిగత స్కోరు 130 వద్ద ఇన్నింగ్స్‌ని కొనసాగించిన చతేశ్వర్ పుజారా.. తొలి సెషన్ నుంచే దూకుడుగా ఆడాడు. 134 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పూజారా.. మరో 65 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. పేసర్ల బౌలింగ్‌లో ఫుల్ షాట్స్, ముచ్చటైన్ కవర్ డ్రైవ్‌లతో ఆకట్టుకున్నాడు. అయితే.. 39 వ్యక్తిగత స్కోరుతో క్రీజులోకి వచ్చిన విహారి మాత్రం మరో 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
సచిన్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌లలోనే 19 వేల పరుగుల క్లబ్‌లో కోహ్లీ
ఎలాంటి తడబాటు లేకుండానే క్యాచ్
స్పిన్నర్ లయన్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ కోసం విహారి యత్నించగా.. బ్యాట్ అంచున తాకిన బంతి షార్ట్‌లెగ్‌లో గాల్లోకి లేచింది. దీంతో.. అక్కడే ఉన్న ఫీల్డర్ మార్నస్ ఎలాంటి తడబాటు లేకుండా క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ కూడా పుజారాతో సమానంగా హిట్టింగ్ చేశాడు. ముఖ్యంగా.. ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ని లక్ష్యంగా చేసుకుని అతను రెండు బౌండరీలు బాదడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications