Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: మూడో రోజు ముగిసిన ఆట.. ఆసీస్ 103/2

 India vs Australia: Labuschagne, Smith in control as Australia lead 197

సిడ్నీ: భారత్‌తో మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా మెరుగైన ప్రదర్శన చేసింది. శనివారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. ఓపెనర్లు విల్ పుకోస్కీ(10), డేవిడ్ వార్నర్ (13) తీవ్రంగా నిరాశ పర్చగా.. మార్నస్ లబుషేన్(47 బ్యాటింగ్), స్టీవ్ స్మిత్(29 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతానికి ఆసీస్ 197 పరుగుల ఆధిక్యంలో ఉంది. సిరాజ్, అశ్విన్‌కు చెరొక వికెట్ దక్కింది. అంతకు ముందు 96/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. చతేశ్వర్ పుజారా(50) ఇతర బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ నాలుగు వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్ రెండు, మిచెల్ స్టార్క్ ఓ వికెట్ తీశారు.

విఫలమైన రహానే, విహారీ..

విఫలమైన రహానే, విహారీ..

భారీ స్కోరే లక్ష్యంగా మూడో రోజు ఆటను ఆరంభించిన భారత్‌ను ఆసీస్ బౌలర్లు కట్టడి చేశారు. ఆదిలోనే కెప్టెన్ అజింక్యా రహానే(22), హనుమ విహారీ(4) లను ఔట్ చేసి దెబ్బతీశారు. కమిన్స్ బౌలింగ్‌లో రహానే క్లీన్ బౌల్డ్ కాగా.. హనుమ విహారీ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్(36)‌తో నయావాల్ చతేశ్వర్ పుజారా(50)ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆచితూచి ఆడుతూ ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. మరోవైపు పంత్ కూడా తన శైలికి భిన్నంగా ఓపికగా ఆడటంతో భారత్ 180/4 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

 దెబ్బతీసిన కమిన్స్..

దెబ్బతీసిన కమిన్స్..

పుజారా-పంత్ నిదానంగా ఆడుతుండటంతో భారత్ ఇన్నింగ్స్ మెరుగ్గానే సాగుతున్నట్లు అనిపించింది. కానీ కమిన్స్ బౌలింగ్‌లో రిషభ్ పంత్ గాయపడటం భారత్ ఇన్నింగ్స్‌ను తలకిందులు చేసింది. అతను వేసిన బంతి పంత్ ఎల్బోకు బలంగా తాకింది. దాంతో అతను నొప్పితో విలవిలలాడాడు. టీమిండియా ఫిజియో పరీక్షించి ప్రథమ చికిత్స చేయడంతో పంత్ బ్యాటింగ్ కొనసాగించాడు. కానీ మునపటిలా ఆడలేకపోయాడు. నొప్పితో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డ పంత్.. హజెల్ వుడ్ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ వికెట్ ముందు బంతికే పుజారా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పుజారా కూడా కమిన్స్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే ఔటయ్యాడు.

 ముగ్గురు రనౌట్..

ముగ్గురు రనౌట్..

క్రీజులోకి వచ్చిన జడేజా- అశ్విన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేసినా ఆసీస్ అవకాశం ఇవ్వలేదు. అనవసర పరుగుకు ప్రయత్నించి అశ్విన్ రనౌట్ కాగా.. నవ్‌దీప్ సైనీ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే బుమ్రా రనౌటవ్వడంతో జడేజా కూడా ఏం చేయలేకపోయాడు. సిరాజ్ సాయంతో కొంత పోరాడే ప్రయత్నం చేసినప్పటికీ కమిన్స్ అడ్డుకున్నాడు. సిరాజ్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చి భారత ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు.

 సిరాజ్ సూపర్ బౌలింగ్..

సిరాజ్ సూపర్ బౌలింగ్..

రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌కు సిరాజ్ గట్టి షాకిచ్చాడు. ఓపెనర్ పుకోస్కీని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి శుభారంభాన్ని అందించాడు. ఆ వెంటనే వార్నర్‌ను అశ్విన్ ఔట్ చేయడంతో ఆసీస్ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. కానీ మార్నస్ లబుషేన్, స్మిత్ ఫస్ట్ ఇన్నింగ్స్ జోరు కొనసాగించారు. ధాటిగా ఆడుతూ భారత బౌలర్లను డిఫెన్సివ్ మోడ్‌లో పడేశారు.

Story first published: Saturday, January 9, 2021, 13:28 [IST]
Other articles published on Jan 9, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+