India vs Australia: సతీమణి కోసం.. కోహ్లీ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు: లాంగర్

సిడ్నీ: కరోనా మహమ్మారి కారణంగా వచ్చిన విరామం తర్వాత తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు భారత జట్టు సిద్ధమవుతోంది. అందుకోసం మొట్టమొదటగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. అయితే ఇప్పుడు చర్చంతా కెప్టెన్ విరాట్ కోహ్లీపైనే జరుగుతోంది. టీ20లు, వన్డేలు ఆడనున్న కోహ్లీ.. టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు మాత్రమే అందుబాటులో ఉండనుండడం అందుకు కారణం. బిడ్డకు జన్మనివ్వనున్న తన భార్య అనుష్క శర్మ చెంత ఉండేందుకు సెలవు తీసుకున్న విరాట్.. మొదటి టెస్టు తర్వాత భారత్‌కు రానున్నాడు. విరాట్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశంసల జల్లు కురిపించారు.

బెస్ట్ క్రికెటర్ విరాట్:
విరాట్ కోహ్లీ ఓ సాధారణ మనిషి అని, పితృత్వ సెలవుల కోసం తీసుకున్న అతని నిర్ణయం చాలా గొప్పదని జస్టిన్ లాంగర్ పేర్కొన్నారు. 'నా జీవితంలో నేను చూసిన బెస్ట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఇలా చెప్పడానికి నా వద్ద చాలా కారణాలు ఉన్నాయి. కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు.. అతడి ఎనర్జీ, ఆట పట్ల మక్కువ, ఫీల్డింగ్ చేసే విధానం ఇలా చాలా అంశాలు అతడిపై గౌరవం కలిగించాయి. ఇక తాజాగా విరాట్ తీసుకున్న ఆ నిర్ణయం ( అనుష్క డెలివరీ సమయానికి ఇండియాకి వెళ్లాలనుకోవటం) ఆ గౌరవాన్ని మరింత రెట్టింపు చేసింది' అని లాంగర్ చెప్పారు.

పిల్లల పుట్టుకను మిస్ చేసుకోకండి
'అందరిలానే విరాట్ కోహ్లీ కూడా ఓ సాధారణ మనిషి. నేనెవరికైనా సలహా ఇవ్వాలనుకుంటే.. మీ పిల్లల పుట్టుకను మిస్ చేసుకోకండని కచ్చితంగా చెబుతాను. ఎందుకంటే అది మన జీవితంలో ఎంతో గొప్పది. తన సతీమణి కోసం కోహ్లీ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. అందుకు అభినందించాల్సిందే' అని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ అన్నారు. అనుష్క శర్మ జనవరి నెలలో మొదటి బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 21న ముగియనున్న అడిలైడ్ ఓపెనింగ్ టెస్ట్ తర్వాత ఆస్ట్రేలియా నుంచి విరాట్ కోహ్లీ ఇంటి ముఖం పట్టనున్నాడు.

ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది
'వాస్తవానికి విరాట్ కోహ్లీ లేని ప్రభావం టీమిండియాపై కచ్చితంగా ఉంటుంది. ఇది వారికి కూడా తెలుసు. టీమిండియా చాలా మంచి జట్టు. చివరిసారి మమ్మల్ని ఓడించారు. విరాట్ ఉన్నా లేకున్నా మేము ఒక్క సెకన్ కూడా ఆత్మసంతృప్తి పొందలేము. టోర్నీ గెలవడానికి ప్రయత్నిస్తాం' అని జస్టిన్ లాంగర్ చెప్పుకొచ్చారు. విరాట్ టెస్టు సిరీస్ పూర్తిగా ఆడకపోవడం వల్ల టెస్టు సిరీస్ ప్రసారదారు ఛానెల్ 7 నష్టపోనుందట. అదే సమయంలో పరిమిత ఓవర్ల సిరీస్‌లను ప్రసారం చేయనున్న ప్రత్యర్థి ఛానెల్ ఫాక్స్ స్పోర్ట్స్‌కు లాభించనుందట.

కోహ్లీ లేకున్నా భారత్‌ను తక్కువ అంచనా వేయం
విరాట్ కోహ్లీ లేకున్నా భారత్‌ను తాము తక్కువ అంచనా వేయబోమని ఆసీస్ స్పిన్నర్ నాథన్ లైయన్ అన్నాడు. 'పుజారా, రహానె వంటి సీనియర్ ఆటగాళ్లతో పాటు కుర్రాళ్లూ భారత జట్టులో ఉన్నారు. ఇప్పటికీ ఈ సిరీస్ మాకు గట్టి సవాలే. విరాట్ లేనంత మాత్రాన ట్రోఫీ మా చేతికి చిక్కినట్లు కాదు' అని చెప్పాడు. ఇక చివరి మూడు టెస్టులకు కోహ్లీ దూరమైన నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు టెస్టు సిరీస్‌ను అలవోకగా గెలుస్తుందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ అభిప్రాయపడ్డాడు.
India vs Australia: తాను ఫిట్ అని ప్రకటించుకున్నా.. యోయో పరీక్షలో పాసైతేనే ఆసీస్‌కు రోహిత్!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications