Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: తాను ఫిట్‌ అని ప్రకటించుకున్నా.. యోయో పరీక్షలో పాసైతేనే ఆసీస్‌కు రోహిత్‌!!

India vs Australia: If Rohit Sharma clears Yo-Yo test, set to travel for Australia tour
India vs Australia 2020 : Rohit Sharma In, Virat Kohli May Out Of Last 2 Tests

హైదరాబాద్: ఐపీఎల్‌ 2020 ముగిసిన వెంటనే రెండు నెలల సుదీర్ఘ పర్యటన కోసం విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టింది. మొత్తం 25 మందితో కూడిన భారత బృందం గురువారం మధ్యాహ్నం అక్కడకు చేరుకుంది. అయితే గాయపడిన టీమిండియా పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ బెంగళూరు చేరుకున్నాడు. కీలక ఆసీస్ పర్యటనకు ముందు మెగా ఈవెంట్లో కొందరు కీలక భారత ఆటగాళ్లు గాయపడటం కోహ్లీసేనకు దెబ్బే. మరీ ముఖ్యంగా రోహిత్‌ శర్మ గాయం జట్టుకు భారీ నష్టమే. ఎందుకంటే రోహిత్‌ గత కొన్నేళ్లుగా మూడు ఫార్మాట్లలో టీమిండియాకు కీలక ఆటగాడిగా మారాడు.

తొడ కండరాల గాయం:

తొడ కండరాల గాయం:

రోహిత్ శర్మ‌కు ఐపీఎల్‌ 2020లో తొడ కండరాల గాయం అవ్వడంతో ఆసీస్ పర్యటన కోసం మూడు ఫార్మాట్లకు ఎంపిక చేసిన భారత జట్టులో అతనికి తొలుత చోటు దక్కలేదు. బీసీసీఐ వైద్య బృందం అంచనాలను తలకిందులు చేస్తూ అనుకున్న సమయం కంటే ముందే రోహిత్‌ ఫిట్‌గా తయారయ్యాడు. అంతేకాదు ఫైనల్లో అర్ధ శతకం కూడా బాది ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆసీస్‌ పర్యటనలో ఆడాలన్న పట్టుదలే రోహిత్‌ను ఫిట్‌గా మార్చేసి ఉంటుందని పలువురు అభిప్రాయపడ్డారు.

ఫిట్‌ అని ప్రకటించుకున్నా:

ఫిట్‌ అని ప్రకటించుకున్నా:

అయితే ఫిట్‌నెస్‌ విషయంలో బీసీసీఐ ప్రమాణాలు వేరు, ఫ్రాంచైజీ అనుసరించే పద్ధతులు వేరు. రెండింటిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో యోయో పరీక్ష పాసైన ఆటగాళ్లకే భారత జట్టులో చోటు దక్కుతుంది. అత్యుత్తమ ఫీల్డర్‌గా పేరుగాంచిన సురేశ్‌ రైనా సైతం యోయో పరీక్షలో విఫలమైన సందర్భాలు ఉన్నాయి. బీసీసీఐ ప్రమాణాలు అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. రోహిత్‌ తనకు తాను ఫిట్‌ అని ప్రకటించుకున్నా.. సంతృప్తి చెందని బీసీసీఐ వన్డేలు, టీ20లకు అతడికి విశ్రాంతినిచ్చింది. ఇక టెస్టులకు సిద్ధమయ్యేందుకు 15 రోజుల గడువు ఇచ్చింది.

పాసైతేనే ఆసీస్‌కు:

పాసైతేనే ఆసీస్‌కు:

ఐపీఎల్ ముగిసిన అనంతరం రోహిత్‌ శర్మ నేరుగా బెంగళూరులోని ఎన్‌సీఏకు చేరుకున్నాడు. డిసెంబరు 17న అడిలైడ్‌లో తొలి టెస్టు ప్రారంభమవుతుంది. నిబంధనల ప్రకారం ఆసీస్‌లో అడుగుపెట్టిన వాళ్లకి 14 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి. తొలి టెస్టు ఆడాలంటే కనీసం 2, 3 రోజుల ముందు నుంచి జట్టుకు అందుబాటులో ఉండాలి. ఆ లెక్కల ప్రకారం ఈ నెలాఖరు లోపు అక్కడికి చేరుకోవాలి. ఎన్‌సీఏలో మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించిన తర్వాత.. యోయో పరీక్షలో రోహిత్‌ పాసైతేనే ఆసీస్‌కు పయనమవుతాడు. ఈ రెండు వారాల్లో రోహిత్ ఫిట్‌నెస్‌ ఎలా సాధిస్తాడా చూడాలి.

ఎన్‌సీఏలోనే ఇషాంత్:

ఎన్‌సీఏలోనే ఇషాంత్:

ఐపీఎల్‌లో గాయానికి గురైన పేసర్ ఇషాంత్ శర్మ ప్రస్తుతం ఎన్‌సీఏలో ఉన్నాడు. టెస్టు జట్టులో చోటు సంపాదించిన ఇషాంత్..‌ గాయం నుంచి కోలుకుని, మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తే ఆసీస్‌కు బయల్దేరతాడు. ఇక వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా ఫిట్‌నెస్‌పై స్పష్టత లేదు. ఐపీఎల్‌ మ్యాచ్‌లో సాహా తొడ కండరాలకు గాయాలయ్యాయి. టెస్టుల్లో టీమిండియాకు మంచి వికెట్‌ కీపర్‌గా పేరు తెచ్చుకున్న సాహా కోసం బీసీసీఐ ఎదురుచూస్తోంది. అందుకే అతడిని జట్టు నుంచి తొలగించలేదు, మరో వికెట్‌ కీపర్‌తో అతడి స్థానాన్ని భర్తీ చేయలేదు.

రోహిత్‌ కెప్టెన్సీ సూపర్.. గంగూలీ, ధోనీ కలబోతే హిట్‌మ్యాన్: పఠాన్

Story first published: Friday, November 13, 2020, 10:35 [IST]
Other articles published on Nov 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+