
హెల్మెట్‌కి తాకిన బంతి:
విషయంలోకి వెళితే... భారత్ బ్యాటింగ్ చేస్తుండగా ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన జోష్ హేజిల్‌వుడ్.. రెండో బంతిని బౌన్సర్ రూపంలో సంధించాడు. అయితే ఆ బంతిని ఫుల్ చేసేందుకు రవీంద్ర జడేజా ప్రయత్నించగా.. బ్యాట్‌కి కనెక్ట్ కాని బంతి నేరుగా వెళ్లి అతడి హెల్మెట్‌ని బలంగా తాకింది. అయితే హెల్మెట్‌ని మార్చుకున్న జడేజా.. ఆ ఓవర్‌లో వరుసగా 6, 4, 4 బాదాడు. అంతేకాకుండా చివరి ఓవర్‌లోనూ జడేజా బ్యాటింగ్ కొనసాగించాడు. ఇక 19వ ఓవర్‌లోనే అతని తొడ కండరాలకి గాయమైంది. జడేజా చెలరేగడంతోనే భారత్ 161 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా కోచ్ సీరియస్:
అనంతరం ఫీల్డింగ్ కోసం భారత్ మైదానంలోకి వెళ్లగా.. రవీంద్ర జడేజాకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ మైదానంలోకి వచ్చాడు. అయితే జడేజా స్థానంలో చహల్ రావడంపై ఆస్ట్రేలియా కోచ్ లాంగర్, కెప్టెన్ అరోన్ ఫించ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్‌తో గొడవకి దిగారు. జడేజాకు కాంకషన్ సబ్‌స్టిట్యూట్ ఎలా ఇస్తారంటూ లాంగర్ చాలా ఆగ్రహంగా అడుగుతుండటం వీడియోలో కనిపించింది. కాంకషన్ సబ్‌స్టిట్యూట్ నిబంధనల మేరకు తాను చహల్‌ని అనుమతించినట్లు ఆయన స్పష్టం చేశారు. బ్యాట్‌మెన్ కాంకషన్‌కి గురై ఆటని కొనసాగించినా.. ఇన్నింగ్స్ బ్రేక్‌లో వైద్యులు అతడికి విశ్రాంతి అవసరమని సూచిస్తే.. కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌ని అనుమతించేలా రూల్స్ ఉన్నాయి.

బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు అర్హుడు:
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గత ఏడాది ఆగస్టులో కాంకషన్ సబ్‌స్టిట్యూట్ రూల్‌ని తెరపైకి తెచ్చింది. కాంకషన్‌కి గురైన ఆటగాడి స్థానంలో జట్టులోకి వచ్చే క్రికెటర్ బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు అర్హుడు. తొలి టీ20లో చహల్ బౌలింగ్ చేయడమే కాకుండా.. తాను వేసిన తొలి రెండు ఓవర్లలో అరోన్ ఫించ్ (35), స్టీవ్ స్మిత్ (12).. ఆ తర్వాత వేడ్ (7) వికెట్లని పడగొట్టాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

భారత్ విజయం:
తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. కోహ్లీసేన నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు 150/7కే పరిమితమైంది. దీంతో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించి.. పొట్టి సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. చహల్ 3/25, నటరాజన్ 3/30 విజృంభించడంతో కంగారూలు చేతులెత్తేశారు. ఆర్కీ షార్ట్ (34; 38 బంతుల్లో 3x4), ఆరోన్ ఫించ్ (35; 26 బంతుల్లో 5x4, 1x6) పోరాడారు.
ఆరంగేట్ర మ్యాచ్‌లో చెలరేగిన నట్టూ.. మాయ చేసిన చహల్.. తొలి టీ20లో భారత్ విజయం!!


Click it and Unblock the Notifications












