పృథ్వీ షాకు సలహాలు ఇవ్వను.. ఆ సిక్స్‌తోనే లయ అందుకున్నా: ఆసీస్ ఓపెనర్

మెల్‌బోర్న్: డే/నైట్ టెస్ట్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీషాకు తాను ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వనని ఆస్ట్రేలియా ఓపెనర్ జో బర్న్స్ అన్నాడు. విల్ పుకోవిస్కీ, డేవిడ్ వార్నర్‌లు గాయపడటంతో టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్న జో బర్న్స్ రెండు వామప్ మ్యాచ్‌లతో పాటు పింక్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు.
దాంతో ఈ యువ ఆసీస్ ఓపెనర్ కూడా ప్రస్తుతం షాలానే విమర్శలను ఎదుర్కొన్నాడు. కానీ రెండో టెస్ట్ సూపర్ ఫిఫ్టీతో ఫామ్ అందుకొని అందరి నోళ్లు మూయించాడు. ఈ క్రమంలో తాజాగా మీడియాతో మాట్లాడిన జోబర్న్స్‌ను పథ్వీషాకు ఏమైనా సలహాలు ఇవ్వచ్చుగా? అని అడిగిన ప్రశ్నకు తాను ఎలాంటి సూచనలు చేయనని చెప్పుకొచ్చాడు.

సిరీస్ పూర్తయిన తర్వాత..
‘ప్రత్యర్థిగా పృథ్వీషాకు ఎలాంటి సలహాలు ఇవ్వలేను. అతను పరుగులు చేయవద్దనే నేను కోరుకుంటా. వాస్తవానికి అతని ఆట గురించి నాకు పెద్దగా తెలియదు. అతన్నీ నేను అంతాగా ఫాలో అవ్వలేదు. భారత్‌కు ఆడుతున్నాడంటే అతను ఎంతో సత్తా ఉన్న ఆటగాడయ్యే ఉండాలి. కావాలంటే సిరీస్ పూర్తయ్యాక సలహాలు ఇస్తాను. కానీ ఫస్ట్ మ్యాచ్ తర్వాత అతనికి ఎలాంటి సూచనలు చేయలేను'అని బర్న్స్ ఏఎన్‌ఐ న్యూస్ ఏజెన్సీతో అన్నాడు.

లయ అందుకున్నా..
ఇక ఫామ్ అందుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. నిలకడలేమి ఆటతో ఇబ్బంది పడ్డ అతను తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించి ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో కొట్టిన సిక్స్‌తోనే తాను లయ అందుకున్నానని ఈ ఆస్ట్రేలియా ఓపెనర్ పేర్కొన్నాడు. తిరిగి ఫామ్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇదే జోరును రెండో టెస్ట్‌లో కూడా చూపిస్తానని తెలిపాడు.

రెండో టెస్ట్ కీలకం..
బాక్సింగ్‌డే టెస్టులో తమ జట్టు విజయం సాధిస్తే అది సిరీస్ ఫలితాన్ని నిర్దేశిస్తుందని చెప్పాడు. దీంతో సిరీస్ ఫలితంలో రెండో టెస్టు కీలకంగా మారనుందని తెలిపాడు. ‘తొలి టెస్టు జోరునే రెండో టెస్టులో కొనసాగించాలి. అందుకోసం ఆస్ట్రేలియా బాగా సన్నద్ధమౌతుంది. మరోవైపు టీమిండియా సైతం రెండో టెస్టుకు పుంజుకుంటుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రధాన పేసర్ మహ్మద్ షమీ రెండో టెస్టు నుంచి ఆడకపోవడం భారత జట్టుకు పెద్ద లోటే. కానీ వాళ్లు లేకపోయినా భారత జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. దాంతో రెండో టెస్టు సవాలుగా మారనుంది.'అని జో బర్న్స్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications